లారీల గడియారం!
టైమెంత? ఊహూ.. మీ వాచీలకేసి చూడకండి. ఫొటో చూసే చెప్పేయవచ్చు. 11 గంటల 2 నిమిషాల 15 సెకన్లు. అయితే ఏంటి అంటారా? ఈ గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్ల ముల్లుల్లా కనిపిస్తున్నాయే... అవన్నీ ముల్లులు కాదు. పెద్దపెద్ద లారీలు. కచ్చితంగా చెప్పాలంటే మొత్తం 14 లారీలున్నాయి. స్వీడన్‌కు చెందిన ట్రక్ తయారీ సంస్థ స్కానియా తమ ఉత్పత్తుల నాణ్యతకు నిదర్శనంగా ఈ ఫీట్‌ను నిర్వహించింది.
ఇందులో గొప్పేముంది.. అనుకుంటే చూడండి... గత వారం దాదాపు 70 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో కంపెనీ ఈ ‘గడియారం ఫీట్’ చేసింది. మొత్తం 90 మంది డ్రైవర్లు ఇందులో పాల్గొన్నారు. 24 గంటలపాటు ఈ లారీలు గడియారం ఆకారంలో తిరిగాయి. నిమిషాల ముల్లులో మధ్యలో ఉన్న లారీ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తిరిగితే... చివరన ఉన్నది కచ్చితంగా గంటకు 53 కిలోమీటర్ల వేగంతో రోజంతా తిరిగిందన్నమాట. వావ్!