
జనగామ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌లతో పాటు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 195 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడటంతో కొద్దిరోజులుగా భారీగా ధాన్యం పేరుకు పోయింది. పైగా అకాల వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి మరీ ధాన్యాన్ని మిల్లుల్లో దింపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఏ.భాస్కరావు పర్యవేక్షణలో తహసీల్దార్ రవీందర్, ఇతర శాఖల అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.
– జనగామ