తెలంగాణకు వ్యతిరేకంగా ‘కమలనాథన్’ గైడ్‌లైన్స్ | Kamalanathan Committee guidelines against to Telangana employees, says Srinivas goud | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వ్యతిరేకంగా ‘కమలనాథన్’ గైడ్‌లైన్స్

Published Sat, Nov 1 2014 2:07 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

తెలంగాణకు వ్యతిరేకంగా ‘కమలనాథన్’ గైడ్‌లైన్స్ - Sakshi

తెలంగాణకు వ్యతిరేకంగా ‘కమలనాథన్’ గైడ్‌లైన్స్

ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్
 సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిల్లోని ఆంధ్రా ఉద్యోగుల విభజన విషయమై కమిటీ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, ఇది తెలంగాణకు జరుగుతున్న మరో అన్యాయమన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయిల్లో 20, జోనల్ స్థాయిలో 30 శాతం ఆంధ్రాఉద్యోగులు ఉన్నారని, వీరిని స్థానికత ఆధారంగా విభజన చేయాలన్నారు. కమిటీ సిఫారసుల్లో ఈ అంశం లేనందున వారంతా స్థానికులుగా మారే ప్రమాదం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement