సచివాలయ ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సచివాలయ ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 806 ఉద్యోగుల్లో 193 మంది తెలంగాణవారు కాదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ 193 మంది ఉద్యోగుల వివరాలను సర్వీసెస్ ముఖ్య కార్యదర్శికి సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, శ్రవణ్ అందించారు.
సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వం మంగళవారం జాబితా వెల్లడించింది. వీరిలో 1,059 మంది ఆంధ్ర, 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఇటీవల ఆన్‌లైన్‌లో సేకరించిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులు తమ, ఇతర ఉద్యోగుల స్థానికత వివరాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని జాబితా వెల్లడించిన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సూచించింది.