కొన్ని మీడియా సంస్థలు.. సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 22ప సచివాలయం తరలింపు అంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారంతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రాజధానులపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని... ఉద్యోగులకు నిర్ణీత సమయం ఇస్తుందని స్పష్టం చేశారు.