
యాదాద్రి జిల్లాలో పడిపోతున్న సాగు విస్తీర్ణం
వరి, పత్తి పంటల సాగుకే రైతుల మొగ్గు
రామన్నపేట: గడ్డిజాతి పంటలైన చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఏటేటా పడిపోతోంది. ఆహారం, పశుగ్రాసం కోసం సాగుచేసే చిరుధాన్యా లను సిరిధాన్యాలు అని కూడా అంటారు. మంచిపోషకాలు కలిగిన చిరుధాన్యాలు వర్షా ధార పంటలు. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలు గోధు మలతో సరితూగుతాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలో సాగునీటి వనరులు పెరగడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆ తరువాత వాణిజ్య పంట అయిన పత్తిని పెద్దమొత్తంలో సాగు చేస్తున్నారు.
గతంలో సగం చిరుధాన్యాలే
చిరుధాన్యాలను సాధారణంగా వానాకాలంలోనే సాగు చేస్తారు. స్వల్ప ఖర్చుతో సేంద్రియ పద్ధతుల్లో రసాయనాలు వాడకుండా పండించేవారు. 10–15 సంవత్సరాల క్రితం వరకు సాగులో సగం వరకు చిరుధాన్యాలపంటలే ఉండేవి. వీటిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, నాణ్యమైన విత్తనాలు లేకపో వడం.. ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో సాగు విస్తీర్ణం ఏటా పడిపో తోంది. పిట్టల నుంచి కాపాడుకోవడం కష్టత రంగా మారడం, ఇటీవలి కాలంలో కోతుల బెడద ఎక్కువ అవడం, సాగునీటి వనరులు మెరుగు పడడం కూడా చిరుధాన్యాల సాగు తగ్గడానికి కారణంగా మారాయి.
ఆరోగ్యానికి మేలు
దశాబ్దం క్రితంవరకు సామాన్యుడి ఆహారంలో చిరుధాన్యాలతో వండే సజ్జగట్క, జొన్నగట్క, రొట్టెలు, రాగిజావను ఎక్కువగా ఉండేవి. వీటిలో అధిక పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. విటమిన్ బీ 12, బీ 17, బీ 6ను కలిగి ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇటీవ చిరుధాన్యాలను భుజించడం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. పైగా ప్రతి ఏటా తగ్గుతూ వస్తుంది.

Comments
Please login to add a commentAdd a comment