uday bhaskar
-
24.44 బిలియన్ డాలర్లకు దేశీయ ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 20.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు 2.3 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. 2020 మార్చి నెలతో పోలిస్తే 48.5 శాతం వృద్ధి అని.. ఆ నెలలో ఎగుమతులు 1.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సప్లయి చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని దీంతో ఎగుమతులు క్షీణించాయని.. ఈ కారణంగా ఈ ఏడాది మార్చి ఎగుమతుల్లో పెద్ద వృద్ధి రేటుగా అనిపిస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రపంచ ఫార్మా మార్కెట్ 1–2 శాతం క్షీణంచి.. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాణ్యత, అందుబాటు కారణంగా భారతీయ జనరిక్ మందులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దేశీయ ఫార్మా ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్న దేశాల్లో 34 శాతం వాటాతో ఉత్తర అమెరికా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత కెనడా 30 శాతం, మెక్సికో 21.4 శాతంగా ఉన్నాయి. -
ఫార్మా ఎగుమతులకు వైరస్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతుల మీద కరోనా గట్టి దెబ్బే వేసింది. కేంద్రం కొన్ని రకాల ఔషధాల ఎగుమతుల మీద నియంత్రణ పెట్టడం, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ 22 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోలేదని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 19.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని.. 2020 ఆర్ధిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశామని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. గతేడాది మార్చి ఒక్క నెలలోనే 2.1 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయన్నారు. 2017–18లో ఫార్మా ఎగుమతులు 17.28 బిలియన్ డాలర్లు. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి కరోనా నియంత్రణలో వినియోగించే ఔషదాల ఎగమతుల మీద కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. ఫార్మా ఎగుమతుల్లో వీటి వాటా 600 మిలియన్ డాలర్లుంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 18.74 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించామని తెలిపారు. -
3 ఏపీపీఎస్సీలను ఏర్పాటు చేయాలి
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడు గౌరవప్రదంగా రాజీనామా చేయాల్సి ఉంటుందని, కానీ ఉదయ్ భాస్కర్ మాత్రం ఇంకా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కుట్ర పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాజధానుల తరహాలోనే మూడు ఏపీపీఎస్సీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే విధానం కొనసాగుతోందన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి’
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం ఐదుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఏపీపీఎస్సీ, యూరేనియం తవ్వకాలకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో ఆయన తీరు వల్ల లక్షలాది అభ్యర్థులు అవస్థలు పడ్డారని విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా ప్రతి ఏడాది సిలబస్ మార్చేశారని మండిపడ్డారు. గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల సిలబస్‌కు.. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సంబంధం లేదని, అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. నెగిటివ్ మార్కులు వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్ధులు నష్టపోయారని గుర్తు చేశారు. ఈ అంశాలపై గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించామని వెల్లడించారు. ఈస్టర్ పండుగ రోజు కూడా పరీక్ష నిర్వహించారని తప్పుపట్టారు. ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను వెంటనే తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఏపీలో యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఈ తవ్వకాల వల్ల చెరువుల్లో నీరు కలుషితం అవుతుందని విమర్శించారు. ఈ విషయమై అధ్యయనం చేసి ఒక యూనివర్శిటీ నివేదిక ఇస్తే.. అది బయటకురాకుండా ఆపేశారని మండిపడ్డారు. ఎలాంటి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. -
సుడిగుండాల వల్లే లాంచీ ప్రమాదం..?
-
గతంలో ఉదయ్ భాస్కర్, ఝాన్సీరాణి కూడా..
సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద రాయల్ వశిష్ట బోటు మునక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1960లో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగిపోవడంతో 8మంది మృతి చెందారు. కచులూరు మందం ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయితో పాటు నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా 2017లో విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చదవండి: గోదావరిలో ప్రమాద సుడిగుండాలు బోట్లలో భద్రత ప్రశ్నార్థకం నాటు పడవలే ఆధారం.. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో గౌతమి, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల తీరం వెంబడి ఉన్న పలు గ్రామాలకు నాటు పడవలే ఆధారం. వాటిమీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవన యానం సాగిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సరైన రహదారి వసతులు లేక తప్పనిసరి పరిస్దితుల్లో పడవలను ఆశ్రయించి ఎందరో లంక గ్రామాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది (2018) జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే దేవీపట్నం మండలంలో జరిగిన పర్యటక బోటు ప్రమాదం జిల్లా వాసులను కలచి వేసింది. చదవండి: 8 మంది మృతి, 25మంది గల్లంతు! శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు... క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి బోటులో ఎక్కువమంది తెలంగాణవారే! బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ రాయల్ వశిష్టకు అనుమతి లేదు... పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్ పాపికొండలు విహార యాత్రలో విషాదం! -
దసరాకి అదుగో
రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పందిపిల్ల కీలక పాత్రలో నటించడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్లో రవిబాబు నిర్మించిన ఈ సినిమా దసరాకి రానుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపించబోతున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో ‘బంటి’ పేరుతో విడుదలవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా సెలవుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. అభిషేక్ వర్మ, నభా, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: పశ్రాంత్ ఆర్. విహార్, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
ప్రత్యేక ఫార్మా క్లస్టర్లకు సిఫార్సు!
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఫార్మా సిటీల మాదిరిగా ప్రత్యేక (ఎక్స్‌క్లూజివ్) ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు ప్రభుత్వరంగ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఆర్. ఉదయ్ భాస్కర్ తెలిపారు. దీనివల్ల ఫార్మారంగం వృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో ఫార్మా ఇండస్ట్రీ సదస్సుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మందుల ఎగుమతుల్లో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలోను, వాల్యూలో 10వ స్థానంలో ఉందని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్ ఎదుగుతోందన్నారు. చైనాలో మనకన్నా తక్కువ ధరలకే చాన్నాళ్లుగా యాంటీబయాటిక్స్, తదితర మందుల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యమవుతుండడం వల్ల అక్కడ నుంచి వాటి దిగుమతికి ఎక్కువగా భారత్ ఆధార పడుతోందన్నారు. కానీ కొన్నాళ్లుగా చైనాలో ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో భారత్ నుంచి అక్కడకు ఎగుమతులు మొదలయ్యాయని, ఇది మనకు మంచి పరిణామమని తెలిపారు. ఇలాంటి వాటిని మనదేశంలో విస్తృతం చేస్తే ఇతర దేశాలకు గణనీయంగా ఎగుమతి చేయడానికి వీలుంటుందని, దీంతో ఫార్మా కంపెనీలు లాభాలు ఆర్జిస్తాయని వివరించారు. ప్రస్తుతం ఫార్మాక్సిల్ దృష్టి సారిస్తోందన్నారు. చాలా దేశాలు ఔషధ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకు తక్కువ ధరలకే మందుల లభ్యత తప్పనిసరన్నారు. మందుల ఎగుమతుల్లో భారత్‌కు చైనాతో పాటు అమెరికా, యూరప్ దేశాలు ప్రధాన పోటీదార్లుగా ఉన్నారని చెప్పారు. రెగ్యులేటెడ్ మార్కెట్‌కి భారత్ 50 శాతం మందులను ఎగుమతి చేస్తోందన్నారు. ఔషధాల దిగుమతులపై ఉన్న నిషేధంపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతుందని, ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఫార్మా పాలసీ రూపొందించడంలో ఫార్మెక్సిల్ ప్రభుత్వానికి సలహా ఇస్తుందని వివరించారు. ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్.. కొన్ని దేశాల్లో మన దేశ ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు రిజిస్ట్రేషన్ అవసరమని ఉదయ్ భాస్కర్ తెలిపారు. అందుకయ్యే ఖర్చులో 50 శాతం గాని, లేదా రూ.50 లక్షలు మించకుండా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ ఫార్మా కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, ఎగుమతులు, ఆయా దేశాలకు అవసరాలేమిటన్న దానిపై ప్రతినిధులతో చర్చలుంటాయని వివరించారు. దేశంలో ఫార్మెక్సిల్కు ఔషధ ఎగుమతులు చేసే 3500 మంది సభ్యులున్నారని ఉదయ్‌భాస్కర్ తెలిపారు. -
ఇంటర్వ్యూల్లో మాయాజాలం!?
రాత పరీక్షల్లో వారు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.. తమ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని ఎన్నో కలలుగన్నారు. జాబ్ గ్యారంటీ అనుకున్నారు.. తీరా ఫలితాలు చూశాక నీరుగారిపోయారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ అధ్యాపక పోస్టుల ఫలితాలు పలువురు అభ్యర్ధులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినా ఇంటర్వ్యూలో మార్కులు బాగా తగ్గిపోవడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా ఇంటర్వ్యూల్లో మార్కులు వేశారంటూ అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, కామర్స్, ఎకనమిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటస్టిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్సు, జియాలజీ సబ్జెక్టులకు సంబంధించి 504 అధ్యాపక పోస్టుల భర్తీకి 2016 డిసెంబర్ 27న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి రాత, మౌఖిక పరీక్షలు ముగించి ఇటీవలే మార్కులను ప్రకటించింది. ఇవి తెలుసుకుని అనేకమంది అభ్యర్ధులు అవాక్కయ్యారు. బోర్డు చేసిన ఇంటర్వ్యూ తీరు, మార్కుల కేటాయింపు రోజుకో రకంగా సాగినట్లు మార్కులు చూస్తే తేటతెల్లమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. మౌఖికంలోనే మతలబు? ఆంగ్లం సబ్జెక్టులో 58 పోస్టులకు పరీక్షలు నిర్వహించి క్వాలిఫై అయిన వారిని 1 : 2 చొప్పున 116 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి గత ఏడాది నవంబర్ నెలాఖరులో ఏడు రోజులపాటు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు రోజులు, చివరి రెండు రోజులూ బోర్డు సభ్యులు గరిష్ఠంగా 45 వరకు మార్కులు వేశారని అభ్యర్ధులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లో బోర్డు సభ్యులు 9–20 లోపు మాత్రమే మార్కులు వేశారని దీనివల్ల తాము అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదాహరణకు.. నవంబర్ 27న జరిగిన ఇంటర్వ్యూల్లో ఒక్క అభ్యర్ధికి వచ్చిన 13.5 మార్కులు మినహాయిస్తే ఆ రోజున ఇంటర్వ్యూకి హాజరైన వారికి 23 నుంచి 45 మార్కుల వరకు వేశారు. రాత పరీక్షలో 261.65 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి ఇంటర్వ్యూలో కేవలం 13 మార్కులు వేశారు. అలాగే, మరో అభ్యర్థికి రాత పరీక్షలో 262.4 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో పది వచ్చాయి. మరో ఇద్దరు అభ్యర్ధులకు వరుసగా 257, 258 మార్కులు వచ్చినా మౌఖికంలో 15 మార్కులు వేశారు. అదే మరో రోజున జరిగిన ఇంటర్వ్యూలో, రాత పరీక్షలో 202 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి మౌఖికంలో 45 మార్కులు, 170 మార్కులు వచ్చిన మరో వ్యక్తికి 40 మార్కులు వేశారు. అలాగే, రాతపరీక్షలో వరుసగా 212, 203 మార్కులు వచ్చిన మరో ఇద్దరికి 33, 39.5 మార్కులు వేశారు. వాస్తవానికి ఇంటర్వ్యూలు ముగిసిన ఒకటి రెండు రోజుల్లోనే ఫలితాలు వెలువడేవని.. కానీ ఈసారి 40 రోజుల తరువాత ప్రకటించారని బాధిత అభ్యర్ధులు ఆరోపించారు. అనుమానాలు సహజం ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులు మారడమనేది ఎపీపీఎస్సీ ప్రక్రియలో సర్వసాధారణం. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పిన వారికే మార్కులు వేస్తారు. అలాగే, వారి భావ వ్యక్తీకరణను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, బోర్డు బోర్డుకీ మధ్య మార్కులు వేయడంలో వ్యత్యాసాలపై అనుమానాలు, వివాదాలు సహజంగానే ఎప్పుడూ వస్తుంటాయి. బోర్డు సభ్యులను వీటిపై ప్రశ్నించలేం. – ప్రొ.పి. ఉదయభాస్కర్, ఏపీపీఎస్సీ చైర్మన్ -
ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నూతన కార్యాలయాన్ని చైర్మన్ పిన్నమనేని ఉదయ భాస్కర్ గురువారం ప్రారంభించారు. నగరంలోని ఎంజీ రోడ్డులో గల ఆర్ అండ్ బీ భవనంలోని రెండో అంతస్తును ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యాలయానికి కేటాయించింది. 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, జనవరి 2018 నుంచి విజయవాడ నుంచే పూర్తి స్థాయి కార్యాకలాపాలు జరుగుతాయని ఉదయ్ భాస్కర్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకు హైదరాబాద్ లోని కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిపికేషన్ జనవరి రెండో వారంలో విజయవాడలోనే జరుగుతుందని స్పృష్టం చేశారు. కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీని ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా , గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు పరీక్షలలో సెలక్ట్ అయిన వారికి నచ్చిన ఉద్యోగంలో చేరేందుకు ఆఫ్షన్ ఇస్తామని ఆయన వెల్లడించారు. -
పరీక్ష పారదర్శకంగా నిర్వహించాం
-
‘నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు’
విశాఖపట్నం: నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఈ రోజు రాత్రి మూడు పేపర్లకు సంబంధించిన కీ విడుదల చేస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీకి పంపిస్తామని చెప్పారు. అనంతరం రివైజ్డ్ కీ విడుదల చేస్తామన్నారు. రివైజ్డ్ కీ విడుదల చేసిన మూడు రోజుల తర్వాత తుది కీ వెల్లడిస్తామని అన్నారు. గీతం యూనివర్సిటీ ఘటనలో సీసీ టీవీ ఫుటేజీ ద్వారా 41 మంది అభ్యర్థులను గుర్తించామని, వారిపై నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ఉదయ్‌భాస్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 సెంటర్లలో 45,287 మంది గ్రూప్-2 మెయిన్స్‌కు హాజరయ్యారని వెల్లడించారు. -
91 చోట్ల బతుకమ్మ సంబురాలు
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ జోగిపేట: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జి. ఉదయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం అందోలు గెస్ట్‌హౌస్‌లో బంగారు పండుగ వాల్‌పోస్టర్, పాటల సీడీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తంగా 1100 ప్రాంతాల్లో, జిల్లాలో 90 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మలను అందంగా, సాంప్రదాయపద్ధతిలో పేర్చిన వారిని గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు. అందోలు నియోజవకర్గంలోని 7 మండలాల్లో 9 చోట్ల వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో బంగారు బతుకమ్మల మెదక్, నిజామాబాద్ జిల్లాల ఇన్‌చార్జ్‌లు ఉదయ్‌కిరణ్, భిక్షపతి, తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లిక, నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌రాజ్, కో ఇన్చార్జి అశోక్ ముదిరాజ్, కో కన్వీనర్ గీతారెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్లు బాలమణి, వీరమణి, యూత్ విభాగం కన్వీనర్ శేఖర్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు సురేష్‌రెడ్డి, మండల కన్వీనర్ బి. చంద్రశేఖర్, నాయకులు వినోద్ పాల్గొన్నారు. -
నెలాఖరుకు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి మార్కాపురం: ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇకపై ఏపీపీఎస్సీ ప్రతి ఏడాది క్యాలెండర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి రోస్టర్ విధానంలో భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 2011 మెయిన్స్ పరీక్ష జరుగుతోందని, త్వరలో ఫలితాలను ప్రకటించి, ఇంటర్వూ్యలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు. సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వెన్నా హనుమారెడ్డి, ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మీర్జా షంషీర్ అలీబేగ్‌లు పాల్గొన్నారు. -
4009 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్
విశాఖపట్నం : ఏపీపీఎస్సీ నుంచి 4009 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఉదయ్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతి ఏడాది పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. గతంలో కోర్టు కేసులను పరిగణలోకి తీసుకోని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉదయ్‌భాస్కర్ వివరించారు. -
740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ, ఆర్‌ఆండ్‌బీ సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 740 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. వయో పరిమితిని 40 ఏళ్లకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 4 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచే సిన నేపథ్యంలో ఆగస్టులో వరుసగా నోటిఫికేషన్లు జారీచేయడానికి ఆసంస్థ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు మొదటి వారంలో తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు వివరించారు. ‘ఏపీపీఎస్సీలోని గ్రూప్ 1, 2, 3లోని పోస్టులను ఆయా కేటగిరీల్లోనే పాత విధానంలోనే భర్తీచేస్తాం. పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీలోని రూల్ 6ను అనుసరించారు. ఈ ప్రకారం మిగిలిపోయిన పోస్టులు తదుపరి నోటిఫికేషన్లోకి మళ్లించాలి. రూల్ 7 అందుకు భిన్నంగా తదుపరి ఖాళీలను మెరిట్ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్న వారితో భర్తీచేయాలని సూచిస్తోంది. రూల్7ను రద్దుచేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇక నుంచి రూల్6 ప్రకారమే భర్తీ ఉంటుంది.’ అని ఆయన తెలిపారు. -
ఆరోపణలు పునరావృతం కాకుండా చూస్తా
-
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుడి మృతి
వరంగల్ : వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఆకస్మికంగా మృతి చెందారు. ఎమ్మెల్యే సోదరుడు ఉదయ్ భాస్కర్ బుధవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనంతబాబుపై కేసులో హైకోర్టు స్టే
రంపచోడవరం : జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత దాఖలు చేసిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీ వైపు వెళ్లడంపై అనంత ఉదభాస్కర్ పత్రికల్లో ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె ఆయనపై విశాఖపట్నం 4వ పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమమని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంత ఉదయభాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయాన్ని అనంతబాబు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయమే గెలిచింది: అనంత బాబు స్వార్థ ప్రయోజనాలు కోసం తనపై అక్రమంగా, అన్యాయంగా అధికార పార్టీ అండదండలతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని అనంతబాబు ఆప్రకటనలో పేర్కొన్నారు. -
నాబార్డ కృషి అభినందనీయం
కలెక్టరేట్ : జిల్లాలో గ్రామీణాభివృద్ధికి, పల్లె ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో నాబార్డ్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాబార్డ్ 33వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేసిన బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, రైతు క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం నాబార్డ్ ఏజీఎం ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో నాబార్డ్ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ఐడీఎఫ్(రూ.480కోట్లు) అమలవుతోందని, ఇందులో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ గిడ్డంగులు, రోడ్లు, వంతెనల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఏటూరునాగారం, తాడ్వాయి, మరిపెడ మండలాల్లో సుమారు *2.50కోట్లతో తోటలు పెంచుతున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ధనుంజయ్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, ఏడీఎం.సాయిప్రసాద్, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీకి నాబార్డ్ అవార్డు హన్మకొండ సిటీ : ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు డీసీసీబీ నాబార్డ్ అవార్డుకు ఎంపికయింది. కలెక్టర్ చేతుల మీదుగా డీసీసీబీ జనరల్ మేనేజర్ వి.సురేం దర్ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. డీసీసీబీ 31 ఏళ్ల తరువాత రూ.1.37 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది రైతులకు రూ.330 కోట్ల రుణాలందించింది. రూ.124కోట్ల డిపాజిట్ సేకరించి, జిల్లాలో మల్టీపర్పస్ బిజినెస్ కింద 26 గోదాంలు నిర్మించిందని మేనేజర్ సురేందర్ చెప్పారు. -
ఆగని ‘సాఫ్ట్వేర్’ మోసాలు
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: మొన్న సోమాజిగూడలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో మోసం..తాజాగా నారాయణగూడలో ఓ కన్సల్టెన్సీ వంచన. నిరుద్యోగుల అమాయకత్వాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన భవనం, ఫర్నీచర్, కంప్యూటర్లు ఏర్పాటు చేసి, మంచి వేతనాలిప్పిస్తామంటూ డిపాజిట్ల పేరుతో రూ.కోట్లకు టోపి పెడుతున్నారు. చివరకు బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నారాయణగూడ ఎస్సై డేనియేల్ కథనం ప్రకారం..సతీష్ అనే వ్యక్తి హిమాయత్‌నగర్ 18వ వీధి వద్ద ఉన్న ఓ బిల్డింగ్‌లో ‘హెచ్ఆర్ ఈ-సాల్వ్ సొల్యూషన్స్’ పేరుతో కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. టీసీఎస్ లాంటి పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలు రకాలు ప్రచారం చేసుకున్నాడు. ఇతనికి గోపాల్ అనే వ్యక్తి సహాయంగా ఉండేవాడు. సంస్థ ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు నిరుద్యోగులు ఆశ్రయించగా.. వారి వద్ద నానాహంగామా చేసి ‘మీ బయోడేటాలను సదరు కంపెనీలకు పంపుతున్నాము, మీకు ఉద్యోగం ఖాయం, రెండు నెలల్లో భారీ వేతనం అందుకోబోతున్నారని’ నమ్మించేవారు. వారి ముందే ఆయా సాఫ్ట్వేర్ కంపెనీలకు మెయిల్స్ కూడా పంపేవారు. వీటిని నమ్మిన పలువు రు లక్షా 20వేల నుంచి లక్షన్నర వరకు హెచ్ఆర్ ఈ-సాల్వ్ యాజమాన్యానికి చెల్లించారు. సంస్థ మా టలు నిజమని నమ్మిన నిరుద్యోగులు వారు చెప్పిన తేదీల్లో ఆయా కంపెనీలకు వెళ్లగా ‘ఈ-సాల్వ్’ సంస్థకు మాకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో మోసం బయటపడింది. కొద్దిరోజులుగా బాధితుల ఒత్తిడి పెరగడంతో సంస్థ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తివేసింది. బాధితులకు సుమారు రూ.50లక్షల వరకు సంస్థ కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఫజియుద్దీన్తోపాటు పలువురి ఫిర్యాదుమేరకు పోలీసులు కే సు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కటకటాల్లోకి ‘సాఫ్ట్’ మోసగాళ్లు శ్రీనగర్‌కాలనీ: సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి, పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌కుమార్ వివరాల ప్రకారం..తమిళనాడుకు చెందిన సంతాన కృష్ణ చాలాకాలం క్రితం నగరానికి వచ్చి సోమాజిగూడలోని ఓ భారీ భవనంలో డిస్ట్రీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో నగరానికి చెందిన ఉదయ్‌భాస్కర్‌ను హెచ్ఆర్ మేనేజర్‌గా నియమించుకొని ఇద్దరు కలిసి ఉన్నత చదువులు చదవి ఉద్యోగవేటలో ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. తమ సంస్థలో శిక్షణ తీసుకుంటే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని..ఒకవేళ రాకపోయినా తమ వద్దే ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు తీసుకున్నారు. మూడునెలల వరకు స్టైఫండ్ చెల్లించిన కృష్ణ నాల్గోనెల నుంచి ముఖం చాటేయడంతో పలువురు ఒత్తిడి చేశారు. పథకం ప్రకారం ఈనెల 24న రాత్రికిరాత్రే సంస్థలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ తీసుకొని ఉడాయించారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతాన కృష్ణ, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.