Lorries
-
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
జమ్మలమడుగు/మైలవరం: ‘మాకు మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూళ్లు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్నిరోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామాళ్లు డిమాండ్ చేస్తున్నారు.వ్యాపారాలు సాఫీగా జరగాలన్నా.. లారీలు రోడ్డెక్కాలన్నా మామూళ్లు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో.. కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీలను ధ్వంసం చేశారు. మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు, పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. బాడుగల రూపంలో వస్తున్న ఆదాయం తమ ఖర్చులకే సరిపోవడంలేదని, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు, లారీలకయ్యే ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు ఇలా రౌడీయిజం చేస్తే తామంతా బతికేదెలా అని ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హనుమంతప్పకు లారెన్స్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. చేపల పెంపకానికీ మామూళ్లు.. లేదంటే దాడే జమ్మలమడుగులో చేపల పెంచుకోవాలన్నా టీడీపీ నాయకులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే దాడి చేసి చంపడానికీ వెనుకాడట్లేదు. చేపల పెంపక కేంద్రం నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బారాయుడిని కూడా ఇటీవల టీడీపీ నాయకులు బెదిరించారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే చేపల కేంద్రాన్ని మూసేస్తామంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలను లెక్కచేయకపోవడంతో సుబ్బారాయుడు, అతని కుమారులపై దాడి చేశారు. చికిత్స కోసం వెళ్తుండగా.. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కూడా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల తీరుతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
డేంజర్ లోడ్స్!
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణ రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఇసుకలారీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో వచ్చే లారీల వల్ల రహదారులు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5 వేల లారీలు వివిధ జిల్లాల నుంచి నగరానికి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో మోటారు వాహన నిబంధనలకు బేఖాతరు చేస్తూ యధేచ్చగా పరిమితికి మించిన బరువుతో రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.కృష్ణా,గోదావరి, తదితర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే క్రమంలోనే కచి్చతమైన పరిమితిని విధించే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు తూకం వేయకుండానే రోడ్డెక్కుతున్నాయి. కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్దంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న 16 టైర్ల లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఓవర్‌లోడ్..చీకట్లో స్పీడ్ ఇలా ఓవర్‌లోడ్‌తో వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇసుక లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు రవాణా అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున సిటీకి వచ్చే క్రమంలో ఓవర్‌లోడ్ లారీలను డ్రైవర్లు అదుపు చేయలేకపోతున్నారు. వేగాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఓవర్‌లోడ్ వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. తూకంలోనే మోసం... హైదరాబాద్‌లో భవననిర్మాణ రంగానికి ప్రతి రోజు వేల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు.నదీతీరాల్లో లభించే సన్న ఇసుకకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది.దీంతో కృష్ణా,గోదావరి పరీవాహాక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో ఇసుక తరలివస్తుంది.అలాగే విజయవాడ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను లారీల్లో నింపిన తరువాత క్వారీల్లోనే తూకం వేయవలసి ఉంటుంది. కానీ చాలా వరకు క్వారీల్లో కాంటాలు అందుబాటులో లేకపోవడం వల్ల పెద్దమొత్తంలో ఇసుకను నింపేస్తున్నారు. నిర్ధేశించిన బరువుపైన 5 శాతం వరకు అదనంగా తెచ్చేందుకు ఆర్టీఏ అనుమతిస్తుంది.ఉదాహరణకు 25టన్నులకు అవకాశం ఉన్న లారీల్లో మరో ఒకటిన్నర టన్ను అదనంగా తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు వాహన యజమానులు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకటిన్నర టన్నుకు బదులు 10 టన్నులకు పైగా అదనంగా నింపేసి తరలిస్తున్నారు. క్వారీలు దాటిన 20 కిలోమీటర్ల దూరంలో కాంటాలు ఉంటాయి. కానీ ఇక్కడి వరకు వచి్చన లారీల్లో ఓవర్‌లోడ్‌ను తొలగించకుండా ఏదో ఒకవిధంగా కాంటాల నిర్వాహకులతో కుమ్మౖMð్క తప్పుడు తూకం లెక్కలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ఓవర్‌లోడ్‌తో వచ్చే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద నిలిపేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు మోటారు వాహన ఇన్స్పెక్టర్లు ఇసుక వ్యాపారాల నుంచి ప్రతి లారీకి కొంత మొత్తంగా వసూలు చేసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఆరీ్టఏ అధికారులు బడా వ్యాపారులను వదిలేసి నిబంధనల మేరకు ఇసుకను తెచ్చే చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లపైన మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని’ పలువురు వాహనయజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. వివిధ దశల్లో ఏదో ఒక విధంగా తనిఖీలను తప్పించుకొని నగరానికి చేరుకొనే ఓవర్‌లోడ్ ఇసుక లారీలపైన ఆర్టీఏ ప్రస్తుత స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పరిమితికి మించిన బరువుతో నగరానికి వచ్చే లారీలపైన తనిఖీలను ప్రారంభించారు.సోమవారం ఒక్క రోజే 19 వాహనాలపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జేటీసీ రమేష్ తెలిపారు.ఓవర్‌లోడ్ వాహనాలపైన తనిఖీలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.క్వారీల్లోంచి ఇసుకను నింపే సమయంలోనే మోటారు వాహన నిబంధనలకనుగుణంగా నింపాల్సి ఉంటుందన్నారు. -
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్‌నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
TS Crime News: .. ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డ్రైవర్..!
కరీంనగర్: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై విజేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియానా రాష్ట్రం పాల్వల్ జిల్లా, హతిని తాలుకాకు చెందిన అన్నదమ్ములు ఫర్వీద్(25), ఇంజిమామ్ లారీ డ్రైవర్, క్లీనర్‌గా ఏలూరులో పని చేస్తున్నారు. ఏలూరు నుంచి ఏపీ 37టీఈ 5831 లారీలో టైల్స్ లోడ్ చేసుకొని మంచిర్యాల బయలుదేరారు. ఈక్రమంలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో ఏపీ 29 టీబీ2382 నంబర్‌గల లారీ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న మారుతి రైస్‌మిల్ నుంచి ధాన్యం లోడ్‌తో రోడ్డుపైకి వస్తున్న క్రమంలో టైల్స్ లోడ్‌తో ఉన్న లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటల చెలరేగాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న ఫర్వీద్ మంటల్లోనే సజీవ దహనం కాగా, క్లీనర్ ప్రమాదాన్ని గుర్తించి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి ఏసీపీ ఏడ్ల మహేశ్, సీఐ జగదీశ్‌లు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లారీ బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే..
సాక్షి, కృష్ణాడెస్క్: వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ లారీల బాడీ బిల్డింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లారీలకు బాడీలు తయారు చేసే నిపుణులు ఇక్కడే ఉన్నారు. కొత్తగా లారీ కొనుగోలు చేస్తే దానికి బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో లారీలను ఆటోనగర్ తీసుకొస్తారు. ఒకప్పుడు యజమానులు ఆరు టైర్ల లారీలకే పరిమితమయ్యేవారు. కానీ నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో 16 టైర్ల లారీలపై మక్కువ కనబరుస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేసినా బాడీలు కట్టించడానికి మాత్రం విజయవాడ తేవాల్సిందే. కరోనా విలయతాండవం తర్వాత కొన్ని రంగాల్లో పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. విజయవాడలోని జవహర్ ఆటోనగర్ కార్మికులు చేతి నిండా పనులతో ఉపాధి పొందుతున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌లో ప్రస్తుతం లారీల బాడీ బిల్డింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఆరుటైర్లు ఉంటే ఎంతో గొప్పగా భావించే లారీల యజమానులు ఇప్పుడు 16 టైర్ల లారీలను కొనుగోలు చేసి వాటికి బాడీలు కట్టిస్తున్నారు. వీటికి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా 35 టన్నుల వరకు లోడు వేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆరు టైర్ల వాహనాలకు ప్రతి 18 వేల కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. 16 టైర్ల వాహనాలకు (లారీ) ఇంజిన్ ఆయిల్ 80 వేల కిలోమీటర్లకు మారిస్తే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. దీంతో ఈ లారీలనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నామని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం లారీలన్నీ కర్నూలు జిల్లా బేతంచర్ల, నెల్లూరు, వైజాగ్, గుంటూరు, పొన్నూరు, తదితర ప్రాంతాల నుంచి ఆటోనగర్‌కు వస్తున్నాయి. 10 నుంచి 15 రోజుల్లో లారీ బాడీ బిల్డింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో బాడీలు కడుతున్నారు. ఎంతో మంది వృత్తి నిపుణులు... ఒక్కో లారీ బాడీ బిల్డింగ్ చేయడానికి 11 రకాల వృత్తి నైపుణ్యాలు కలిగిన కారి్మకులు అవసరం. కార్పెంటరీ, టింకరింగ్, కమ్మరం, పౌండ్రి, పెయింటర్, ఎల్రక్టీíÙయన్, అద్దాలు, సట్లు, స్టిక్కరింగ్, టైర్లు తదితర పనుల్లో స్కిల్ వర్కర్లు అందుబాటులో ఉంటారు. సుమారు రెండు వారాల పాటు వీరంతా శ్రమిస్తే గానీ 16 టైర్ల లారీలకు బాడీ బిల్డింగ్ పూర్తి కాదు. ఆటోనగర్‌లో సుమారు వెయ్యి మందికిపైగానే కారి్మకులు ఉన్నారు. వీరంతా లారీల బాడీల తయారీ పనుల్లో పాలుపంచుకుంటారు. ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్లు ►కరోనాకి ముందు: 200 ►కరోనా తర్వాత : 100 ►ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నవి : 50 ►16 టైర్ల లారీకి బాడీ బిల్డింగ్ పూర్తి చేయడానికి పట్టే సమయం: 10 నుంచి 15 రోజులు ►ఒక్క లారీ బాడీ బిల్డింగ్‌కి అయ్యే ఖర్చు రూ.4.80 లక్షలు ►ఒక్కో కార్మికుడికి రోజు కూలీ: రూ.1,000 నుంచి రూ.1,200 ►ఆటోనగర్ నుంచి పని పూర్తి చేసి బయటకు పంపే లారీల సంఖ్య రోజుకు: 50 ►వర్క్ బిజీగా ఉండే మాసాలు (సీజన్) : జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ (సీజన్లో ఈ ప్రాంతంలో లాడ్జిలు, హోటళ్లు బిజీ బిజీగా ఉంటాయి) చదవండి: పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు.. ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం 16 టైర్ల బాడీ బిల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఎక్కడా లోటు లేకుండా పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసి యజమానులకు అప్పగిస్తాం. గత మూడు నెలల నుంచి ఆటోనగర్‌కు 16 టైర్ల లారీలు వస్తున్నాయి. ఈ లారీలో 35 టన్నుల లోడింగ్ చేసుకునే అవకాశం ఉంది. బాడుగ కూడా ఎక్కువ వస్తుంది. ఆయా కంపెనీలకు చెందిన వారు 16 టైర్ల లారీలకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసి బాడీ బిల్డింగ్ కోసం బెజవాడ వస్తున్నారు. కరోనా తర్వాత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. –సంపర మల్లేశ్వరరావు, షెడ్ యజమాని -
లారీలపై తగ్గనున్న గ్రీన్‌ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజులతో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ప్రస్తుతం రూ.6 వేల వరకు విధిస్తున్న గ్రీన్‌ట్యాక్స్‌ను రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్న మొత్తాన్ని రూ.3 వేలకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తెలిసింది. ఇది తమకు భారంగా ఉన్నందున ఆ పన్నును ఎత్తేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పన్నును గరిష్టస్థాయిలో తగ్గిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ను అమలు చేసేందుకు కూడా హామీ ఇచ్చా రు. లారీలు ఏపీలోకి ప్రవేశించిన ప్రతీసారీ రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానికి బదులు ఏడాదికి ఒకేసారి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వసూలు చేసి ఎన్నిసార్లయినా వెళ్లివచ్చేందుకు అవకాశం కల్పించాలని ఏళ్లుగా లారీ యజమానులు కోరుతున్న దానిని కొలిక్కి తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. లైసెన్సుల సస్పెన్షన్‌పై ఉపశమనం.. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను పట్టుకున్నప్పుడు డ్రైవర్ల లైసెన్సులను నిర్ధారిత కాలానికి సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కూడా సానుకూలత లభించింది. సస్పెన్షన్ బదులు పెనాల్టీ విధించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తైబజార్లలో లారీవాలాలనుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న మొత్తం తమకు భారంగా ఉందని, వ్యాపారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని లారీల నుంచి వసూలు చేయటం ఏంటని సంఘం నేతలు ప్రశ్నించారు. ఇసుక క్వారీల్లోని ఇబ్బందులనూ వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందారెడ్డి, ఉపాధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ గ్రామం ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు..
పిఠాపురం(తూర్పుగోదావరి): సాధారణంగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పిఠాపురం సమీపంలోని చిత్రాడ గ్రామానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటా ఒక లారీ ఉంటుంది. ఏ వీధి చూసినా, రోడ్డు మార్జిన్ చూసినా, ఎవరి ఇంటి వద్ద ఖాళీ స్థలం చూసినా లారీలే కనిపిస్తాయి. సుమారు 2 వేల కుటుంబాలు, 10 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో చిన్న వ్యాన్ నుంచి పెద్ద టాంకర్ల వరకూ సుమారు 500 వరకూ లారీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గ్రామ జనాభాలో ఎక్కువ మంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లుగానే స్థిరపడ్డారంటే ఆశ్చర్యం కలగక మానదు. గతంలో చిత్రాడకు వ్యవసాయంలో మంచి పేరుండేది. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. ఏడాకుల బీరకు పుట్టినిల్లుగా చెప్పే ఈ గ్రామంలోని రైతులు ప్రతి ఇంటికీ ఒక ఎడ్ల బండి వాడేవారు. రానురానూ ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రారంభించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను చూసి వారు ఏమాత్రం భయపడలేదు. సరికొత్త జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. అలా ఇక్కడి వారు రవాణా రంగంలోకి అడుగు పెట్టారు. క్వారీ లారీలు కొనుగోలు చేసి, సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో పాటు సమీపంలోనే కాకినాడ పోర్టు, అక్కడ ఇతర పరిశ్రమలు ఉండటంతో రవాణా రంగం గణనీయంగా అభివృద్ధి సాధించింది. దీంతో చిత్రాడలో ఒకరిని చూసి మరొకరు లారీలు కొని తిప్పడం ప్రారంభించారు. అలా గ్రామంలో ఎక్కువ మంది దానినే జీవనోపాధిగా మార్చుకున్నారు. ఎక్కువ మంది మోటార్ ఫీల్డే గ్రామంలో ఎక్కువ మంది మోటార్ ఫీల్డ్‌లోనే ఉపాధి పొందుతున్నారు. ప్రతి వాహనంపై ఇద్దరి నుంచి నలుగురి వరకూ పని చేస్తుంటారు. సుమారు 2 వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లుగా ఉపాధి పొందుతున్నారు. 300 మంది వరకూ లారీల యజమానులు ఉన్నారు. వీరితో పాటు వాటర్ సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాల్లో పలువురు ఉపాధి పొందుతున్నారు. పండగొస్తే ఊరంతా లారీలే నిత్యం ఇతర ప్రాంతాలకు లోడ్లు వేసుకుని వెళ్లే వాహనదారులు సంక్రాంతి, దసరా, వినాయక చవితి వంటి పండగలకు ఇళ్లకు చేరుతారు. అలా ఎక్కడెక్కడో ఉన్న ఆ లారీలన్నీ ఆ సమయంలో గ్రామానికి చేరుకుంటాయి. ఆ లారీలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు చేసి, అందంగా అలంకరించి, వాటిపై ఊరంతా తిరిగి ఇక్కడి వారు ఆనందిస్తారు. తద్వారా గ్రామంలో పండగ కోలాహలాన్ని ఇనుమడింపజేస్తారు. లారీలే జీవనాధారం మా గ్రామంలో చాలా మందికి లారీలున్నాయి. ఎక్కువ మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాకు రెండు లారీలున్నాయి. వాటితో మా కుటుంబ పోషణ చూసుకుంటున్నాం. లారీని మా ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. – పులుగుల శ్రీనివాస్, ఓనర్ కం డ్రైవర్, చిత్రాడ లాభనష్టాలతో సంబంధం లేదు రవాణా రంగంలో మా గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఎడ్ల బళ్ల నుంచి పెద్ద లారీల వరకూ వచ్చిన మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాహనాలను నడపడం మాత్రం మానరు. లారీలు మా జీవనంలో భాగంగా మారిపోయాయి. – పులుగుల అప్పారావు, లారీ ఓనర్, చిత్రాడ నాలుగు టైర్ల లారీలతో ప్రారంభమై.. చిత్రాడలో మూడు దశాబ్దాల కిందట మూడు లారీలతో ఈ సరికొత్త జీవన విధానం ప్రారంభమైంది. ఇప్పుడు గ్రామంలో లారీల సంఖ్య వందల్లోకి చేరింది. క్వారీ లారీలతో ప్రారంభమైన వీరు రానురానూ అవసరాలకు అనుగుణంగా లారీలను కూడా మార్చుకుంటూ వచ్చారు. చిన్న లారీల స్థానంలో ఇప్పుడు పెద్ద లారీలు, ట్యాంకర్లు ఈ గ్రామంలో కనిపిస్తుంటాయి. ఆరు టైర్ల లారీల స్థానంలో ఇప్పుడు 40 టైర్ల లారీలు సైతం నడుపుతున్నారు. -
భద్రతకు డేంజర్ లోడ్ ఓవర్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దూలపల్లి నుంచి జీడిమెట్లకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇది. పారిశ్రామిక వ్యర్థాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. నిత్యం 5 వేలకుపైనే లారీలు, అంతకు పదింతలుపైనే ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డు చాలాచోట్ల గుంతల మయంగా మారింది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా.. కొత్తగా వేసిన మూడేళ్లలోనే ఈ స్థితికి చేరుకుందని స్థానికులు వాపోతున్నారు. నాసిరకం రోడ్లతో... ►సాధారణంగా సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్లు వేగాన్ని సరిగా అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పటిష్టమైన రోడ్లపైనే వాహనాలు అదుపుతప్పుతుంటే.. నాసిరకం రోడ్లపై మరింతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు వర్షాలకే పెచ్చులూడే రోడ్లపై అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ►రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతుల సమయంలో నాసిరకం సామగ్రిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా హడావుడిగా నిర్మాణంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో తారువేసే సమయంలో అది కనీసం 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల (లేయింగ్ టెంపరేచర్) సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కానీ దూరంలో ఎక్కడో తయారుచేసి, ఓపెన్ ట్రక్కుల్లో తరలిస్తున్న తారు 90డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటోందని.. దానిని అలాగే పరిచి, రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఇక తారు నాణ్యత (బిటుమినస్ తార్) 4.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని.. కానీ 3.5 శాతం నుంచి 4 శాతం వరకే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇలాంటి తారును రోడ్డు రోలర్లతో తొక్కించడం వల్ల మొదట్లో బాగానే కనిపించినా.. కొద్దిరోజులకే దెబ్బతింటోందని స్పష్టం చేస్తున్నారు. చిన్నవానలకే రోడ్లకు పగుళ్లురావడం, పైపొర కొట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయని.. అలాంటి రోడ్లపై ఓవర్‌లోడ్ వాహనాలు తిరుగుతుండటంతో మరింత నష్టం కలుగుతోందని వివరిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళితే.. ►రహదారులపై వాహనాల బరువుతో పడే ఒత్తిడిని కిలోన్యూటన్ల (కిలోన్యూటన్ అంటే సుమారు 101 కిలోల బరువు)లో కొలుస్తారు. ఆయా రోడ్ల నిర్మాణ తీరు (అక్కడి నేల తీరు, వాడిన కంకర పరిమాణం, రోలింగ్, తారు (బిటుమినస్ తార్) నాణ్యత తదితర అంశాల)ను బట్టి అవి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామాల మధ్య నిర్మించే సాధారణ రోడ్ల సామర్థ్యానికి, భారీ హైవేల సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. ►రోడ్లను నాసిరకంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించినా, తక్కువ కెపాసిటీ ఉన్నరోడ్లపై పరిమితికి మించి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లినా.. సదరు రోడ్లు దెబ్బతింటాయి. ►రాష్ట్రంలో 30 కిలోన్యూటన్ల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన రహదారులపై కూడా 60 కిలోన్యూటన్ల ఒత్తిడిపడే భారీ ఓవర్‌లోడ్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, ఇటీవల నిర్మించిన కొన్ని హైవేలు మినహా.. మిగతా రోడ్లన్నీ 40కిలోన్యూటన్లలోపు సామర్థ్యమున్న రోడ్లే కావడం గమనార్హం. ఇలాంటి ఈ రోడ్లపై ఇసుక, ఇటుక, కంకర, ఐరన్, గ్రానైట్స్, మార్బుల్స్ వంటి సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నారు. ►ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లపై ఒత్తిడి పెరగడం, ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తీవ్ర వైబ్రేషన్ (ప్రకంపనాల)తో రోడ్ల బేస్ దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆ పగుళ్లు, రంధ్రాల్లోకి వాన నీరు, గాలిచేరి రోడ్డు బలాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెప్తున్నారు. ఇలా కొద్దిగా దెబ్బతిన్న రోడ్లు వాహనాల రాకపోకలు జరిగిన కొద్దీ మరింతగా పాడైపోయి.. పెద్ద పెద్ద గుంతలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివారు రహదారులు, లోపలి రోడ్లు కూడా ఇలా ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. ఇది రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమేంటి? నాణ్యమైన రోడ్లు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయని, మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లపాటు వినియోగించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రెండు, మూడేళ్లకే మరమ్మతులు చేసినా దెబ్బతింటున్నాయి. ►ఓవర్‌లోడ్ కారణంగా డ్రైవర్లు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌లోడ్, రోడ్లపై గుంతలు కలిసి వాహనాల టైర్లు పేలిపోయి ఇతర వాహనాలను ఢీకొట్టడం, బోల్తాపడటానికి కారణమవుతున్నాయి. ►రోడ్లపై తారు కొట్టుకుపోవడం, కంకర తేలడం, గుంతలు పడటం కారణంగా సాధారణ వాహనాలు కూడా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. పగిడిపాల ఆంజనేయులు ఓవర్‌లోడ్ వాహనాలు రహదారి భద్రతకు పెనుముప్పుగా మారాయి. పరిమితికి మించిన బరువుతో పరుగులు తీస్తున్న సరుకు రవాణా లారీలు, ప్రైవేట్ బస్సుల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రధాన రహదారులపై పరిస్థితిని గమనించింది. నిత్యం వేలకొద్దీ లారీల్లో ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్, ఐరన్, మార్బుల్స్ తదితర సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నట్టు గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా తొర్రూరు, మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం ఆర్టీసీ బస్సులు, మైనింగ్ లారీలు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్లే మైనింగ్ లారీల కారణంగా రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది. దీనితో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ –చించొల్లి అంతరాష్ట్ర రహదారి దుస్థితి. ప్రస్తుతం రోడ్డు సామర్థ్యం 20 టన్నుల బరువులోపే. కానీ 30 టన్నులకుపైగా బరువుతో రోజూ వందలాది లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనికితోడు రోడ్డు నాణ్యతా లోపం కారణంగా.. అడుగుకో గుంత అన్నట్టుగా తయారైంది. రోడ్ల సామర్థ్యం కాస్త పెరిగినా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ జరిగింది. సామర్థ్యం ఎక్కువగా ఉండే నాలుగులైన్ల రహదారులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ఉన్న నిబంధనలను సవరించిన రవాణాశాఖ.. టైర్ల సంఖ్యకు అనుగుణంగా సుమారు 3 టన్నుల చొప్పున వాహనాల రవాణా బరువు పరిమితిని పెంచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓవర్‌లోడ్ రవాణాకు ఇది ఏమాత్రం దగ్గరగా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఇసుక, కంకర, ఐరన్, గ్రానైట్ వంటి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలు యథేచ్చగా లోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►ఒకవైపు రాజకీయ నాయకుల జోక్యం, మరోవైపు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిన్నర కాలంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలను నిలిపివేశారు. దీంతో బాహాటంగానే ఓవర్‌లోడ్ సరుకు రవాణా సాగుతోంది. ►ఓవర్‌లోడ్, రోడ్లు దెబ్బతినడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారి నుంచి స్పందన రాలేదు. నిబంధనలు ఏమిటి? ►రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల లారీల్లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే తీసుకెళ్లాలి. కానీ 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. ►12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు అనుమతి ఉంటుంది. అయినా 45 టన్నుల వరకు ఇసుక, ఐరన్, గ్రానైట్ వంటివి రవాణా చేస్తున్నారు. ►6 టైర్ల సాధారణ లారీల్లో 18 టన్నుల వరకు బరువును తీసుకెళ్లవచ్చు. కానీ వాటిలో 25 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులను రవాణా చేస్తున్నారు. ►హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, మియాపూర్, బొల్లారం, నాచారం, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వివిధ రకాల రవాణా వాహనాలు, వ్యర్ధాల తరలింపు లారీలు పరిమితికి మించిన లోడ్‌తో రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి. ►చాలా వాహనాల్లో పరిమితికి మించి 10 నుంచి 20 టన్నుల మేర ఎక్కువ బరువును రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిలో సుచిత్ర ప్రాంతం వద్ద రోడ్డు దుస్థితి ఇది. కనీసం 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు.. వేసిన రెండు, మూడేళ్లకే చాలా చోట్ల గుంతలు పడి, తారు కొట్టుకుపోయి దెబ్బతిన్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్లు ఇలా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతోనూ.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు ఇసుక పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. రోజూ కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. కేవలం 18 టన్నుల సామర్ధ్యం ఉండే ఆ లారీల్లో 25 టన్నులకుపైగా ఇసుకను నింపి రవాణా చేస్తున్నారు. రోజూ రాత్రిళ్లు వేలాది లారీలు వేగంగా రహదారులపై ప్రయాణిస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, తిరుమలగిరి, కర్మన్‌ఘాట్, చంపాపేట్, కూకట్పల్లి తదితర అడ్డాలకు.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇలా ఓవర్‌లోడ్ తరలింపును అరికట్టడంలో రవాణాశాఖ విఫలమవుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది లారీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులా?.. సరుకు రవాణా వాహనాలా..? ప్రైవేటు బస్సులు చాలా వరకు సరుకు రవాణా వాహనాలుగా కూడా మారిపోతున్నాయి. లగేజీ బాక్సులతోపాటు బస్సుల టాప్‌పై కూడా సరుకులను నింపి రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికులు, వారి లగేజీకి తోడు అదనంగా సరుకులతో బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, బెంగళూర్ తదితర ప్రాంతాలకు బట్టలు, ఐరన్, ద్విచక్ర వాహనాలు వంటివాటిని బస్సుల్లో తరలిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, బహదూర్‌పురా, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో.. బస్సుల్లో తరలిస్తున్న ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను గుర్తించడం గమనార్హం. ఇప్పటికీ కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల్లో క్వింటాళ్ల కొద్దీ సరుకు రవాణా జరుగుతూనే ఉంది. ఓవర్‌లోడ్‌తో రోడ్లకు పగుళ్లు ఇటీవల కాలంలో పలుచోట్ల రోడ్ల సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. లక్ష టన్నుల బరువు మోయాల్సినరోడ్డుపై ఏకంగా కోట్ల టన్నుల బరువు మోపితే ఎలా ఉంటుంది? ఓవర్‌లోడ్ కారణంగా రోడ్ల బేస్మెంట్ నుంచి పగుళ్లు వచ్చి దెబ్బతింటాయి. అంతిమంగా రహదారి భద్రతకు ఇది ముప్పు. – ప్రొఫెసర్ గోపాల్‌నాయక్, రోడ్డు నిర్మాణ నిపుణుడు వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలు ఓవర్‌లోడ్ వల్ల డ్రైవర్లు వాహనాలను నియంత్రించలేక పోతున్నారు. ప్రమాదాలను నివారించే అవకాశమున్న సందర్భాల్లో కూడా.. ఓవర్‌లోడ్ వల్ల వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు డివైడర్లను ఢీకొంటున్న సంఘటనల్లో చాలా వరకు ఓవర్‌లోడే ప్రధాన కారణం. – సి.రామచంద్రయ్య, రహదారి భద్రత నిపుణుడు -
హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..!
పలమనేరు: గంగవరం సర్కిల్ పరిధిలోని చెన్నై–బెంగళూరు హైవేలో ఆగి ఉన్న లారీలే టార్గెట్‌గా చోరీలు జరుగుతున్నాయి. డ్రైవర్ లారీని ఆపి నిద్రించే సమయంలో ఓ ముఠా చోరీలకు పాల్పడుతోంది. మొగి లిఘాట్ నుంచి బంగారుపాళెం మధ్యలో వారం రోజుల్లో రెండు చోరీలు జరిగినట్టు తెలిసింది. లారీల్లోని సరుకును దొంగలు మాయం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట చెన్నైనుంచి బెంగళూరుకు వెళుతున్న లారీని డ్రైవర్ విశ్రాంతి కోసం బలిజపల్లి సమీపంలో ఆపి నిద్రిస్తుండగా చోరీ జరిగింది. లారీ వెనుక వైపు టార్పాలిన్ విప్పిన దొంగలు అందులోని బటర్‌ఫ్లై కంపెనీకి చెందిన స్టౌవ్‌లను తస్కరించినట్టు తెలిసింది. నిద్రలో ఉన్న డ్రైవర్ లేచి చూసేసరికి దొంగలు మరో లారీలో జారుకున్నట్టు సమాచారం. మరో ఘటనలో ఇంటీరియల్ డిజైన్ పరికరాల లోడ్ లారీలో డ్రైవర్ నిద్రిస్తుండగా, అందులోనూ కొంత సామాగ్రిని దొంగలు చోరీ చేసినట్టు తెలిసింది. సింగిల్ డ్రైవర్లున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని, డ్రైవర్ నిద్రపోతున్న సమయంలో లారీలు, టెంపోలు, కంటైనర్లలో చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైవేలో చెన్నై నుంచి ఖాళీ లోడ్‌తో వచ్చే లారీడ్రైవర్లు, క్లీనర్లు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రిస్తున్న డ్రైవర్‌పై మత్తుమందు కూడా చల్లుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తమైతే దోచుకున్న సరుకుతో తాము తీసుకొచ్చిన లారీ ఎక్కి పరారవుతున్నట్టు సమాచారం. ఈచోరీలకు సంబంధించి పోలీసులు సీసీ కెమె రా ఫుటేజీల ఆధారంగా నిందితులను గాలిస్తున్నట్టు తెలిసింది. కోవిడ్ నేపథ్యంలో హైవే పట్రోలింగ్ వాహనాలు తిరక్కపోవడం కూడా హైవేలో చోరీలకు కారణమవుతోంది. త్వరలోనే ఈ చోరీ కేసులను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం -
Photo Feature: రైలు బోగీలు కాదు... ఇసుక లారీలే!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు వందలాది సంఖ్యలో లారీలు వస్తాయి. కరోనా కారణంగా ఇంతకాలం వీటి సంఖ్య తక్కువగానే ఉండగా.. లాక్డౌన్ సడలింపులతో రెండు రోజులుగా సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని ఇప్పలబోరు వద్ద లారీలు శనివారం ఇలా మూడు కిలోమీటర్ల మేర నిలిచాయి. ఇవి రైలు బోగీలను తలపించేలా ఉండటంతో అటుగా వెళుతున్న వాహనదారులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: ఈ ‘కాక్టెయిల్’తో కరోనాకు చెక్ -
బండెనక బండి.. ధాన్యం లెండి
జనగామ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌లతో పాటు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 195 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడటంతో కొద్దిరోజులుగా భారీగా ధాన్యం పేరుకు పోయింది. పైగా అకాల వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి మరీ ధాన్యాన్ని మిల్లుల్లో దింపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఏ.భాస్కరావు పర్యవేక్షణలో తహసీల్దార్ రవీందర్, ఇతర శాఖల అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. – జనగామ చదవండి: పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
లారీ.. సారీ
శ్రీకాకుళం, సరుబుజ్జిలి: పాతికలారీలు.. సుమారు రూ.13 కోట్ల విలువ.. వారం రోజుల నిరీక్షణ.. ఆఖరకు మిగిలింది మాత్రం నిరాశ. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోని వంశధార వరదల్లో చిక్కుకున్న 25 లారీలు బయటపడే మార్గాలు దుర్లభమైపోతున్నాయి. లారీలు వరదలో చిక్కుకుని సుమారు వారం రోజులు గడుస్తున్నాయి. నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టిన సమయంలో ఆదరాబాదరాగా పొక్లెయిన్లను తొలగించారు. ఈ పొక్లెయిన్ల యజమానులు కొందరు టీడీపీ నాయకులకు దగ్గరి వారు కావడంతో ముందుగా ఆ వాహనాలను బయటకు తీయించారు. కానీ లారీల విషయంలో మాత్రం అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆ వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదికి మళ్లీ వరదలు వారం రోజులు గడవక ముందే వంశధార నదిలోకి మళ్లీ వరద వచ్చింది. నదిలో నీరు తగ్గితే వాహనాలు బయటకు తీయవచ్చని ఆశపడిన లారీల యజమానులకు ఈ వరద పీడకలగా మారుతోంది. ఒక్కో లారీని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశామని, అంతా ఫైనాన్స్ మీదే తెచ్చామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.13 కోట్ల విలువైన వాహనాలు నదిలోనే ఉండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఒడిశా ప్రాంతంలో విస్తారంగా వానలు కురవడంతో వంశధారలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో లారీలను బయటకు తీసే ప్రక్రి య మరింత ఆలస్యం కావచ్చు. ఇప్పటికే వారం రోజులుగా లారీలు నీటిలోనే ఉండిపోవడం వల్ల భాగాలు పాడవుతాయని, వరదల వల్ల లారీలు కూడా మిగిలే పరిస్థితులు కనిపించడం లేదని యజమానులు వాపోతున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కుటుంబాలతో కలసి వచ్చి సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తామని ప్రకటించారు. నీరు గారుతున్న దర్యాప్తు సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు లేకపోవడంతో కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీ సు వారి చేతిలో ఫైలు ఉందని చెబుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. విచారణ కోసం ఏ ఒక్క అధికారిని కూడా జిల్లా అధికారులు నియమించలేదు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్!
శ్రీకాకుళం బుజ్జిలి: పురుషోత్తపురం ఇసుక ర్యాంపు వ్యవహారం నీరు గార్చేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక వ్యాపారంతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడెక్కడో దాక్కుక్కున్నారు. ఏపాపం ఎరుగని లారీ డ్రైవర్లు, క్లీనర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారనే విమర్శలున్నాయి. వంశధారకు వరద వచ్చి.. ఇసుక కోసం వెళ్లి అందులో లారీలు చిక్కుకున్న సంఘటన జరిగి 6 రోజులు గడుస్తున్న కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. ఇసుక వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినా అసలైన దొంగలను విడిపెట్టి, అమాయకుల వైపుదృష్టిసారించడంతో ప్రజల నుంచి పలు విమర్శలువ్యక్త మవుతున్నాయి. ఒడిశాలో దాక్కున్న నిర్వాహకుడు! పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కీలకపాత్రధారి తమ్మినేని సంతోష్‌కుమార్ (సంతు)సంఘటన జరిగిన కొద్ది గంటల్లో ఒడిశాకు పరారైపోయినట్టు సమాచారం. అధికార పక్షానికి చెందిన ప్రధాననేతకు ఇసుకనుంచి రోజువారీ వసూళ్లను చేరవేసే ప్రధాన వ్యక్తి ఇతనే కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇసుక ర్యాంపులోపనిచేసినందుకు 45 ట్రాక్టర్లకు కూడా సుమారు రూ. 20 లక్షల వరకు నగదు చెల్లించాలి. అలాగే పగలంతాపని చేసిన సుమారు 600 మందికూలీలకు వేతనం కూడా బకాయి ఉన్నట్లు తెలిసింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో పొక్లయిన్.. జలుమూరు మండలం అ«ంధవరం వద్ద వద్దపట్టుబడిన పొక్లయిన్‌ను సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉంచారు. వాహనంపై ఎటువంటి నంబర్ లేకపోవడంతో వాహన యజమానుల వివరాలు బయటకు రాలేదు. నదిలో 25 లారీలు.. వంశధార ఇసుక ర్యాంపులో 23 లారీలు వరదలో చిక్కకున్నట్లు భావించారు. అయితే శుక్రవారం సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నదిలో ఈతకొట్టుకొని వెళ్లి లారీలను పరిశీలించారు. వరద నీటిలో 25 లారీలు ఉన్నాయి. వాటినంబర్లు కూడా గుర్తించారు. కాగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంశధార మరోసారి వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో లారీల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. -
లారీ.. గుండె జారి!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతోపాటు ఇంధనం ధరలు కూడా మండుతున్నాయి. డీజిల్ ధరల మోత, టోల్ చార్జీల వాతలతో రోడ్డుపై పరుగులు తీయాల్సిన లారీలు షెడ్డులకు పరిమితమ వుతున్నాయి. రవాణా రంగానికి గుండెకాయ లాంటి విజయవాడలో తాజాగా రికార్డు స్థాయిలో లీటర్ డీజిల్ ధర రూ.71.73కి ఎగబాకటంతో పరిస్థితి మూలిగే నక్కమీద మీద తాటిపండు పడినట్లైంది. లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం ఇస్తున్న మినహా యింపును రాష్ట్ర ప్రజలకు వర్తింపచేయకపో వటం, తాజాగా టోల్ చార్జీలూ అమాంతంగా పెరగటంతో పరిస్థితి దిగజారింది. రవాణా రంగానికి పిడుగుపాటు రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా డీజిల్ ధర రూ.71.73కు చేరుకోవడవంతో లారీ పరిశ్రమ పిడుగుపాటుకు గురైంది. మరోవైపు ఏప్రిల్ 1వతేదీ నుంచి టోల్ చార్జీలు కూడా 30 శాతం పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం కి.మీ.కు రూ.20.40 చొప్పున డీజిల్ వ్యయం అవుతోంది. ఇక కి.మీ.కు రూ.9 వరకు టోల్ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. డ్రైవర్, సిబ్బంది జీతాలు, నిర్వహణ వ్యయం దీనికి అదనం. రాష్ట్ర సర్కారు బాదుడు లీటరుకు రూ.14 కేంద్ర ప్రభుత్వం 2016లో డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజిల్‌పై రూ.2 తగ్గించ లేదు. డీజిల్ «మీద రాష్ట్ర ప్రభుత్వం 22.25 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తోంది. దీంతోపాటు అదనంగా లీటరుకు రూ.4 చొప్పున వ్యాట్ విధిస్తోంది. కేంద్రం డీజిల్‌పై మినహాయింపు ఇచ్చిన రూ.2 ఎక్సైజ్ డ్యూటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల నుంచి వసూలు చేసి ఖజానాకు మళ్లిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ ధర అధికంగా ఉండటానికి ఇదే కారణం. ఫలితంగా లీటరు డీజిల్ కొనుగోలుపై లారీ యజమానులు, వాహనదారులు దాదాపు రూ.14 చొప్పున భారం భరించాల్సి వస్తోంది. ఇక పెట్రోల్ మీద 31 శాతం పన్ను, లీటర్‌కు రూ.4 వ్యాట్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. 30 శాతం లారీలు షెడ్డుల్లోనే... డీజిల్ ధరలు, టోల్ చార్జీల పెరుగుదలతో సరుకు రవాణా రంగం బెంబేలెత్తిపోతోంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణాకు కేంద్రస్థానంగా ఉన్న విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలోనే 45 వేల లారీలు ఉండటం గమనార్హం. ఆర్థికభారంతో ఇప్పటికే దాదాపు 20 శాతం లారీలు షెడ్డులకే పరిమితమయ్యాయి. తాజాగా డీజిల్, టోల్ చార్జీల పెరుగుదలతో మరో 10 శాతం లారీలకు బ్రేకులు పడ్డాయి. సంక్షోభంలో రవాణా రంగం రాష్ట్రంలో సరకులను చేరవేసే లారీ రవాణా రంగంపై దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 30 శాతం లారీలు ఆగిపోవటంతో 1.50 లక్షల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే లారీ రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పన్ను మినహాయింపు ప్రజలకు అందించాలి ’కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లీటరుకు రూ.2 పన్ను మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందించాలి. డీజిల్ ధర రూ.62.50కి పరిమితం చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన విధానాన్ని రూపొందించాలి. టోల్ చార్జీలను తగ్గించడంతోపాటు ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లించే విధానాన్ని అమలు చేయాలి’ – ఈశ్వరరావు (రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు) -
చోరీ చేయబోయి.. డ్రైవర్లకు చిక్కి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ గోదాం ముందు ఉంచిన మద్యం లారీలకు భద్రత కరువవుతోంది. పార్కింగ్ చేసి ఉన్న లారీ నుంచి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు (ఈశ్వరరావు, గిరి) మద్యం బాటిళ్లు దొంగతనం చేస్తుండగా స్థానిక లారీ డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారం రోజుల్లో 60 సీసాలు ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల మద్యం కంపెనీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్‌కు లారీల్లో మద్యం కేసులు వస్తాయి. గోదాంలో ఉన్న ఖాళీ బట్టి అన్లోడ్ చేస్తారు. గోదాంలో ఖాళీ లేకపోతే జాతీయ రహదారి నుంచి మండల కాంప్లెక్స్ వరకు ఉన్న రోడ్డుపై నిలిపి ఉంచుతారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం, రక్షణ వంటి సౌకర్యాలు లేకపోవడంతో తరచూ లారీల నుంచి మద్యం బాటిళ్లు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదివారం 11 గంటల సమయంలో శుద్ధి జలాలు లగేజ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరరావు, గిరి.. మద్యం లారీలో టార్పాలిన్లు తొలగించి మద్యం బాటిళ్లు చోరీ చేయబోయారు. ఇంతలో వీరిని లారీ డ్రైవర్లు జి.తిరుపతిరావు, జి.రవి పట్టుకున్నారు. వీరిని ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల ఎస్సై వై.కృష్ణ కేసునమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు.వారం రోజులుగా మొత్తం 60 సీసాల వరకూ దొంగతనానికి గురయినట్లు డ్రైవర్లు చెబుతున్నారు. లారీ డ్రైవర్లతోనే పహారా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ వద్ద పదుల సంఖ్యలో మద్యం లోడింగ్ లారీలను నిలిపివేస్తున్నారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. గోదాం లోపల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. లారీ డ్రైవర్లు నిరంతరం పహారా కాస్తుండాలి. వీరు విశ్రాంతి తీసుకునే సమయాల్లో రక్షణ సమస్యగా మారుతోంది. లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం, డ్రైవర్లకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయలేదు. రాత్రివేళల్లో లారీల కింద నిద్రపోతుండటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ సమస్యలు ఉన్నా కనీసం సంబంధిత శాఖలు స్పందించటం లేదు. మరోపక్క గోదాం సామర్థ్యం తక్కువగా ఉన్నా, లారీలు మాత్రం రోజు పదుల సంఖ్యలో కంపెనీల నుంచి వచ్చేస్తున్నాయి. మద్యం లారీల రక్షణకు షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. చోరీ జరిగిన లారీ రోడ్డుపై నిలిచిపోయిన లారీలు -
ప్రాణాలు పోతున్నాయ్..!
‘తెల్లందాక...పొద్దుందాక లారీలే. దుమ్ము, దూళీతో వసపడుతలేదు. దగ్గు, దమ్ము రోగాలొస్తున్నాయ్. కనీసం తిండి కూడా సరిగ్గా తినేటట్లు లేదు. నీళ్లన్నా సల్లిపీయమంటే ఇంటలేరు. ఇంట్లకెల్లి కాలు బయటపెడుదామంటే భయమైతంది. ఊల్లె సర్పంచ్‌కు చెప్పినం. కలెక్టర్‌కు కూడా చెప్పినం. అయినా పట్టించుకున్నోళ్లు లేరు’ అంటూ పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లారీలను నిలిపివేసి, గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బుధవారం రాస్తారోకో చేశారు. సాక్షి, పెద్దపల్లి: జిల్లా ప్రజానీకానికి లారీలు నిత్యం నరకం చూపిస్తున్నాయి. ఓవర్‌లోడ్, మితిమీరిన వేగంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తిరుగుతుండడంతో నిత్యం దుమ్ము, దూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్లు అధ్వానంగా మారాయి. షరామామూలుగానే అధికారులు లారీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా ప్రతి రోజు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యక్ష నరకం ఇసుక క్వారీలు, కంకర క్వారీలు, క్రషర్ల మూలంగా జిల్లాలో వేలాది లారీలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, పెద్దపల్లి, రామగిరి, కమాన్‌పూర్, మంథని మండలాలకు చెందిన ప్రజలకు లారీలతో కంటిమీద కునుకులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లా కాసిపేట, సిరిపురం, గోలివాడ, మేడారంలలో పంప్‌హౌస్, బ్యారేజీలు, టన్నెల్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు అవసరమైన కంకర, ఇసుకను సరఫరా చేసేందుకు ప్రతి రోజు వందలాది లారీలు తిరుగుతున్నాయి. అలాగే జిల్లాలోని జయ్యారం, కన్నాల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో కంకరక్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వందలాది లారీలు నిత్యం కంకరలోడ్‌తో వెళ్తుంటాయి. ఓవర్‌లోడ్‌పై నియంత్రణేది? జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 90శాతం మితిమీరిన వేగం, ఓవర్‌లోడ్‌తోనే కావడం గమనార్హం. ఓవర్‌లోడ్‌తో లారీలు వెళ్లడంతో రోడ్లు అధ్వానంగా మారడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారితోపాటు పాలకుర్తి, పెద్దపల్లి శివారు గ్రామాల్లో తరచూ లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్‌లోడ్, అతివేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఒక్క లారీకి జరిమానా విధించిన సంఘటనలు లేవు. ఓవర్‌లోడ్ నియంత్రణకు స్పెషల్‌డ్రైవ్ లారీల ఓవర్‌లోడ్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. సాధారణ చెకింగ్‌లతోపాటు, ఈ స్పెషల్ డ్రైవ్ గురువారం నుంచి జిల్లాలో అమలవుతుంది. ఎక్కడా ఓవర్‌లోడ్‌తో లారీలు దొరికినా, కేసులు బుక్ చేస్తాం. ఓవర్‌లోడ్‌ను ఖచ్చితంగా నియంత్రిస్తాం. – వై.కొండాల్‌రావు, జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీవో) దుమ్ముతోటి రోగాలత్తాన్నయి లారీల తిరుగుతుండడంతో రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేస్తోంది. రోడ్డును ఆనుకుని ఉన్న ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దగ్గు, దమ్ము వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రుల్ల వేల రూపాయలు ఒడుస్తున్నయి. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలి. కొత్త రోడ్డు పనులు త్వరగా చేయాలి. – బత్తిని లక్ష్మి, పుట్నూర్ తిండి తినలేకపోతున్నాం రహదారికి ఇరువైపులా పొక్లెయిన్‌తో తవ్వి వదిలేశారు. మా గ్రామం మీదుగా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తున్న వందలాది లారీలతో తీవ్రమైన దుమ్ము వస్తున్నది. దీనిపైన గ్రామ సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినం. దుమ్ముతో కనీసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నాం. మా బాధ పట్టించుకున్నోళ్లు లేరు. – బద్రి లక్ష్మి, పుట్నూర్ -
మా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వండి
ఏపీ సీఎంను కోరిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం వినతిపత్రం సమర్పించిన సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, అమరావతి: తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వరకూ వచ్చి వారు నిరసన తెలపటం విశేషం. సంఘం గౌరవాధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ చంద్రబాబును కలసి వినతిపత్రం అందచేసి అనంతరం సంఘం ప్రతినిధులు ఎన్.భాస్కరరెడ్డి, జి.దుర్గాప్రసాద్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాల యంలోని మీడియా పాయింట్లో శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉమ్మడిగా ఉండి ప్రస్తుతం విడిపోయిన రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం లారీలకు లేకపోవటం బాధాకరమన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఏపీ లారీలను ఆపినపుడు సింగిల్ పర్మిట్‌కు సంబంధించిన ఫైల్ తెలంగాణ సీఎం వద్ద అపరిష్కృతంగా ఉందని చెప్పారని, తాము పరిశీలిస్తే అలాంటి ఫైల్ ఏదీ తమ రాష్ట్రానికి రాలేదన్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లారీలకు సింగిల్ పర్మిట్‌ను అమలు చేస్తున్నందున ఏపీ కూడా అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. 2 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి తెలంగాణ సీఎం సంతకం చేసిన ఫైల్ ఏపీలో అపరిష్కృతంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని తాము సీఎంను కోరామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వస్తామన్న ఉద్యోగులను తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీ కొన్న లారీలు లారీలు దగ్ధం డ్రైవరు సజీవ దహనం మరో ఇద్దరికి గాయాలు చంద్రగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా మరో ఇద్దరు గాయాలపాలై, రెండు లారీలు పూర్తిగా కాలిపోయిన ఘటన గురువారం సాయంత్రం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు... మంగళగిరికి చెందిన వెంకట రెడ్డి(48) తన లారీతో క్లీనర్ మస్తాన్(58) కలసి బెంగళూరు నుంచి కిన్లీ సోడా బాటిళ్లతో గురువారం మంగళగిరికి బయల్దేరారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి బెంగళూరుకు ఏపీ 16 టీడీ 2804 గల లారీ ఐరన్ లోడ్‌తో వెళ్తోంది. ఈ నేపథ్యంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి సమీపంలో వస్తున్న సమయంలో వెంకట రెడ్డి తన వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఐరన్ లారీ ట్రాలీను ఢీ కొన్నారు. దీంతో ఐరన్ లారీ వెనుక ఉన్న ఐరన్ రోలర్ ఒక్కసారిగి లారీ క్యాబిన్‌పై పడటంతో, క్యాబిన్ ఒక్కసారిగా పల్టీకొట్టి క్యాబిన్‌లోని గుర్తు తెలియని డ్రైవరు తీవ్ర గాయాలపాలై క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అయితే సోడా లారీ వేగంగా ఢీ కొన్న సందర్భంలో రెండు లారీల డీజల్ ట్యాంకర్లు ఒక్కసారిగా పగిలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల వ్యవధిలో రెండు లారీలు పూర్తిగా మంటల్లో దగ్థమయ్యాయి. సోడా లారీలోని డైవరు వెంకటరెడ్డి, క్లీనర్ మస్తాన్లు స్వల్ప గాయాలపాలై మంటల్లో నుంచి బయట పడ్డారు. ఐరల్ లారీలోని డ్రైవరు మాత్రం పూర్తిగా మంటల్లో చిక్కుకుని నిమిషాల వ్యవధిలో సజీవ దహనం అయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న సీఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి, గాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే లోపు లారీ డ్రైవరు పూర్తిగా కాలిపోయాడు. మంటల్లో ఐరన్ లారీ పూర్తి దగ్ధమవడంతో మృతి చెందిన డ్రైవరు ఎవరనేది తెలియలేదు. ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ ఐరన్ లోడ్‌తో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ గన్నవరంకు చెందిన శేఖర్ లాజిస్టిక్ పేరుతో ఉందని, అయితే మృతి చెందిన డ్రైవరు ఎవరనేది తెలియరాలేదని ఆయన తెలిపారు. అనంతరం పోలీసులు జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు లారీలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసారు. ఈ మేరకు సీఐ శివ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతోనే ప్రమాదం సోడా లారీ డ్రైవరు వెంకట రెడ్డి అతివేగంగా లారీను నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక రైతులు వాపోతున్నారు. బెంగళూరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న సోడా లారీ అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీను ఢీకొంది. దీంతో వెంటనే రెండు లారీల నుంచి మంటలు చెలరేగాయాని వారు వాపోతున్నారు. -
లారీల గడియారం!
టైమెంత? ఊహూ.. మీ వాచీలకేసి చూడకండి. ఫొటో చూసే చెప్పేయవచ్చు. 11 గంటల 2 నిమిషాల 15 సెకన్లు. అయితే ఏంటి అంటారా? ఈ గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్ల ముల్లుల్లా కనిపిస్తున్నాయే... అవన్నీ ముల్లులు కాదు. పెద్దపెద్ద లారీలు. కచ్చితంగా చెప్పాలంటే మొత్తం 14 లారీలున్నాయి. స్వీడన్‌కు చెందిన ట్రక్ తయారీ సంస్థ స్కానియా తమ ఉత్పత్తుల నాణ్యతకు నిదర్శనంగా ఈ ఫీట్‌ను నిర్వహించింది. ఇందులో గొప్పేముంది.. అనుకుంటే చూడండి... గత వారం దాదాపు 70 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో కంపెనీ ఈ ‘గడియారం ఫీట్’ చేసింది. మొత్తం 90 మంది డ్రైవర్లు ఇందులో పాల్గొన్నారు. 24 గంటలపాటు ఈ లారీలు గడియారం ఆకారంలో తిరిగాయి. నిమిషాల ముల్లులో మధ్యలో ఉన్న లారీ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తిరిగితే... చివరన ఉన్నది కచ్చితంగా గంటకు 53 కిలోమీటర్ల వేగంతో రోజంతా తిరిగిందన్నమాట. వావ్! -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
14 వాహనాలపై కేసులు వెంకటాచలం : వెంకటాచలం సమీపంలో జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారు జామున నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. వెంకటాచలం టోల్‌ప్లాజా నుంచి కృష్ణపట్నంపోర్టు రోడ్డు వరకు రెండు బృందాలుగా ఏర్పడి రాకపోకలు కొనసాగించే వాహనాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామన్నారు.14వాహనాలు అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 9 బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, రెండు గ్రానైట్, రెండు పార్శిల్, ఒక కంకర లోడు లారీ ఉన్నట్లు చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసి ట్యాక్స్, అధిక లోడుతో వెళ్లినందుకు పన్ను వసూలు చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉప్పల సత్యనారాయణ, బీటీ నాయక్, డీసీటీఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏజీ రాము తదితరులు ఉన్నారు. -
రెండు లారీలు ఢీ: ఇద్దరి మృతి
కల్లూరు(ఖమ్మం): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి రాజస్థాన్‌కు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీని, ఎదురుగా టర్పెంటైన్‌తో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇసుక లారీల పట్టివేత
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం రుద్రారం గ్రామ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు. లారీలను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించనున్నట్లు వేములవాడ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
రవాణా బంద్
నేటి నుంచి నిరవధిక సమ్మె బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు సమ్మెకు జిల్లాలోని పెట్రోల్ బంకులు దూరం! {పత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష విశాఖపట్నం : రవాణా రంగం స్తంభించనుంది. ప్రైవేటురవాణారంగంలో కీలకమైన లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోనుండడంతో సామాన్యులపై పెనుభారం చూపనుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఆకాశానికి ఎగబాకిన నిత్యాసరాలు రవాణా సమ్మెతో చుక్కలనంటే అవకాశం ఉంది. అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం నుంచి లారీ యజమానులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు.ఆల్ గూడ్స్ వెహికల్స్ యూనియన్స్‌తో ఏర్పాటైన జేఏసీ ఇప్పటికే పలుదఫాలు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించింది. జిల్లాలో గూడ్స్ రవాణా చేసే వాహనాలు 25,617 ఉన్నాయి. వీటిలో లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు, టిప్పర్లు, వ్యాన్లు ప్రధానమైనవి. ఇప్పటికే చాలా వాహనాలు నిలిచిపోగా..మిగిలిన వాహనాలు గురువారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. రవాణా సమ్మె వల్ల ఒక్క విశాఖ జిల్లాలోనే ప్రతీ రోజూ ప్రభుత్వానికి పన్నుల రూపం లో రావాల్సిన రూ.8 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడనుంది. ఇకవాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడం వలన ఎగుమతి.. దిగుమతుల లావాదేవీలు స్తంభించి పోనున్నాయి. వీటివిలువ మరో రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రవాణా సమ్మె వల్ల మన జిల్లా పరిధిలోనే మోటారు కార్మికులతో పాటు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షమందికి పైగా కార్మికులకు ఉపాధి కరువయ్యే పరిస్థితి ఏర్పడనుంది. రాష్ర్టవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకు యజమానులు లారీ యజమానులతో కలిసి సమ్మెబాట పడుతున్నప్పటికీ విశాఖ జిల్లా పరిధిలోని బంక్ యజమానుల్లో మాత్రం బంద్‌లో పాల్గొనే విషయంపై స్పష్టత లేదు. జిల్లా పరిధిలో సుమారు 210 బంకులుండగా, వాటిలో 20 బంకులు నేరుగా హెచ్‌పీసీఎల్ నిర్విహ స్తోంది. హెచ్‌పీసీఎల్ బంకులు మినహా మిగిలిన ప్రైవేటు బంకులన్నీ సమ్మెబాట పట్టనున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖ నగరంతో పాటు రూరల్ ప్రాంతంలోని బంకుల్లో వాహనదారులు బుధవారం మధ్యాహ్నం నుంచి బారులు తీరారు. ప్రతీ బంకు వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. ముందు జాగ్రత్తగా క్యాన్లలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వచేసుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు బంకుల వద్ద కన్పించాయి. కాగా, జిల్లా పరిధిలో పెట్రోల్ బంకు యజమానులు లారీలు, ట్యాంకర్ల సమ్మెలో పాల్గొనడం లేదని విశాఖ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నారాయణరెడ్డి సాక్షికి తెలిపారు. మరొక పక్క నిత్యావసరాలు, కూర గాయల రవాణాకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసరాలకు ఆటంకం రానివ్వకండి: కలెక్టర్ లారీలు, ట్యాంకర్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో జిల్లాలో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సమ్మెకాలంలో పాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, కూరగాయల రవాణాకు ఆటంకం కగలకుండా లారీ యజమానులు సహకరించేందుకు అంగీకరించాయని చెప్పారు. సమ్మె కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ యువరాజ్ బుధవారం రాత్రి రవాణాశాఖాధికారులు, లారీయజమానలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. పెట్రోల్ బంకులన్నింటిలోనూ కనీసం నాలుగైదు రోజులకు సరిపడేలా ఆయిల్ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో కూరగాయలు రవాణా చేసేందుకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలను ఎవరైనా అడ్డగిస్తే పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ జె.నివాస్, డీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘బండంత నిర్లక్ష్యం..!
మోటర్ సైకిల్‌పై ముగ్గురు ఎక్కితే బ్రేక్ ఇన్స్పెక్టర్, పోలీసులు అస్సలు ఒప్పుకోరు. హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రమాదం కదా అంటూ బండి ఆపి మరీ ఫైన్ మీద ఫైన్లు వేస్తుంటారు. టన్నుల కొద్దీ గ్రానైట్ రాళ్లు వాహన సామర్ధ్యానికి మించి రెండు రెట్లు తీసుకుపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. - గ్రానైట్ రాళ్లతో అడ్డగోలు రవాణా - రోజుకు వంద నుంచి 120 లారీల్లో గ్రానైట్ రాళ్ల రవాణా - నిబంధనల మేరకు 50 టన్నులకు మించకూడదు.. - కానీ 80-100 టన్నుల వరకు తీసుకు వస్తున్న వైనం - చోద్యం చూస్తున్న అధికారులు చీమకుర్తి: గ్రానైట్ రాళ్లను సామర్ధ్యానికి మించి చీమకుర్తి, బల్లికురవ నుంచి ఒంగోలులోని సూరారెడ్డిపాలెం, చెన్నై వైపు రోజుకు 100-120 లారీలు సామర్ధ్యానికి మించిన రాళ్లతో రవాణా చేస్తున్నారు. గరిష్టంగా 50 టన్నులకు మించి రవాణా చేయకూడదని రవాణాశాఖాధికారుల నిబంధనలు తెలియజేస్తున్నా, బాడుగకు ముఖం వాచిన లారీ యజమానులు వాహన సామర్ధ్యానికి మించి 80-100 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. అదే సమయంలో వాలు వంక లేని గ్రానైట్ రాళ్లను లారీ ప్లాట్ఫారం బయటకు పొడుచు కొచ్చే విధంగా లోడు చేసుకుని రోడ్డుపక్కల ప్రయాణం సాగిస్తూ ఇతర వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటరు రాయి నాణ్యతను బట్టి 3-5 టన్నుల బరువు ఉంటుంది. ఇటీవల ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద జారిపడ్డ గ్రానైట్ రాయి సుమారు 10-12 టన్నుల బరువు ఉండవచ్చు. అంత బరువు ఉన్న గ్రానైట్ రాయి కాలేజీ ముందున్న స్పీడ్ బ్రేకర్ వద్ద లారీకి బ్రేక్ వేయడంతో లారీ నుంచి జర్రన జారి రోడ్డు మార్జిన్లో పడింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక గ్రానైట్ క్వారీలలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కర్నూల్‌రోడ్డు మీదుగానే పట్టపగలు 20-30 టన్నుల బరువు ఉండే రాళ్లను రవాణా చేస్తున్నారు. ఒక వేళ కంటైనర్‌లో లోడు చేసినా అతివేగంతో నడిపితే అనుకోకుండా బ్రేకులు వేయాల్సి వస్తే గ్రానైట్ రాళ్లు ఉన్న కంటైనర్ జారీ కిందపడిన సంఘటనలు ఉన్నాయి. రోజూ పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చినా రెండు, మూడు రోజులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు కాస్త హడావుడి చేస్తున్నారే తప్ప పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠినంగా నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం - ఆర్టీవో రాంప్రసాద్ గ్రానైట్ వాహనాల రవాణాపై త్వరలో యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం. ట్రాన్స్‌పోర్ట్‌కి ఒంగోలుకి డిప్యూటీ కమిషనర్ కూడా కొత్తగా రానున్నారు. ఆయన రాగానే రవాణాపై ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తాం.