
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడు గౌరవప్రదంగా రాజీనామా చేయాల్సి ఉంటుందని, కానీ ఉదయ్ భాస్కర్ మాత్రం ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కుట్ర పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాజధానుల తరహాలోనే మూడు ఏపీపీఎస్సీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే విధానం కొనసాగుతోందన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.