probation
-
యాతన ఎవరికి?
సాక్షి, అమరావతి: దేశమంతా ప్రశంసిస్తున్న సచివాలయాల వ్యవస్థపై బురద చల్లేందుకు రామోజీ చేయని ప్రయత్నం లేదు! అవన్నీ బెడిసికొట్టడంతో ఈసారి రూటు మార్చి ఉద్యోగులపై ఎనలేని ప్రేమ నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు. ప్రతి 2,000 జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి పౌర సేవలను ప్రజల వద్దకే చేర్చారు. ఒక్కో సచివాలయంలో 10–11 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ అసలీ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థే వృథా అంటూ కథనాలు అచ్చేసిన రామోజీ ఇప్పుడు వారిపై పని భారం పెరిగిందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు!! ఈనాడు ఆరోపణ: సచివాలయాల ఉద్యోగులు అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవం: మూడున్నర ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు జీతాలు పొందుతున్నారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్ (11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారించి ప్రభుత్వం ప్రతి నెలా జీతాలు చెల్లిస్తోంది. 2018లో పీఆర్సీ ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఆ ప్రకారం గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏతో కలిపి రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరీ ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏతో కలిపి రూ.18,691 ఉంటుంది. అయితే సచివాలయ ఉద్యోగులకు నోటిఫికేషన్లో పేర్కొన్న పాత పే స్కేళ్లకు బదులుగా అందరు ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ. పది వేలు పెరిగింది. ఈనాడు ఆరోపణ: సచివాలయాల ఉద్యోగులు పది వేల మంది రాజీనామా చేశారు. వాస్తవం: అది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాల్లో 1,04,694 మంది, 3,842 వార్డు సచివాలయాల్లో 34,604 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 1.39 లక్షల మంది (పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో కలిపి) ఉద్యోగులు పనిచేస్తుంటే 2019 నుంచి ఇప్పటి వరకు 6,830 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఉద్యోగులలో 90 శాతం మంది మంచి కంప్యూటర్ పరిజ్ఞానం, బీటెక్ లాంటి ఉన్నత కోర్సులు చదివినవారే. 5 – 10 రెట్ల ఎక్కువ జీతం రావడంతో ప్రభుత్వ ఉద్యోగం వదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈనాడు ఆరోపణ: గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు కల్పించకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారారు. వాస్తవం: గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులు రోజువారీ నిర్వహించాల్సిన విధులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవోలు 149, 2 విడుదల చేసింది. ఈనాడు తన కథనంలో ఒకవైపు సచివాలయాల ఉద్యోగులపై అదనపు పనిభారం మోపారంటూ మరోవైపు అధికారాలు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలు మాదిరిగా మారారంటూ పరస్పర భిన్నాభిప్రాయాలను వెలువరించింది. ఈనాడు ఆరోపణ: పలువురు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇంకా ప్రొబేషన్ ఖరారు చేయలేదు. వాస్తవం: 2019, 2020లో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,18,334 మంది ఉద్యోగాలు పొందగా 548 మందిపై క్రమశిక్షణ కేసులు పెండింగ్‌లో ఉండడం, 751 మంది డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోవడం, 905మంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం లాంటి కారణాలతో రెండేళ్ల సర్విసు పూర్తి కాకపోవడంతో ప్రొబేషన్ ఖరారు పొందలేకపోయారని సచివాలయాల శాఖ పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో 98.14% మంది ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తవగా 1.86% మందే పైనపేర్కొన్న కారణాలతో ప్రొబేషన్ ఖరారు పరిధిలోకి రాలేకపోయారు. ఈనాడు ఆరోపణ: ప్రభుత్వం అన్ని పనులను సచివాలయాల ఉద్యోగులకే చెబుతోంది. జాబ్‌చార్ట్ కంటే అదనపు పనులు అప్పగిస్తోంది. వాస్తవం: సచివాలయ ఉద్యోగులందరూ శాఖలవారీగా పనుల బాధ్యతను పంచుకుంటారు. అదనపు పని భారానికి అవకాశం లేదు. సచివాలయ ఉద్యోగులకు తమ పరిధిలో అందరూ తెలిసిన వారే ఉంటారనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా ప్రక్రియలో తప్పులకు అవకాశం లేకుండా బీఎల్వో బాధ్యతలను కొన్ని చోట్ల అప్పగించారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు ఇంటి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారన్న ఆరోపణల్లో నిజం లేదు. సచివాలయాల పరిధిలో పాఠశాలలను మాత్రం వారు సందర్శిస్తుంటారు. యూజర్ చార్జీల వసూలు శానిటేషన్ కార్యక్రమాల కిందకే వస్తుందని అధికారులు వెల్లడించారు. -
AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. 1.34 లక్షల మందికి కొత్త ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్ జారీచేశారు. నాలుగు నెలల్లోనే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్ పొందుతారని అధికారులు వెల్లడించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం జగన్‌కు మేమెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్. కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ సీఎం జగన్ రుణం తీర్చుకుంటాం.. ఉద్యోగ సంఘాల హర్షం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉద్యోగాలు పొందిన వారికీ ప్రొబేషన్ ఖరారు చేసినందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకుంటారని చెప్పారు. చదవండి: ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్కాల్స్ వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్ రెండో విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షులు జి.హరీంద్ర, కె.రామకృష్ణా రెడ్డి, కె.కిరణ్ -
దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం
దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం అని చెప్పాలి. ఒకేసారి లక్షమందికి ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రొబేషన్ ఒకేసారి ఇచ్చి ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటైన గ్రామ,వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఇలా ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేశారు. దీనివల్ల వీరికి వస్తున్న వేతనాలు రెట్టింపు అవుతాయి. వీరిని రెచ్చగొట్టడానికి కొన్ని మీడియా సంస్థలు రెచ్చగొట్టే యత్నం చేసినా, వారంతా ప్రభుత్వం పై నమ్మకం ఉంచడం విశేషం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామ,వార్డు సచివాల య వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.సుమారు లక్షన్నర మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది కలలో కూడా ఊహించలేం. కానీ వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేసి చూపింది. ఇవి ఎంతవరకు సఫలం అవుతాయన్న సందేహం తొలుత ఉండేది. కానీ అసాధారణ విజయం సొంతం చేసుకున్న ఈ వ్యవస్థ గ్రామాలు, పట్టణాలలో ప్రజలకు పాలనను వారి ముంగిటే అందిస్తోంది. వీరికి తోడు వలంటీవర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ స్కీముల పలాలు అందుతున్నాయి. దీనివల్ల చాలా వ్యయం అవుతుందని భావించినవారు సైతం ఇప్పుడు ఈ పాలన వ్యవస్థ వల్ల ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వం వచ్చినట్లు అయిందని అంగీకరిస్తున్నారు. నిజమే దీనికి కొంత వ్యయం అధికంగా ఉండవచ్చు.కానీ ప్రజల అవసరాలకు మించిన పని ఏముంటుంది.గతంలో ప్రజలు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ సమాచారం అవసరం అయినా, సుమారు పదిహేను, ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ ఆఫీస్ కు వెళ్లవలసి వచ్చేది. అయినా పని పూర్తి అవుతుందన్న నమ్మకం ఉండేదికాదు. కానీ ఇప్పుడు గ్రామాల వారు పట్టణాలలో అయితే వార్డుల వారీగా ప్రజలు తమకు ఏ పని కావాలన్నా సమీపంలో ఉండే ఈ సచివాలయాల వద్దకు వెళ్లి ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత దానిని ప్రాసెస్ చేసి సంబంధిత ఉత్తర్వులు వచ్చేలా ఈ సిబ్బంది కృషి చేస్తున్నారు.నిజానికి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో గ్రామాలవారు ఇప్పుడే రుచి చూస్తున్నారని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , విలేజీ క్లినిక్ లు, బడుల నాడు-నేడు, ఇళ్లవద్దకే పెన్షన్ ,రేషన్ మొదలైనవన్ని తమ గ్రామాలలో జరుగుతాయని ప్రజలు ఎన్నడూ ఊహించలేదు. ఎన్నికలకుముందు జగన్ వీటి గురించి చెప్పినా, ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక్కో సంస్కరణ అమలు చేయడంతో ఆ ఫలాలు ప్రజలకు చేరాయి. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తహశీల్దార్ ఆఫీస్ లను విభజించి మండల ఆఫీస్ లుగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించినప్పుడు మంచిపేరే వచ్చింది. ఇప్పుడు ఆయనకు మించిన పేరు జగన్ పొందుతున్నారని చెప్పవచ్చు. ఇవి కీలకమైన వ్యవస్థలుగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో సిబ్బందికి జీతాలు పెంచడం హర్షణీయం. తొలుత రెండేళ్లపాటు కన్సాలిడేటెడ్ జీతానికి వీరంతా పనిచేశారు. తదుపరి వీరికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారందరికి కొత్త పిఆర్సి అమలు చేయడానికి జగన్ ఓకే చేశారు. తదనుగుంగా లక్ష మంది వరకు ప్రయోజనం పొందుతారు. వీరికి జీతం దాదాపు రెట్టింపు అవుతుంది. దీనివల్ల వారి జీవితాలకు ఒక భరోసా వచ్చినట్లయింది. అయితే ప్రభుత్వంలో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు అధికంగాఉందన్న వ్యాఖ్య ఇప్పటికే ఉంది. అయినా జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేసి చూపారు. క్షేత్ర స్థాయిలో ఇది ప్రజలకు ఎంతో ఉపయోగే కార్యక్రమం కనుక ఎవరూ తప్పుపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం వలంటీర్ల వ్యవస్థపై నిందలు మోపారు కానీ, సచివాలయ వ్యవస్థను తప్పు పట్టలేకపోయారు. కాకపోతే తాను ఎప్పుడో ఆలోచన చేశానని ఒక సందర్భంలో అన్నారు. దీనిని బట్టి వీటి విశిష్టత అర్దం అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. తమ సొంత గ్రామంలో ఉండి ఇంత మొత్తంలో జీతం తెచ్చుకుంటామని ఆ సిబ్బంది ఎవరూ అనుకుని ఉండరు. ఇప్పుడు వారిపై మరింత బాద్యత పెరిగినట్లయింది. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో మరింత శ్రద్ద వహించి మెప్పు పొందగలిగితే వారు సార్దకత పొందుతారు. ఇదే సమయంలో మరో మాట చెప్పాలి. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి పెరిగిన జీతాలతో సంతోషపడుతున్న తరుణంలో వారికి నష్టం జరిగిందని ఈనాడు పత్రిక ఒక కదనాన్ని రాయడం ద్వారా వైసిపి ప్రభుత్వంపై తనకు ఉన్న విద్వేషాన్ని బయట పెట్టింది. అదేమిటంటే వీరికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడం లో కొద్ది నెలలు ఆలస్యం అయిందట. దాని వల్ల వారికి ఈ కొద్ది నెలలు జీతం తగ్గిందని,దానివల్ల ఉద్యోగులు 80 కోట్ల మేర నష్టపోయారని , దిక్కుమాలిన వార్త ఒకటి రాశారు. అంటే సచివాలయ సిబ్బంది సంతోషంపై నీరు చల్లడం, వారు ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా మారకుండా ఉండాలన్న దురుద్దేశంతో ఇలాంటి కదనాలు రాశారని తెలసుకోవడం పెద్ద కష్టం కాదు.చంద్రబాబు సి.ఎమ్ గా ఉన్న రోజులలో అసలు కొత్త ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలే తక్కువ. పైగా ఆరో జులలో ప్రబుత్వం వద్ద డబ్బులు లేవంటూ బీద అరుపులు చేసేవారు. పోనీ అలా అని ప్రభుత్వ దుబారా తగ్గించుకున్నారా అంటే అదీ లేదు. నిజమే ..ఒకప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వ్యయాన్ని తగ్గించాలని ప్రయత్నించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చాయి. కాని కాలం మారింది. ఉద్యోగాల కల్పన అన్నది ప్రభుత్వ బాద్యతగా మారింది.అందువల్ల జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే సచివాలయాలపై నిరంతర నిఘా లేకపోతే, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా వీరు కూడా లెదర్జిక్ గా మారడం, అవినీతికి అలవాటు పడడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.అలా జరగకుండా ఒక పర్యవేక్షణ ఉండడం కోసం ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఈ సచివాలయాలకు వారానికి రెండు రోజులు వెళ్లి రావాలని ఆదేశించింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ వ్యవస్థలో జీతాలు పెంచడానికి అవసరం అయ్యే వ్యయాన్ని భరించడం కష్టం అవుతుందా?లేక ఇబ్బంది ఉండదా అన్నది తేలడానికి మరి కొంత సమయ పడుతుంది. ఆర్దికంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి ప్రభుత్వం ఆదాయ వనరులను కూడా పెంచుకోవల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
AP: లక్ష ఇళ్లలో పెద్ద పండుగ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే. 2022 పే– రివిజన్‌కే సీఎం జగన్ ఆమోదం 2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు. ఆ ప్రకారం.. గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్ షాన్మోహన్ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రొబేషన్ డిక్లేర్ చరిత్రాత్మకం రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షన్నర నూతన ఉద్యోగాలు సృష్టించి శాశ్వత ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. సీఎం ఇచ్చిన మాట మేరకు పరీక్ష పాస్ అయిన వారందరి సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ, వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. ప్రొబేషన్ డిక్లరేషన్ చరిత్రాత్మకం. లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. – ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) అనంతపురం జిల్లా గుత్తి 11వ వార్డు సచివాలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో కలసి సంతోషం పంచుకుంటున్న సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం సంతోషం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. – కాకర్ల వెంకటరామి రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. థ్యాంక్యూ సీఎం సార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలు మరవలేనిది. థ్యాంక్యూ సీఎం సార్. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. – జాని పాషా, మనోహర్, బి.శ్వేతా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్‌కు సంబంధించి జీఓ విడుదల చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం నింపినందుకు ధన్యవాదాలు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు – గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నేతలు సాయినాథ్‌రెడ్డి, అర్లయ్య, సమీర్ హుస్సేన్, సల్మాన్ బాషా, రాజశేఖర్‌బాబు కాకినాడ మూడో డివిజన్ సురేష్‌నగర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు మాలో సీఎం ధైర్యాన్ని నింపారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ఒకేసారి లక్ష మంది ప్రొబేషన్ ఖరారు చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. – అంజన్‌రెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరింత ఉత్సాహంగా పని చేస్తాం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాం. – గునిపే రాజేష్, షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం. -
AP: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్ డిక్లేర్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లర్ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనరెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్ఆర్ కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్, కృష్ణా భార్గవ్, సుతేజ్ తదితరులు వెంకటరామిరెడ్డి వెంటవెళ్లి సీఎం జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్ చేసి 410 పోస్టులకు అప్‌గ్రేడ్ ప్రమోషన్ అవకాశాలు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. సర్వే డిపార్ట్మెంట్లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైందన్నారు. అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలోనే డీజీపీ రాజేంద్రనా«థ్‌రెడ్డిని కలిసి మహిళా పోలీసుల సమస్యలను వివరించిందని చెప్పారు. -
జూన్ చివరికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్.షాన్మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీపాషా సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు) -
జ్వెరెవ్‌కు ఊరట.. జరిమానా, సస్పెన్షన్ నిలుపుదల
అకాపుల్కో(మెక్సికో): టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఏటీపీ జరిమానా, సస్పెన్షన్ వేటు నిలుపుదల చేసింది. గత నెల మెక్సికో ఓపెన్‌లో డబుల్స్ మ్యాచ్ ఓడిన వెంటనే జ్వెరెవ్ చైర్ అంపైర్ కుర్చికేసి బలంగా తన రాకెట్ విరిగేలా పదేపదే కొట్టాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన జ్వెరెవ్‌ను పంపించేశారు. దాంతో పాటు 40 వేల డాలర్లు (రూ. 30 లక్షలు), ఆ టోర్నీలో పొందిన ఏటీపీ పాయింట్లను జరిమానాగా విధించారు. ఇది పూర్తిగా మెక్సికో ఓపెన్‌కు సంబంధించిన పెనాల్టీ అయితే... ఏటీపీ నుంచి మరో 25 వేల డాలర్లు (రూ. 19 లక్షల 25 వేలు) జరిమానా, 8 వారాల సస్పెన్షన్ వేటు కూడా వేశారు. తాజాగా ఏటీపీ ఈ శిక్షను తాత్కా లికంగా నిలిపివేసి, ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచింది. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగిసే ప్రొబేషన్ వరకు అతని ప్రవర్తన హుందాగా ఉంటే ఏ సమస్యా లేదు. ఏటీపీ శిక్ష కూడా ఉండదు. ఈ ప్రొబేషన్ కాలంలో జ్వెరెవ్ తన అనుచిత ప్రవర్తనను పునరావృతం చేస్తే మాత్రం ఏటీపీ శిక్షను తక్షణం అమలు చేస్తారు. -
మాతా శిశుమరణాల నివారణకు కృషి
ఏలూరు అర్బన్: కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు మాతాశిశు మరణాలు కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నామని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) కె.శంకరరావు అన్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రం (ఎంసీహెచ్)తో పాటు పలు విభాగాలను గురువారం ఆయన పరిశీలించారు. ఎంసీహెచ్‌లో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. నవజాత శిశువులకు టీకాలు ఇచ్చేందుకు కింది అంతస్తులోకి వెళ్లాల్సి వస్తోందని బాలింతలు ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్ల వద్దే శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం న్యూబోర్న్ బేబీ సెంటర్లోని ఫొటోథెరపీ, ఇంక్యుబేటర్, నూతనంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెప్టిక్, బర్న్స్ వార్డులు, మార్చురీలో పరిస్థితులను పరిశీలించారు. అన్ని వార్డుల్లో పారిశుధ్యం ఎలా ఉందనే అంశంపై రోగులతో మాట్లాడారు. పారిశుధ్యం క్షీణిస్తే ఉద్యోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ ఆయన వెంట ఉన్నారు. -
విద్యాశాఖ కార్యాలయ పరిశీలన
హాలియా : మండలాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్యాయాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అవసరాల అధికారి రవినాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని తిర్మలగిరిలో ఏర్పాటు చేసిన విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. నూతన మండలంలో కార్యకలాపాలు నిబంధనల మేరకే జరుగుతాయని, తాత్కాలిక అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట అకడమిక్ మానటరింగ్ అ«ధికారి శ్రీనివాస్‌గౌడ్, మండల విద్యాధికారి తరి రాము తదితరులు ఉన్నారు. -
శభాష్ సిద్దిపేట
సిద్దిపేట మార్క్‌పై కేంద్రబృందం ఆరా గ్రేడింగ్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన బృందం వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే సిద్దిపేట జోన్: బహిరంగ మల విసర్జన రహిత మున్సిపాల్టీగా దేశస్థాయిలో రెండవ పట్టణంగా గుర్తింపు పొంది, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ మార్క్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా లక్ష జనాభాకు మించిన 500 పట్టణాలను దేశవ్యాప్తంగా గుర్తించింది. వాటిలో బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా గుర్తింపు పొందిన పట్టణాల్లో నిజనిర్ధారణ అంచనా వేసి జాతీయ స్థాయిలో గ్రేడింగ్ ప్రకటించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు పట్టణంలో విస్తృతంగా పర్యటించి వాస్తవ వివరాలను సేకరించారు. త్వరలో సేకరించిన సమగ్ర వివరాలను రహస్య నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. వివరాల్లోకి వెళ్తే .. రాష్ట్రంలోనే బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా , జాతీయ స్థాయిలో రెండవ పట్టణంగా సిద్దిపేటను ఈ యేడాది జూన్ 8న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 3 లక్షల జనాభా కలిగిన పట్టణాలకు పారిశుద్ధ్యం విషయంలో గ్రేడింగ్ ప్రకటించి ప్రోత్సహించే వారు . ఈ ప్రక్రియలో స్వల్పమార్పులు చేసి దేశ వ్యాప్తంగా లక్ష జనాభా ఉండి, పారిశుద్ద్యాన్ని గాడిన పెట్టిన 500 పట్టణాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ వివరాలను సేకరించేందుకు కేంద్రం కమిటీ సభ్యులను ఏర్పాటు చేసింది. అందులోని ఇద్దరు సభ్యులు విజయ్‌కుమార్, గిరిబాబులు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేటను బుధవారం సందర్శించారు. పట్టణంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను , వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని మురికి వాడల్లో , ఆయా వార్డుల్లో పరిశీలించి గూగుల్ మ్యాప్ద్వారా గుర్తించిన ప్రదేశాలను వారి సూచనల మేరకు వాస్తవ పరిస్థితులను ఇంటర్నెట్లో పొందుపర్చారు. అంతకుముందు వారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారితో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. సిద్దిపేట బేష్ సిద్దిపేటలో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని బృందం సభ్యులు సిద్దిపేట పరిస్థితిపై కితాబిచ్చారు. కేంద్రం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపు పొందిన వాటి వాస్తవ వివరాల సేకరణకు , ఆయా పట్టణాలకు స్వచ్చ భారత్ కింద గ్రేడింగ్ మంజూరికి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. -
బాల నేరస్థులుగా గుర్తించి వదిలేశారు!
గుజరాత్ లో ముగ్గురిని చంపిన ఘటనలో మూడు సింహాలను అరెస్టు చేసిన ఘటనలో రెండింటిని బాల నేరస్తులుగా గుర్తించిన అధికారులు వాటిని ప్రొబేషన్ లో వదిలేసేందుకు నిర్ణయించారు. ముగ్గురు గ్రామస్థులను చంపిన కేసులో గుజరాత్ గిర్ నేషనల్ పార్కులోని మూడు సింహాలకు తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. వాటికి జీవిత ఖైదును విధించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాటిని అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండు చిన్న పిల్లలని తెలుసుకున్న అధికారులు జువైనల్స్ గా గుర్తించి వాటికి శిక్షను లేకుండా చేశారు. గుజరాత్ అభయారణ్యంలో ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాలకు జీవిత ఖైదు వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో రెండు బాల నేరస్తులని గుర్తించారు. ఓ మగ సింహం మనిషిని చంపి తినగా, మిగిలినవి అది మిగిల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని గమనించిన గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి సాసన్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో వదిలేయాలని నిశ్చయించింది. అయితే ఆరెండు సింహాలూ అడవిలో ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేట్లు చేసి వాటి ప్రవర్తనను కొంతకాలం పరిశీలిస్తామని ఫారెస్ట్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు. గత మూడు నెల్ల కాలంలోనే అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడికి దిగుతున్న సింహాలు ముగ్గురిని హతమార్చడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకొని, మొత్తం 17 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటిలో మూడింటిని దోషులుగా తేల్చినా, వాటిలో రెండు బాల నేరస్తులుగా గుర్తించి వాటిని అడవుల్లో వదిలేందుకు సిద్ధం చేశారు. -
మేయర్‌కే సమాచారం ఇవ్వరా?
అనంతపురం సిటీ : నగరపాలక సంస్థ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు సోమవారం సాయంత్రం మేయర్ స్వరూప చాంబర్‌కు వచ్చారు. ఏమిటీ.. అందరూ ఇలా వచ్చారని అడిగితే పింఛన్ల పరిశీలన నేపథ్యంలో సమావేశం ఉందంటే వచ్చామని సమాధానమిచ్చారు. దీంతో మేయర్ వెంటనే జూనియర్ అసిస్టెంట్ (జేఏ) సంధ్యను పిలిపించారు. 49 మంది కార్పొరేటర్లకు ఫోన్ చేసి సమావేశం ఉందని తెలిపినప్పుడు.. మేయర్నైన తనకు కనీస సమాచారం ఇవ్వాలని కూడా తెలీదా? అంటూ మండిపడ్డారు. తనకు ఆ మేరకు సర్క్యులర్ జారీ చేస్తే అలానే చేస్తానని జూనియర్ అసిస్టెంట్ సమాధానమివ్వడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిక్క తిక్క పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్‌కు మెమో ఇవ్వాలని, మూడు రోజుల్లో మరో డిపార్టమెంట్‌కు బదిలీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. మహిళే కదా.. ఏమీ పట్టించుకోరని.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కార్పొరేటర్లు కూడా మహిళా ఉద్యోగి తీరును తప్పు పట్టారు. సమావేశం ఉందని వచ్చిన వారిలో కార్పొరేటర్లు జా నకి, బాలాంజనేయులు, లాలు, షుకూర్, మల్లికార్జున, భూలక్ష్మి తదితరులు ఉన్నారు.