
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు వందలాది సంఖ్యలో లారీలు వస్తాయి. కరోనా కారణంగా ఇంతకాలం వీటి సంఖ్య తక్కువగానే ఉండగా.. లాక్‌డౌన్ సడలింపులతో రెండు రోజులుగా సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని ఇప్పలబోరు వద్ద లారీలు శనివారం ఇలా మూడు కిలోమీటర్ల మేర నిలిచాయి. ఇవి రైలు బోగీలను తలపించేలా ఉండటంతో అటుగా వెళుతున్న వాహనదారులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
చదవండి: ఈ ‘కాక్‌టెయిల్’తో కరోనాకు చెక్
Comments
Please login to add a commentAdd a comment