ఇసుక లారీలపై ఉక్కుపాదం | Vigilance officers attacks on midnight | Sakshi
Sakshi News home page

ఇసుక లారీలపై ఉక్కుపాదం

Published Fri, Sep 19 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

ఇసుక లారీలపై ఉక్కుపాదం

ఇసుక లారీలపై ఉక్కుపాదం

- అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల దాడులు
- వంద ఇసుక లారీల పట్టివేత
- ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాల స్వాధీనం
- క్వారీలలోనూ ఆకస్మిక తనిఖీలు
- భారీగా జరిమానా విధింపు
 బాన్సువాడ/బిచ్కుంద: ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు కన్నెర్ర చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు విస్తృతంగా తనిఖీలు చేసి వంద లారీ లను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఏస్గీ క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్న పది టైర్ల భారీ వాహనాలను కూడా నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు గనుల శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి ఆధ్యర్యంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి  బిచ్కుంద మండలం ఖద్‌గాం, శెట్లూర్, వాజిద్‌నగర్, పిట్లం, నిజాం సాగర్, బాన్సువాడ, బిచ్కుందలో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న వంద లారీలను స్థానిక తహసీల్దార్ ధన్‌వాల్‌కు అప్పగించారు. ఒక్కో వాహనానికి రూ.20వేల చొప్పున జరిమానా విధించారు. అయితే దాదాపు 35 లారీలకు ఇంకా జరిమానా వేయలేదని సమాచారం.
 
ఒక్కో లారీలో 50 టన్నులు
వాస్తవంగా పది చక్రాల లారీలో సుమారు 22 టన్నుల మేర కే లోడ్ నింపాలి. కానీ, సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో లారీ డ్రైవర్లు రెట్టింపు బరువు అంటే, దా దాపు 50 టన్ను ల ఇసుకను నింపి వివిధ ప్రాంతాల కు తరలి స్తున్నా రు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, లారీ లలో సామర్థ్యానికి మించిన బరువుతో ఇసుకను రవాణా చే స్తుండడంతో రహదారులు చెడిపోతున్నాయని బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఇటీవల న్యాయవాదులు కోర్టులో కేసు కూడా వేశారు.

మంజీరా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తక్షణమే ఇసుక అక్రమ రవాణాను  నియంత్రించాలని విన్నవించారు. రెవెన్యూ, గనులు, పోలీస్, రవాణా శాఖ అధికారుల వైఖరికి నిరసనగా ఒక రోజు బిచ్కుంద బంద్ చేయించి, ధర్నా చేశారు. ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలూ గాలిలో కలిసిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే నిజాంసాగర్ మండలం కోమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర ప్రాం తం నుంచి వస్తున్న భారీ వాహనాలను బోధన్-బాన్సువాడ-ఎల్లారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్తున్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తర లించి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుండ డంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎట్టకేలకు అధికారులు స్పందించి బుధవారం రాత్రి ఇసుక లారీలపై దాడులు చేశారు.
 
హోం మంత్రి వస్తున్నారనేనా!
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం మ ద్నూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇసుక లారీల వ్య వహారం మంత్రి దృష్టికి రాకూడదనే పోలీసు అధికారులు భావించి ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది.
 
క్వారీని పరిశీలించిన అధికారులు
ఖత్‌గాం, వాజిద్‌నగర్ గ్రామాలలో కొనసాగుతున్న ఇసుక క్వారీలను తహసీల్దార్ ధన్‌వాల్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధం గా ఇసుకను తవ్వుతున్నారా లేదా అని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి  గనుల శాఖ అధికారుల కు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అక్కడి నుం చి అనుమతులు వచ్చే వరకు ఇసుక రవాణాను నిలి పివేయాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement