హైదరాబాద్‌సిటీ: నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని ఆగి ఉన్న రైల్లో యువకుడి శవం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ట్రైన్ బోగీలో పడవేశారు. గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.