సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖలోని సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అభియోగంపై ఆ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులైన శ్రీనుబాబు, వరప్రసాద్‌తో సహా అసిస్టెంట్ కార్యదర్శి వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment