train compartment
-
46 రైళ్లలో జనరల్ బోగీల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దేశవ్యాప్తంగా జనరల్ బోగీలను పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దేశంలోని 46 ప్రముఖ రైళ్లలో రెండేసి చొప్పున మొత్తం 92 జనరల్ కోచ్‌లను పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో మరో 22 రైళ్లలో జనరల్ కోచ్‌లను పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న 12 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 23 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేసి నడపనున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆ జాబితాలో సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12710/12709) నవంబర్ 8 నుంచి, సికింద్రాబాద్–హౌరా, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12704/12703) నవంబర్ 8 నుంచి, హైదరాబాద్–విశాఖపట్నం, గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728/12727) నవంబర్ 10 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/12738) నవంబర్ 8 నుంచి, కాకినాడ పోర్టు–భవనగర్, కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (12755/12756) ఈ నెల 14 నుంచి, కాకినాడ పోర్టు–షిర్డీ సాయినగర్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17206/17205) నవంబర్ 11 నుంచి, హైదరాబాద్–తాంబరం, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12760/12759) నవంబర్ 11 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, కొకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776) నవంబర్ 12 నుంచి, సికింద్రాబాద్–భువనేశ్వర్, విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016/17015) నవంబర్ 14 నుంచి, మచిలీపట్నం–యశ్వంత్‌పూర్, కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212) నవంబర్ 11 నుంచి, మచిలీపట్నం–ధర్మవరం, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216) ఈ నెల 12 నుంచి, కాకినాడ పోర్టు–లోకమాన్య తిలక్ టెర్మినస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17221/17222) నవంబర్ 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి–కొల్లం ఎక్స్‌ప్రెస్ (17421/17422) కూడా ఈ జాబితాలో ఉంది. -
Photo Feature: రైలు బోగీలు కాదు... ఇసుక లారీలే!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు వందలాది సంఖ్యలో లారీలు వస్తాయి. కరోనా కారణంగా ఇంతకాలం వీటి సంఖ్య తక్కువగానే ఉండగా.. లాక్డౌన్ సడలింపులతో రెండు రోజులుగా సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని ఇప్పలబోరు వద్ద లారీలు శనివారం ఇలా మూడు కిలోమీటర్ల మేర నిలిచాయి. ఇవి రైలు బోగీలను తలపించేలా ఉండటంతో అటుగా వెళుతున్న వాహనదారులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: ఈ ‘కాక్టెయిల్’తో కరోనాకు చెక్ -
ఆగి ఉన్న రైలులో యువకుడి మృతదేహం
హైదరాబాద్‌సిటీ: నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని ఆగి ఉన్న రైల్లో యువకుడి శవం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ట్రైన్ బోగీలో పడవేశారు. గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
నీకో ముద్ద..నాకో ముద్ద..
వరంగల్(మట్టెవాడ): మనుషులైనా..జంతువులైనా..సృష్టిలోని ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం కావాలి.. మనలోని కొంతమంది ఔత్సాహిక జంతుప్రియులు వాటిని పెంచుకుంటూ ఉంటాం.. వాటి ఆలనా పాలనా చూస్తాం.... వాటికి ఏది కావాలో అదే పెడతాం..లేదంటే మనం ఏది తింటామో అదే వాటికి పెడతాం..అవి తినటానికి చిన్నపిల్లవాడిలా మారాం చేసినా..దగ్గరకు తీసుకుని బుజ్జగించి పెడతాం..అలాంటి సంఘటనే నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. రైలు బోగీలో చెత్త ఊడ్చి పదో పరకో అడుక్కునే ఓ అమ్మాయి.. తను పెంచుకుంటున్న ఓ చిన్న వానరం అన్నతినకుండా మారాం చేస్తే తను తింటూ వానరానికి తినిపించింది..