రైల్వేశాఖ కీలక నిర్ణయం
విజయవాడ డివిజన్‌లో 23 జనరల్ కోచ్‌ల ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దేశవ్యాప్తంగా జనరల్ బోగీలను పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దేశంలోని 46 ప్రముఖ రైళ్లలో రెండేసి చొప్పున మొత్తం 92 జనరల్ కోచ్‌లను పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో మరో 22 రైళ్లలో జనరల్ కోచ్‌లను పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న 12 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 23 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేసి నడపనున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.
ఆ జాబితాలో సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12710/12709) నవంబర్ 8 నుంచి, సికింద్రాబాద్–హౌరా, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12704/12703) నవంబర్ 8 నుంచి, హైదరాబాద్–విశాఖపట్నం, గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728/12727) నవంబర్ 10 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/12738) నవంబర్ 8 నుంచి, కాకినాడ పోర్టు–భవనగర్, కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (12755/12756) ఈ నెల 14 నుంచి, కాకినాడ పోర్టు–షిర్డీ సాయినగర్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17206/17205) నవంబర్ 11 నుంచి, హైదరాబాద్–తాంబరం, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12760/12759) నవంబర్ 11 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, కొకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776) నవంబర్ 12 నుంచి, సికింద్రాబాద్–భువనేశ్వర్, విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016/17015) నవంబర్ 14 నుంచి, మచిలీపట్నం–యశ్వంత్‌పూర్, కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212) నవంబర్ 11 నుంచి, మచిలీపట్నం–ధర్మవరం, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216) ఈ నెల 12 నుంచి, కాకినాడ పోర్టు–లోకమాన్య తిలక్ టెర్మినస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17221/17222) నవంబర్ 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి–కొల్లం ఎక్స్‌ప్రెస్ (17421/17422) కూడా ఈ జాబితాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment