ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ఉద్యోగ నేత
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజన అంశం కాక రాజేస్తోంది. ఇప్పటికే సచివాయల ఉద్యోగుల మధ్య స్థానికత చిచ్చు రాజేసింది. విద్యాశాఖ ఉద్యోగుల విభజనలో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వివాస్పదంగా మారింది.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ ను ఆంధ్రప్రదేశ్కు కేటాయింటారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా తనను సీమాంధ్రకు కేటాయించారని ఆరోపించారు. తెలంగాణ పుట్టి ఉద్యమాలు చేసిన నా పరిస్థితే ఇలా ఉంటే మిలిగినవారి పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని విఠల్ చెప్పారు. విఠల్ ఇంటర్ విద్యాశాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.