శభాష్‌ సిద్దిపేట | siddipeta.. upto the mark | Sakshi
Sakshi News home page

శభాష్‌ సిద్దిపేట

Published Wed, Aug 10 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

మున్సిపల్‌ కమిషనర్‌తో బృందం భేటీ

మున్సిపల్‌ కమిషనర్‌తో బృందం భేటీ

  • సిద్దిపేట మార్క్‌పై కేంద్రబృందం ఆరా
  • గ్రేడింగ్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన బృందం
  • వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే
  • సిద్దిపేట జోన్‌: బహిరంగ మల విసర్జన రహిత మున్సిపాల్టీగా  దేశస్థాయిలో రెండవ పట్టణంగా గుర్తింపు పొంది,  రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ మార్క్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బుధవారం  క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా లక్ష జనాభాకు మించిన 500 పట్టణాలను దేశవ్యాప్తంగా గుర్తించింది.

    వాటిలో బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా గుర్తింపు పొందిన  పట్టణాల్లో నిజనిర్ధారణ అంచనా వేసి జాతీయ స్థాయిలో గ్రేడింగ్‌ ప్రకటించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు పట్టణంలో విస్తృతంగా పర్యటించి వాస్తవ వివరాలను సేకరించారు. త్వరలో సేకరించిన  సమగ్ర వివరాలను రహస్య నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు.

    వివరాల్లోకి వెళ్తే .. రాష్ట్రంలోనే బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా , జాతీయ స్థాయిలో రెండవ పట్టణంగా సిద్దిపేటను ఈ యేడాది జూన్‌ 8న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో  3 లక్షల జనాభా కలిగిన పట్టణాలకు పారిశుద్ధ్యం విషయంలో గ్రేడింగ్‌ ప్రకటించి ప్రోత్సహించే వారు .

    ఈ ప్రక్రియలో స్వల్పమార్పులు చేసి దేశ వ్యాప్తంగా లక్ష జనాభా ఉండి, పారిశుద్ద్యాన్ని గాడిన పెట్టిన 500 పట్టణాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ వివరాలను సేకరించేందుకు కేంద్రం కమిటీ సభ్యులను ఏర్పాటు చేసింది. అందులోని ఇద్దరు సభ్యులు విజయ్‌కుమార్‌, గిరిబాబులు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ సిద్దిపేటను బుధవారం సందర్శించారు.

    పట్టణంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను , వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని మురికి వాడల్లో , ఆయా వార్డుల్లో పరిశీలించి గూగుల్‌ మ్యాప్‌ద్వారా గుర్తించిన ప్రదేశాలను వారి సూచనల మేరకు వాస్తవ పరిస్థితులను ఇంటర్‌నెట్‌లో పొందుపర్చారు.
    అంతకుముందు వారు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రమణాచారితో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు.

    సిద్దిపేట బేష్‌
    సిద్దిపేటలో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని  బృందం సభ్యులు సిద్దిపేట పరిస్థితిపై కితాబిచ్చారు. కేంద్రం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపు పొందిన  వాటి వాస్తవ వివరాల సేకరణకు , ఆయా పట్టణాలకు స్వచ్చ భారత్‌ కింద గ్రేడింగ్‌ మంజూరికి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement