
సాక్షి, దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద రాయల్ వశిష్ట బోటు మునక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1960లో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగిపోవడంతో 8మంది మృతి చెందారు. కచులూరు మందం ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బోటు ఎగువకు వెళ్లే చోట బలమైన రాయితో పాటు నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా 2017లో విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా పడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
చదవండి: గోదావరిలో ప్రమాద సుడిగుండాలు
నాటు పడవలే ఆధారం..
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో గౌతమి, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయల తీరం వెంబడి ఉన్న పలు గ్రామాలకు నాటు పడవలే ఆధారం. వాటిమీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవన యానం సాగిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సరైన రహదారి వసతులు లేక తప్పనిసరి పరిస్దితుల్లో పడవలను ఆశ్రయించి ఎందరో లంక గ్రామాల ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది (2018) జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే దేవీపట్నం మండలంలో జరిగిన పర్యటక బోటు ప్రమాదం జిల్లా వాసులను కలచి వేసింది.
చదవండి:
శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...
సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు
మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి
బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!
బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్
రాయల్ వశిష్టకు అనుమతి లేదు...
పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్
పాపికొండలు విహార యాత్రలో విషాదం!
Comments
Please login to add a commentAdd a comment