
ప్రొడ్యూసర్ వెంకట్రామి రెడ్డి
విజయా–వాహినీ సంస్థల అధినేత, నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు, ప్రొడ్యూసర్ వెంకట్రామి రెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. విజయ బ్యానర్‌పై తమిళంలో అజిత్, విజయ్, విశాల్, ధనుష్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించారాయన. తెలుగులోనూ ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం, బృందావనం, భైరవద్వీపం’ వంటి విజయవంతమైన సినిమాలను రూపొందించారు వెంకట్రామి రెడ్డి.
ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతి ఏడాది ఆయన పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయనకు భార్య భారతీరెడ్డి, కుమార్తెలు ఆరాధన, అర్చన, కుమారుడు రాజేశ్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఉదయం 7:30 గంటలకు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట్రామి రెడ్డి మృతిపట్ల ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment