AP: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్‌ డిక్లేర్‌  | Village Ward Secretariat Employees Association Meet CM YS Jagan | Sakshi
Sakshi News home page

AP: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్‌ డిక్లేర్‌ 

Published Thu, May 12 2022 8:05 AM | Last Updated on Thu, May 12 2022 8:06 AM

Village Ward Secretariat Employees Association Meet CM YS Jagan - Sakshi

సీఎం జగన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధుల బృందం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్‌ నెలలో ప్రొబేషన్‌ డిక్లర్‌ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.
చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను 

గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనరెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్‌ఆర్‌ కిషోర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విప్పర్తి నిఖిల్, కృష్ణా భార్గవ్, సుతేజ్‌ తదితరులు వెంకటరామిరెడ్డి వెంటవెళ్లి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు.

అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్‌ చేసి 410 పోస్టులకు అప్‌గ్రేడ్‌ ప్రమోషన్‌ అవకాశాలు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. సర్వే డిపార్ట్‌మెంట్‌లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైందన్నారు. అసోసియేషన్‌ ప్రతినిధుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలోనే డీజీపీ రాజేంద్రనా«థ్‌రెడ్డిని కలిసి మహిళా పోలీసుల సమస్యలను వివరించిందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement