సచివాలయంలో రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్‌తో తెలంగాణ దేవీప్రసాద్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు.
హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్‌తో తెలంగాణ దేవీప్రసాద్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ఉద్యోగుల పంపకాలు చేయడం సమంజసం కాదని కమలనాథన్‌తో అన్నారు.
ముందు మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చి తర్వాత ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలని కమలనాథన్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. స్థానికత అంశాన్ని కమలనాథన్ వద్ద వారు ప్రస్తావించారు.