నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు | Adjustment of employees in secretariats from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు

Published Wed, Feb 21 2024 5:30 AM | Last Updated on Wed, Feb 21 2024 5:56 AM

Adjustment of employees in secretariats from today - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాల­యాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం కానుంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వా­ర్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరి­కొన్ని  సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యో­గు­లు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభు­త్వం రేషనలైజేషన్‌ ఉద్యోగుల సర్దుబా­టుకు పూ­ను­కున్న విషయం తెలిసిందే.

10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్త­ర్వు­లు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబా­టు ప్రక్రియకు సంబంధి«ంచిన  తేదీల వారీ­గా షెడ్యూల్‌­ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ ధ్యాన్‌చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు.

సర్దుబాటు ఇలా.. 
♦ గురువారం (22వ తేదీ)కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు.  

♦ ఈ నెల 24వ తేదీకల్లా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు.  

♦  ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. 

♦ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. 

♦ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉ­ద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియ­లో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచల­నం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివా­లయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

♦ మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement