Clock
-
‘గడియారం’ అజిత్ పవార్ వర్గానికే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్‌కు ఎంతో అనుబంధం ఉంది. గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది. -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధాంచాలంటూ శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని సుప్రీం ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని సున్నిహితంగా హెచ్చరించింది. అంతేగాక అజిత్ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శరద్ పవార్ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.కాగా 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చీలికత ర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా, ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. శరద్ చంద్ర పవార్ వర్గానికి.. ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ఈసీ ఖరారు చేసింది. -
గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
చారిత్రక ఆనవాలుగా చార్మినార్ గడియారం
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్‌కి వచి్చంది. వాచ్‌లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే... నిజాం కాలంలో... నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్‌యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో... 1942 నుంచి లాడ్‌బజార్‌లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్బాజర్లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.పావురాలు తిష్ట వేయడంతో..విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్‌తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్‌కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. లోపల సిరామిక్ మెటల్‌తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్‌తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్‌కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.48 గంటలకోసారి... నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.నిరంతర పర్యవేక్షణలో...ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం. – గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు. -
శరద్ పవార్‌కు బిగ్ షాక్
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును అజిత్ వర్గం దక్కించుకుంది. ఎన్సీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ పవార్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి ఓ పేరును ఎంచుకోవాలని ఈసీ శరద్ పవార్‌ను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన(రేపు) ఈసీ ముందుకు శరద్ పవార్ వర్గం.. పార్టీ పేరు, గుర్తు అభ్యర్థనతో వెళ్లనుంది. ఆ వెంటనే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఏక పక్షంగా! ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. అయితే.. ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆమె అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ కూటమి ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగడం గమనార్హం. -
రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్..
గడియారం అంటే 24 గంటలు నడుస్తుందని అందరికి తెలుసు, అయితే 10,000 సంవత్సరాలు నడిచే గడియారం అంటే? అదెలా ఉంటుందో తెలుసుకోవడానికి అందరూ తెగ ఉత్సాహపడిపోతారు. అలాంటి వాచ్ నిర్మించడానికి అమెజాన్ ఫౌండర్ భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పదివేల సంవత్సరాల పాటు పనిచేసే గడియారాన్ని నిర్మించడానికి జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 350 కోట్లు) పెట్టుబడి పెట్టారు. అమెరికాలోని టెక్సాస్ కొండలపై ఏర్పాటు చేయనున్న ఈ గడియారం పొడవు 500 అడుగుల వరకు ఉంటుంది. దీనిని 'లాంగ్ న్యూఫౌండేషన్' అనే సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే 'టిక్' అంటూ సౌండ్ చేస్తుందని చెబుతున్నారు. ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ 'డానీ హిల్స్' (Danny Hillis) ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టుకి 'ది క్లాక్ ఆఫ్ ది లాంగ్ నౌ' అని పేరు పెట్టారు. ఇది దీర్ఘకాల ఆలోచనకు చిహ్నంగా, భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తుచేయడానికి ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. అమెరికాలో ఏర్పాటుకానున్న ఈ 500 అడుగుల అతి పెద్ద వాచ్ థర్మల్ సైకిల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సోలార్ సింక్రొనైజర్, పెండలం, చైమ్ జనరేటర్, గేర్లు, డయల్ వంటివి ఉండనున్నాయి. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యం త్వరలో నిర్మితం కానున్న ఈ అతి పెద్ద గడియారంలో ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్లు ఉండనున్నట్లు సమాచారం. మొదటి సంవత్సరం మొదటి ఛాంబర్, 10వ ఏడాదికి రెండవ ఛాంబర్, 100వ సంవత్సరం నాటికి మూడవ ఛాంబర్, 1000వ ఏడాదికి నాలుగవ ఛాంబర్, 10000వ ఏడాదికి ఐదవ ఛాంబర్ కేటాయించనున్నట్లు చెబుతున్నారు. -
గడియారాలను తగలేస్తారు!
ఉత్తరార్ధగోళంలో శీతకాలపు అత్యంత సుదీర్ఘరాత్రి డిసెంబర్ 21. చాలా పాశ్చాత్య దేశాల్లో ‘విటర్ సోల్స్టైస్’ వేడుకలు జరుపుకొంటారు. క్రిస్మస్కు నాలుగు రోజుల ముందు వచ్చే ఈ సుదీర్ఘరాత్రి సందర్భంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు చేసుకుంటారు. ఇంగ్లండ్‌లోని బ్రైటన్ రేవు పట్టణంలో మాత్రం ‘వింటర్ సోల్స్టైస్’ సందర్భంగా జనాలంతా సందడి సందడిగా బయలుదేరి వీథుల్లోకి వచ్చి మూకుమ్మడిగా గడియారాలను తగలేస్తారు. వాళ్లు తగలేసేవి నిజం గడియారాలు కాదు లెండి. కాగితాలు, అట్టలతో చేసిన బొమ్మలాంతరు గడియారాలను కూడళ్లలో పోగుబెట్టి తగలేస్తారు. వీథుల్లో నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపు పొడవునా బాణసంచా కాల్పులు జరుపుతారు. ‘బర్నింగ్ ది క్లాక్స్’ పేరుతో జరిపే ఈ వేడుక వెనుక పురాతన సంప్రదాయమేదీ లేదు. ముప్పయ్యేళ్లుగా మాత్రమే ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. తొలిసారిగా 1993లో ఈ వేడుకలు జరిగాయి. అప్పటి నుంచి బ్రైటన్ ప్రజలకు ఇదొక ఆనవాయితీగా మారింది. సహకార ఉద్యమానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సేమ్ స్కై’ అనే కళాకారుల బృందం ఈ ‘బర్నింగ్ ది క్లాక్స్’ వేడుకలను ప్రారంభించింది. ఈ వేడుకలను తిలకించడానికి ఇంగ్లండ్ నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో జనాలు బ్రైటన్‌కు చేరుకుంటారు. గడచిన ముప్పయ్యేళ్లలో ఈ వేడుకలు మూడుసార్లు మాత్రమే రద్దయ్యాయి. తొలిసారి 2009లో హిమపాతం కారణంగా రద్దయితే, తర్వాత 2020, 2021లో ‘కోవిడ్’ కారణంగా ఈ వేడుకలు జరగలేదు. -
‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు. ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది? -
Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత గోడ గడియారాల్లో అదొకటి. దీనికి ఒకటిన్నర శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. అప్పట్లో ఫేవ్రే– ల్యూబా కంపెనీ ఈ గడియారాన్ని తయారు చేసింది. అలాంటి ఈ గోడ గడియారం ఎనిమిదేళ్లుగా మూగబోయింది. నగరంలోని మక్కా మసీదు గడియారం ముల్లు ఎట్టకేలకు మళ్లీ కదిలింది. 1850లో అప్పటి 4వ నిజాం నవాబ్ నాసిర్–ఉద్–దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అప్పటినుంచి నిరాటంకంగా పని చేసిన ఈ లోలకం ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయింది. ఈ గడియారాన్ని వాహెద్ వాచ్ కంపెనీ మరమ్మతు చేయడంతో మళ్లీ గంట కొట్టడం మొదలైంది. నిజాం సామ్రాజ్యం అంతరించిన అనంతరం ఈ గడియారం నిర్వహణ వాహెద్, భారత్ వాచ్ కంపెనీలు సంయుక్తంగా చూశాయి. 2015లో ఈ వాచ్ నిలిచిపోవడంతో అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టిన ఈ సంస్థలు.. ఎట్టకేలకు దాన్ని పునరుద్ధరించగలిగాయి. చదవండి: Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ -
గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?
ఎప్పుడైనా మీరు చేతి వాచీ వైపో, గోడ గడియారంవైపో తదేకంగా చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు మొదట మెల్లగా కదిలి, తర్వాత స్పీడెత్తుకోవడం గమనించారా? ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదంటారా? పోనీ ఇప్పుడు ట్రై చేస్తారా?.. డిజిటల్‌వి కాకుండా ముళ్లుండే గడియారంవైపు చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు తొలి సెకన్ పాటు మెల్లగా కదిలినట్టు అనిపిస్తుంది. తర్వాతి సెకన్ నుంచి మామూలుగానే ముందుకెళ్తుంది. కాస్త గ్యాప్‌తో ఎన్నిసార్లు మార్చి మార్చి చూసినా దాదాపు ఇలాగే అనిపిస్తుంటుంది. యూట్యూబ్‌లో అసాప్‌సైన్స్ అనే చానల్ నడిపే సైన్స్ నిపుణుడు దీనికి కారణాలను వివరించారు. మెదడు ప్రాసెస్ చేసే తీరు వల్లే.. గడియారాన్ని చూసినప్పుడు మొదటి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. సాధారణంగా మన కళ్లు రెండు రకాలుగా కదులుతుంటాయి.ఒకటి స్మూత్ పర్సూ్యట్, రెండోది సెక్కాడ్. ►స్మూత్ పర్సూ్యట్ విధానంలో కళ్లు చాలా మెల్లగా కదులుతూ గమనిస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాస్త దూరంలో కారో, బైకో కదులుతూ ఉంటే.. కళ్లు దానికి అనుగుణంగా కదులుతూ చూస్తుంటాయి. ఈ విధానంలో కంటి నుంచి అందిన సమాచారాన్ని మెదడు వెంటవెంటనే ప్రాసెస్ చేస్తుంటుంది. మనం గడియారంలోకి చూసినప్పుడు.. రెండో సెకన్ నుంచి సెకన్ల ముల్లు అలా కదులుతూ ఉండటాన్ని గమనించడం కూడా ‘పర్సూ్యట్’ కిందకే వస్తుంది. ►సెక్కాడ్ విధానం అంటే.. ఏదైనా ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా, వెంటనే దృష్టి మళ్లించడం. ఇలా చేసినప్పుడు తొలుత చూస్తున్న దృశ్యం, చివరిగా దృష్టిని ఆపిన దృశ్యం మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. మధ్యలో ఉన్నదంతా చూచాయగానే అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు దూరంగా ఉన్న ఏదైనా భవనాన్ని చూస్తున్నారు. పక్కన ఏదో చప్పుడైతే ఒక్కసారిగా అటువైపు చూశారనుకోండి. ఆ భవనానికి, ఈ చప్పుడు వచ్చిన చోటికి మధ్య దృశ్యాలేవీ పెద్దగా ఆనవు. కంటి నుంచి అందే సమాచారాన్ని మెదడు అంత వేగంగా, వెంటనే ప్రాసెస్ చేయలేకపోవడమే దీనికి కారణం. ►మనం గడియారం వైపు చూసినప్పుడు తొలి దృష్టి సెక్కాడ్ మోడ్‌లోనే ఉంటుంది. అప్పటికే కదులుతూ ఉన్న ముల్లు ఆగి, మళ్లీ కదులుతున్న సమయంలో.. మెదడు ఆ దృశ్యాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. అంతకుముందు చూస్తూ ఉన్న దృశ్యం నుంచి గడియారం వైపు దృష్టిని మరల్చిన సమయాన్ని కూడా కలిపేస్తుంది. దీనితో తొలి సెకన్ గడిచేందుకు ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే మన దృష్టి స్మూత్ పర్సూ్యట్లోకి వచ్చేస్తుంది కాబట్టి.. మిగతా సెకన్లు మామూలుగానే గడిచిపోతుంటాయి. -
ఈటల సతీమణికి షాక్: నిలదీసిన బాధితుడు
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు చుక్కెదురైంది. హుజురాబాద్ పర్యటనలో ఉండగా ఓ బాధితుడు ఆమె ముందరనే గడియారం పగటలగొట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఆమె అవాక్కయ్యారు. తన భర్త ఈటల తీరును బాధితుడు ఎండగట్టాడు. అనుకోని ఘటనతో ఆమెతో పాటు ఈటల అనుచరులు ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హుజురాబాద్‌లోని మామిళ్లవాడలో ఈటల సతీమణి జమున శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. తన కుమారుడు క్రీడా పోటీలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందగా ఈటల రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపాడు. అందులో రూ.లక్ష మాత్రమే ఇచ్చారని మిగిలిన రూ.4 లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయాడు. ఈ విషయమై జమునను శ్రీను నిలదీశాడు. ప్రచారంలో ఈటల రాజేందర్ ఫొటోతో ఉన్న గడియారాన్ని కింద పడేసి రభస చేశాడు. అయితే శ్రీను భార్యకు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఓ ఉద్యోగం కూడా కల్పించారు. డబ్బుల కోసమే శ్రీను నిలదీశాడని తెలుస్తోంది. -
పని లేని పని..
ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం రాలేదే అని బాధపడుతుంటాం.. అదే వచ్చాక అబ్బా ఏ పని చేయకున్నా జీతం వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అనుకునే ఉంటారు కదూ..! అచ్చు అలాంటి ఉద్యోగమే ఒకటి ఉంది చేస్తారా..? అయితే ఇక్కడ కాదులెండి స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ అనే పట్టణంలోని కోర్స్వ్యాగన్ రైల్వేస్టేషన్లో. మరి ఏ పనీ చేయకుండా ఉండేది ఉద్యోగం ఎలా అవుతుందనే కదా మీ అనుమానం. అదే ఇక్కడ ట్విస్టు. ఆ రైల్వే స్టేషన్లో ఓ గడియారం ఉంటుంది. దాని స్విచ్ ఆన్ చేస్తే ప్లాట్‌ఫాంపై ఓ లైటు వెలుగుతుంది. దీంతో అక్కడో పనిలేని పనోడు ఉద్యోగానికి వచ్చాడని తెలుస్తుందన్న మాట. మళ్లీ డ్యూటీ అయిపోయాక దాన్ని బంద్ చేస్తే చాలు. ఇదీ ఉద్యోగం. మధ్యలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. మీకిష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. ఫుల్ జీతం మాత్రం వచ్చేస్తుంది. ఇంతకీ జీతం ఎంతో తెలుసా దాదాపు రూ.1.6 లక్షలు. అంతేకాదు అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. పెన్షన్ ఇలా ఒక్కటేమిటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కోర్స్వ్యాగన్ రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ఓ డిజైన్ రూపొందించాల్సిందిగా పబ్లిక్ ఆర్ట్ ఏజెన్సీ స్వీడన్, అక్కడి రవాణా శాఖ పోటీలకు పిలిచారు. ఇందుకు గెలిచిన వారికి దాదాపు రూ.5.2 కోట్లు ప్రైజ్‌మనీగా ఇస్తామని 2017లో ప్రకటించారు. దీంతో చాలా మంది పోటీపడగా.. ఆర్టిస్ట్ డుయో సైమన్, జాకబ్ సెన్నెబీలు మంచి ఐడియాలతో వచ్చి ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అయితే ఆ డబ్బును ఒక ఉద్యోగి జీతం కోసం వాడుకోవాలని వారు సలహా ఇచ్చారు. పైగా ఆ ఉద్యోగి ఏ పని కూడా చేయకూడదని చెప్పారు. జీతంపై ఏటా 3.2 శాతం పెంచాలని కూడా నిర్ణయించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఉద్యోగం అందుబాటులోకి రావాలంటే 2026 వరకు ఆగాల్సిందే. అంతేకదా అప్పటికి కానీ ఆ రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తి కాదు. -
'స్మార్ట్' పాయిసన్...!
తూర్పుగోదావరి, కె.గంగవరం: రాత్రి వేళ కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడా అని ఇప్పుడు ఇంట్లో వెతకడం లేదు.. పక్క వ్యక్తి టైం ఎంత? అంటే ఎవరూ ముంజేతిని చూసుకోడం లేదు. ఈవేళ ఏ వారమని అనుమానం వస్తే ప్యాకెట్ క్యాలెండర్ చూడడం లేదు. ఆడుకునే ఆటబొమ్మలు మాయం అయ్యాయి. బంధువుల యోగక్షేమాలు తెలిపే ఉత్తరాలు దాదాపు శుభలేఖలకే పరిమితమైపోయాయి. సుందర దృశ్యాలు బంధించే కెమేరాలు, జ్ఞాపకాలను పదిలంగా ఉంచే ఫొటో ఆల్బమ్‌లు అరుదుగా కనిపిస్తున్నాయి. సుప్రభాతం వినిపించే రేడియోలు మాయమయ్యాయి. సంగీతంతో ఉత్సాహాన్ని నింపే టేప్ రికార్డులు చూద్దామన్నా లేవు. కాలక్షేపంగా ఎవరి చేతిలోనూ పుస్తకాలు కనిపించడం లేదు. వీటన్నిటికీ ఒకటే కారణంస్మార్టు ఫోన్..! ♦ పై అవసరాలన్నీ తీర్చే అద్భుత సాధనం స్మార్ట్ ఫోన్. స్మార్టుగా ఇంట్లోకి దూరి ఎన్నో వస్తువులను దూరం చేసింది. ♦ అవి 1983 వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతున్న రోజులు.. భారత్, వెస్డెండీస్ జట్లు ఫైనల్లో తలబడుతున్నాయి. అందరూ ఆట గురించి రేడియోలో వచ్చే కామెంట్రీ వింటూ ఆస్వాదిస్తున్నారు. కేవలం ధనవంతులు ♦ మాత్రమే అప్పుడే వచ్చిన టెలివిజన్‌లో ఆటను చూస్తూ ఆనందం పొందేవారు. ప్రస్తుతం ఆదే మ్యాచ్‌ను అధిక శాతం ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లో నేరుగా వీక్షిస్తున్నారు. ♦ గతంలో ఏమైనా పుస్తకాలు, నవలు, కథలు చదవాలంటే గ్రంథాలయానికో, లేక అద్దెకు ఇచ్చే దుకాణాలకు వేళ్లేవారు. రోజుకింత అద్దె చెల్లించి పుస్తకాన్ని తెచ్చుకుని చదివి తిరిగి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పుస్తకాలు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఆన్లైన్లో ఏ పుస్తకం కావాలన్నా పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది. దాన్ని ఎంచక్కా డౌన్లోడ్ చేసుకుని చదివేసుకోచ్చు. ♦ జీవన శైలిని మార్చడమే కాదు.. సాంప్రదాయ భారతీయుల జీవితంతో పెనవేసుకున్న ఎన్నో మధురానుభూతులను దూరం చేసింది స్మార్ట్ ఫోన్. యువతే కాదు.. గృహిణులు, ఉద్యోగులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ధనిక, పేద వర్గాలు ఈ అద్భుతాన్ని స్మార్ట్‌గా వినియోగించేస్తున్నారు. ♦ టార్చ్‌లైట్, వాచ్, అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, కెమెరా, రేడియో, ఆడియో ప్లేయర్, రికార్డర్, డిక్షనరీ, పుస్తకాలు, గేమ్స్, లేఖలు ఇలా ఎన్నో వస్తువుల అవసరాన్ని స్మార్ట్ ఫోన్ తీరుస్తోంది. ♦ జిల్లాలో సుమారుగా 52 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో సుమారు 60 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని ఓ అంచనా.. ఇందులోనూ 4జీ నెట్‌వర్క్‌తో కూడిన స్మార్టుఫోన్ వినియోగించే వారు 20 శాతానికి పైగానే ఉన్నారు. అంటే జిల్లాలో 9 నుంచి 10 లక్షల మంది స్మార్టు ఫోన్లను ఉపయోగిస్తున్నారని అంచనా.. నెట్వర్క్ వేగాలు పెరిగాకా, చౌక అయ్యాకా స్మార్టు ఫోన్ వాడే వారి సంఖ్య బాగా ♦పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో 6వ తరగతి విద్యార్థి నుంచి వృద్ధుల వరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు సైతం స్మార్టుఫోన్లో యాప్‌లను ఓపెన్ చేసి వాడుతుండడం మన ఇళ్లలో అనుభవైకమే. వ్యాపారం మార్చేస్తున్నారు.. స్మార్ట్‌ఫోన్ ప్రభంజనంలో కొందరు వ్యాపారులు, మెకానిక్‌లు జీవనోపాధిని కోల్పోయారు. వారిలో మొట్టమొదట చెప్పుకోవలసినది రేడియే సంబంధ వ్యాపార, మెకానిక్‌లే. సెల్‌ఫోన్ వస్తూనే ఎఫ్ఎం రేడియోను మోసుకొచ్చేసింది. దీంతో రేడియోల వ్యాపారం అమాంతం పడిపోయింది. దీంతో పాటు వాక్మెన్లు, టేప్రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు ఒకదాని తరువాత ఒకటి ఉనికిని కోల్పోయాయి. ఒకప్పుడు కొత్త సినిమా ఆడియో వేడుకలు బ్రహ్మాండంగా చేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో ప్రీరిలీజ్ ఫంక్షన్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు కొన్ని రోజుల ముందుగానే పాటలను ఆన్లైన్ ద్వారా జనంలోనికి పంపించేస్తున్నారు. దీంతో గతంలో రేడియాలు, టేప్ రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు, విక్రయించే దుకాణాలు ఇప్పుడు ఆధునిక ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు విక్రయిస్తూ వ్యాపార సరళిని మార్చుకున్నారు. వాచ్ వ్యాపారులపై ప్రభావం తక్కువే.. స్మార్ట్ ఫోన్ల రాకతో వాచ్‌ల వినియోగం తగ్గిన మాట వాస్తవమే అయినా.. వాచ్ ధరించడం హోదాకు, గౌరవానికి గుర్తుగా భావిస్తున్నవారూ అధికంగానే ఉన్నారు. పుస్తకాలు సైతం ఆన్లైన్లోనే.. ఒకప్పుడు పుస్తకం హస్తాభరణం అనేవారు. కానీ ఇప్పుడు స్మార్టు ఫోన్ ఆ అవసరాన్ని భర్తీ చేసింది. యువతీ యువకుల వద్ద స్మార్టుఫోన్ లేకపోతే అవమానంగా భావిస్తున్నారు. ఇప్పుడు వారికి అవసరమైన పుస్తకాలను సైతం ఆన్లైన్లోనే చూసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు ఎవరైనా బాగా చదువుతున్నాడంటే అతని ఆచూకీ కోసం ముందుగా లైబ్రరీకి వెళ్లేవారు. ఇప్పుడు తలవంచుకుని స్మార్టు ఫోన్‌వైపు చూస్తున్నారు. చిన్నపిల్లలకు ఎదైనా ఇంగ్లీష్ పదం అర్థం కాకపోతే డిక్షనరీలో వెతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంటనే మొబైల్ డిక్షనరీ చూసుకుంటున్నారు. వాచీలు కొనేవారే లేరు ఐదేళ్ల క్రితం వాచీలు కొనేవారితో షాపులు కిటకిటలాడేవి. రాను రాను విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. పెద్ద వయసు ఉన్న వారు కొంత మంది మాత్రమే వాచీలను కొనుగోలు చేస్తున్నారు. యువత మాత్రం వాచీలు కొనడం లేదు. – సుంకర వెంకటేశ్వరరావు, వాచీ షాపు యజమాని గ్రీటింగ్ కార్డులకీ తగ్గిన ఆదరణ.. గతంలో నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, పుట్టిన రోజులకి పలు రకాల గ్రీటింగ్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేవారు. కానీ రాను రాను స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో గ్రీటింగ్ కార్డ్‌కు పూర్తిగా ఆదరణ తగ్గింది. నూతన సంవత్సరం వస్తోందంటే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల గ్రీటింగ్ షాపులు ఏర్పాటు చేసి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం వాట్సప్, హైక్, టెలిగ్రాం వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను ఉపయోగించుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆటలకు దూరమవుతున్నచిన్నారులు.. గతంలో చిన్నపిల్లలు రోజంతా స్నేహితులతో కలసి ఉల్లాసంగా ఆటలాడుకునే వారు. ఈ ఆటలతో వారికి శారీరక వ్యాయామంలా మారి ఆరోగ్యకరంగా ఉండేవారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు ఆటలకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఒక మూలన కూర్చుని గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. పెద్దవారు ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఇప్పుడు పక్కన ఎవరున్నారన్న విషయం గుర్తించక స్మార్ట్‌ఫోన్ యాప్‌లతో గడిపేస్తున్నారు. -
10 వేల ఏళ్లు పనిచేసే గడియారం..
ఆదిత్య 369 సినిమాలో కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే టైమ్ మిషన్‌ని చూసి ఆశ్చర్యపోయాం. రీసెంట్గా 24 సినిమా కూడా కాలానికి సంబంధించిన అంశాలతోనే తెరకెక్కింది. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అటువంటి అద్భుతాన్ని చూసే అవకాశం కల్పిస్తామంటోంది కాలిఫోర్నియాకు చెందిన లాంగ్ నౌ ఫౌండేషన్. కానీ వీరు రూపొందించే గడియారం కాలాన్ని వెనక్కి తీసుకెళ్లదు గానీ 10 వేల ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 150 మీటర్ల పొడవుండే ఈ గడియారాన్ని వెస్ట్ టెక్సాస్‌లోని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఆలోచనకు 1995లోనే బీజం పడింది. అమెరికాకు చెందిన ఆవిష్కర్త డానీ హిల్స్ ఒక ప్రత్యేకమైన గడియారాన్ని తయారు చేయాలని భావించారు. మామూలు గడియారాల్లా దీనిలో గంటలు, నిమిషాల ముళ్లు ఉండవు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ‘టిక్’మని శబ్దం చేస్తుంది. అందులో ఉన్న ‘హ్యాండ్’ ఒక శతాబ్దం తర్వాత కదులుతుంది. ప్రతీ వెయ్యేళ్లకు ఒకసారి గడియారంలో కోకిల బయటకు వచ్చి శబ్దం చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఈ గడియార నిర్మాణం కోసం తన వంతుగా 42 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కేవలం ఖర్చులకే పరిమితం కాకుండా దాని రూపకల్పనలోనూ భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటికే పాక్షికంగా రూపొందించిన ఈ గడియార నిర్మాణంలో మెరైన్ గ్రేడ్ 316 రకానికి చెందిన స్టెయిన్లెస్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. వేల ఏళ్ల పాటు నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి భాగాలకు తుప్పు పట్టకుండా ఉండేందుకు హైటెక్ సిరామిక్ పూతను పూస్తున్నారు. సాధారణంగా గడియారం తిరగడంలో కీలకపాత్ర పోషించే బేరింగ్స్ ఈ క్లాక్‌లో మాత్రం కొద్ది వేగంతోనే తిరుగుతాయి. పవర్ అవర్స్ ఎన్నో ప్రత్యేకతలున్న ఈ గడియారంపైన అమర్చిన మెటల్ రాడ్స్ సాయంతో ఉష్ణోగ్రతలోని మార్పుల ఆధారంగా శక్తిని ఉత్పత్తి చేసుకొని లోపలి భాగాలకు అందిస్తుంది. అయితే, గడియారం సరైన సమయం సూచించాలంటే ప్రతి రోజూ మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి మ్యాన్యువల్‌గా దాన్ని తిప్పాల్సివుంటుంది. లాంగ్ నౌ ఫౌండేషన్ డైరెక్టర్, మ్యూజీషియన్ బ్రేన్ ఈనో మాట్లాడుతూ... 10 వేల ఏళ్ల పాటు పని చేయనున్న ఈ గడియారానికి సంబంధించిన గంట శబ్దం రొటీన్‌గా కాకుండా భిన్న రకాల మెలొడీలను ట్యూన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి గడియారానికి సంబంధించిన నమూనాను మాత్రమే రూపొందించి, లండన్ సైన్స్ మ్యూజియంలో ఉంచారు. ప్రత్యక్షంగా ఈ అద్భుత గడియారాన్ని మరి కొన్నేళ్లు నిరీక్షించక తప్పదు. Installation has begun—500 ft tall, all mechanical, powered by day/night thermal cycles, synchronized at solar noon, a symbol for long-term thinking—the #10000YearClock is coming together thx to the genius of Danny Hillis, Zander Rose & the whole Clock team! Enjoy the video. pic.twitter.com/FYIyaUIbdJ — Jeff Bezos (@JeffBezos) February 20, 2018 -
10,000 ఏళ్ల భారీ గడియారం
వాషింగ్టన్ : ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోస్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్ లాంగ్ నౌ) రూపొందిస్తున్నట్లు బిజోస్ తెలిపారు. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్ ఆధారంగా శక్తి చేకూరుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు. ‘ఇది ప్రత్యేకమైన గడియారం. దీర్ఘకాలిక ఆలోచనకు గుర్తుగా, చిహ్నంగా దీన్ని రూపొందిస్తున్నాం’అని బిజోస్ తెలిపారు. ఈ గడియారం నిర్మాణానికి సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రత్యేకత ఏంటి అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్ బిజోస్ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చింది. అమెరికాలోని టెక్సాస్ కొండల్లో రూ.272.20 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్ పద్ధతిలో, ఐదు అంకెల రూపంలో తెలుపుతుంది. అంటే 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుంది. ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి 1,000 ఏళ్లకు ఓసారి కూకూ(పక్షిలాంటి నిర్మాణం) బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా రూపొందించడంతో ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 సంవత్సరాల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. అయితే ఓసారి మోగిన గంట స్వరం వచ్చే 10 వేల ఏళ్లలో ఎన్నడూ పునరుక్తి కాకుండా దీని రూపకర్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకు రూపొందిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్, సహజవనరుల విచ్చలవిడి వాడకంతో భవిష్యత్ తరాలపై మనవల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరించేందుకు, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందు వీలుగా ఈ గడియారాన్ని బిజోస్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు 10,000 ఏళ్లలోపే అంతమైన నేపథ్యంలో ఈ గడియారంలో జీవితకాలాన్ని 10 వేల ఏళ్లుగా నిర్ణయించారు. అయితే టెక్సాస్‌లోని ఈ భారీ గడియారం దగ్గరకు చేరుకోవాలంటే మాత్రం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సమీపంలోని విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే కొన్ని గంటల పాటు కారులో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక దాదాపు రెండు వేల అడుగులు కొండపైకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. చివరికి భారీ స్టీల్ తలుపులు దాటుకుని వెళ్తే ఈ భారీ గడియారాన్ని చూడొచ్చు. -
యుగాంతానికి 2 నిమిషాలే!
వాషింగ్టన్: ప్రపంచ వినాశనం అత్యంత దగ్గరపడుతోందనడానికి సూచికగా డూమ్స్‌డే క్లాక్‌లో నిమిషాల ముల్లును మరో 30 సెకన్లు ముందుకు జరిపారు. ప్రస్తుతం డూమ్స్ డే క్లాక్‌లో సమయం రాత్రి 11.58 గంటలు. అంటే డూమ్స్ డే గడియారం ప్రకారం వినాశనానికి (12 గంటల సమయాన్ని వినాశనానికి గుర్తుగా భావిస్తారు) మనం రెండే నిమిషాల దూరంలో ఉన్నామన్నమాట. డూమ్స్ డే గడియారం ఎవరు నిర్వహిస్తారు, వినాశనానికి ఎంత దూరంలో ఉన్నామనేవి ఆసక్తికరంగా మారాయి. 1947లో ఏర్పాటు... మానవాళి తన మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి చేజేతులా ఎంత దగ్గరగా వెళుతోందో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిందే ఈ డూమ్స్‌డే గడియారం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటిసారిæ అణ్వాయుధాలను తయారుచేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికా సైంటిస్టులు 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే జర్నల్ను ప్రారంభించారు. ఈ జర్నల్ను శాస్త్రవేత్తలే నిర్వహిస్తున్నారు. వారే 1947లో తొలిసారిగా డూమ్స్ డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి 12 అంటే వినాశనమే గడియారంలో సమయం అర్ధరాత్రి 12 గంటలు అయ్యిందంటే ప్రపంచం అంతమైపోయినట్లే లెక్క. దీనిలో సమయం అర్ధరాత్రి 12కు ఎంత దగ్గరగా ఉంటే ప్రపంచం అంత ప్రమాదంలో ఉందని అర్థం. ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చారు. అంటే నాడు ప్రపంచం వినాశనానికి 17 నిమిషాల దూరంలో ఉందని అర్థం. రెండోసారి రెండు నిమిషాల వ్యవధి ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్ యూనియన్లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు. అంటే వినాశనానికి రెండు నిమిషాల దూరంలో ప్రపంచం ఉందని అర్థం. మళ్లీ ఈ ఏడాది, ఈ నెలలోనే దీనిని 11.58కి మార్చారు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి రేకెత్తుతున్న ఆందోళనలపై ప్రపంచ దేశాల అధినేతలు సరైన విధంగా స్పందించడం లేదంటూ ఈ నెలలో సమయాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు. గడియారంలో ముఖ్య ఘట్టాలు ► 1947లో ఏర్పాటు చేసినప్పుడు సమయం రాత్రి 11:53. అంటే వినాశనానికి ఏడు నిమిషాల దూరం. ► 1949లో సోవియట్ యూనియన్ తొలి అణుపరీక్ష. సమయం 4 నిమిషాల ముందుకు. అంటే 11:57 ► 1953లో అమెరికా తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష. మరో నిమిషం ముందుకు. అంటే 11:58. ► 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో 14 నిమిషాలు వెనక్కు జరిపారు. అంటే11:43గా మార్చారు. ► 1998లో భారత్, పాక్‌లు అణ్వాయుధాలను పరీక్షించడంతో ఎనిమిది నిమిషాలు ముందుకు జరిపారు. అంటే 11:51 ► 2016– తీవ్రమైన వాతావరణ మార్పులు, భారీ అణ్వాయుధ పరీక్షలు. 2 నిమిషాలు ముందుకు–11:57 ► 2017– అణ్వాయుధాల ఆధునికీకరణ, వాతావరణ మార్పులతో సమయం 30 సెకన్లు ముందుకు–11:57:30 -
మూగబోనున్న ‘బిగ్‌బెన్’
లండన్: ప్రపంచప్రఖ్యాత బిగ్ బెన్ గడియారం మరో వారం రోజుల్లో మూగబోనుంది. మరమ్మతుల కోసం ఈ గడియారాన్ని తాత్కాలికంగా ఆపేయనున్నారు. వచ్చే సోమవారం నుంచి బిగ్ బెన్ టిక్‌టిక్ ఆగనుంది. 157 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ గడియారం సాంకేతిక లోపంతో 2007లో నిలిచిపోయింది. అంతకుముందు 1983-1985 కాలంలో స్వల్ప మరమ్మత్తుల కోసం దీన్ని ఆపారు. సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ఎలిజబెత్ టవర్‌పై ఈ గడియారం ఉంది. దాదాపు 13.7టన్నుల బరువైన బిగ్ బెన్ మరమ్మత్తుల అనంతరం 2021 నుంచి పని చేయటం ప్రారంభిస్తుంది. దీనికి అవసరమైన పరికరాలను మార్చటంతో పాటు టవర్‌కు లిఫ్ట్, గడియారానికి పక్కన టాయిలెట్, కిచెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే, కొత్త సంవత్సరం తదితర ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం బిగ్‌బెన్ గంటలు మోగిస్తుందని అధికారులు తెలిపారు. లండన్ మొత్తమ్మీద ఎలిజబెత్ టవర్ వద్దనే అత్యధిక సంఖ్యలో జనం ఫొటోలు తీసుకుంటుంటారు. 1859లో ఇయాన్ వెస్ట్వర్త్ అనే నిపుణుడు ఈ గడియారాన్ని రూపొందించారు. నాలుగు ముఖాలు కలిగిన, అత్యంత కచ్చితమైన సమయం చూపించే ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఇదే. -
లారీల గడియారం!
టైమెంత? ఊహూ.. మీ వాచీలకేసి చూడకండి. ఫొటో చూసే చెప్పేయవచ్చు. 11 గంటల 2 నిమిషాల 15 సెకన్లు. అయితే ఏంటి అంటారా? ఈ గడియారంలో గంటలు, నిమిషాలు, సెకన్ల ముల్లుల్లా కనిపిస్తున్నాయే... అవన్నీ ముల్లులు కాదు. పెద్దపెద్ద లారీలు. కచ్చితంగా చెప్పాలంటే మొత్తం 14 లారీలున్నాయి. స్వీడన్‌కు చెందిన ట్రక్ తయారీ సంస్థ స్కానియా తమ ఉత్పత్తుల నాణ్యతకు నిదర్శనంగా ఈ ఫీట్‌ను నిర్వహించింది. ఇందులో గొప్పేముంది.. అనుకుంటే చూడండి... గత వారం దాదాపు 70 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో కంపెనీ ఈ ‘గడియారం ఫీట్’ చేసింది. మొత్తం 90 మంది డ్రైవర్లు ఇందులో పాల్గొన్నారు. 24 గంటలపాటు ఈ లారీలు గడియారం ఆకారంలో తిరిగాయి. నిమిషాల ముల్లులో మధ్యలో ఉన్న లారీ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తిరిగితే... చివరన ఉన్నది కచ్చితంగా గంటకు 53 కిలోమీటర్ల వేగంతో రోజంతా తిరిగిందన్నమాట. వావ్! -
గో మూత్రంతో తిరిగే గడియారం
ఉంగుటూరు : గడియారం తిరగడానికి బ్యాటరీ అవసరం లేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాల నిర్వాహకులు. రెండు లీటర్ల గోమూత్రంతో గడియారం తిరిగేలా చేయవచ్చని నిరూపించారు. గోశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ విధానాన్ని ప్రదర్శించారు. గడియారాన్ని పనిచేయించే విధానం ఇలా.. రెండు ప్లాస్టిక్ డబ్బాల్లో లీటరు చొప్పున గోమూత్రం నింపాలి. రెండు జింక్ ప్లేట్లు, రెండు కాపర్ ప్లేట్లను తీసుకోవాలి. రెండు జింక్ ప్లేట్లకు విద్యుత్ వైరు అమర్చి గో మూత్రం ఉన్న ఒక డబ్బాలో వేయాలి. ఇది మైనస్‌గా పనిచేస్తుంది. గో మూత్రం ఉన్న మరో డబ్బాలో వైరు అమర్చిన రెండు కాపర్ ప్లేట్లు ఉంచాలి. ఇది ప్లస్‌గా పనిచేస్తుంది. ఈ రెండు వైర్లను బ్యాటరీ పరిమాణంలో ఉండే పుల్లముక్కకు రెండు వైపులా అమర్చి, ఆ పుల్లముక్కను గడియారంలో ఉండే బ్యాటరీ స్థానంలో అమర్చితే గడియారం పనిచేస్తుంది. డబ్బాల్లో ఒకసారి పోసిన ఆవు మూత్రంతో గడియారం 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఆ తరువాత ప్రతి 14 రోజులకు ఒకసారి డబ్బాల్లోని గో మూత్రం మారిస్తే సరిపోతుంది. వివరాలకు 99487 96638 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఆ 'బాంబ్' వాచ్ తిరిగొచ్చేసింది!
వాషింగ్టన్: మొత్తానికి అహ్మద్ మహమద్ చేతికి ఆ 'వాచ్' తిరిగొచ్చేసింది. 'బాంబ్' వాచ్‌గా పొరపడి.. 14 ఏళ్ల అహ్మద్ మహమద్ను సంకెళ్లలో నిలబెట్టిన వాచ్.. అతడి ఆవిష్కరణను మెచ్చి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తిన 'వాచ్'.. ఎట్టకేలకు తన చేతుల్లోకి చేరింది. 'ఎట్టకేలకు నా వాచ్ నాకు దక్కిందోచ్' అంటూ అమెరికా ముస్లిం బాలుడు అహ్మద్ మహమద్ ట్వీట్ చేశాడు. అతడు గత నెలలో తాను సొంతంగా తయారుచేసిన 'వాచ్'ను పాఠశాలకు తీసుకురావడం.. దానిని 'బాంబ్'గా పొరపడి స్కూలు యాజమాన్యం ఆ బాలుడి చేతికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నిలుపడం తీవ్ర కలకలం సృష్టించింది. తన ఆవిష్కరణను స్కూలకు తీసుకొచ్చి.. ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను ఆశ్చర్యపరచాలని అహ్మద్ భావిస్తే.. అమెరికాలో ఉన్న 'ఇస్లామోఫొబియా'తో అతన్నో ఉగ్రవాదిగా చూసి.. ఆ 'వాచ్' లాక్కొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రికి రాత్రే.. అహ్మద్ ఘటన ఇంటర్నెట్లో సంచలనం అయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బాలుడికి సంఘీభావం ప్రకటించారు. అతడి ఆవిష్కరణను మెచ్చుకుంటూ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆ వాచ్‌ను తీసుకొస్తావా? అని అడిగారు. అహ్మద్‌కి ఫేస్బుక్, గూగుల్, ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే అతడు న్యూయార్క్, సుడాన్, ఖతార్, మక్కాలో పర్యటించాడు. గతవారం కొందరు విద్యార్థులతో కలిసి అధ్యక్షుడు ఒబామను కలిశాడు. ఈ సందర్భంగా ఒబామాతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్వీట్ చేశాడు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉండే అహ్మద్ మహమద్ ప్రవాసి సుడాన్‌కు చెందిన వ్యక్తి కొడుకు. ప్రపంచవ్యాప్తంగా అహ్మద్‌కు వెల్లువెత్తున్న మద్దతుతో సంతోషపడుతున్న తల్లిదండ్రులు.. అతని చదువును ఖతార్‌లో కొనసాగించాలని భావిస్తున్నారు. అతని పాఠశాల విద్య, అండర్ గ్రాడ్యుయేషన్‌కు పూర్తి స్కాలర్షిప్ అందించేందుకు ఖతార్ ముందుకొచ్చింది. అతన్ని ఖతార్ ఫౌండేషన్‌కు చెందిన యంగ్ ఇన్నోవేటర్స్ కార్యక్రమానికి ఎంపిక చేసింది. -
వాచ్.. వాస్తవాలు...
ప్రస్తుత బిజీ ప్రపంచంలో గడియారం లేకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం. మనకు క్రమశిక్షణ, కచ్చితత్వం నేర్పించేది గడియారమే. అందుకే గాంధీ గారికి ఇష్టమైన వస్తువుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండేది. నిజానికి గడియారాన్ని కనిపెట్టక ముందు నుంచీ సమయాన్ని తెలుసుకోవడానికి మన పూర్వీకులు ఎంతో శ్రమించారు. ప్రాచీన మానవులు సన్ డయల్, క్యాండిల్ వాచ్ లాంటి పరికరాలతో సమయాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే వాచ్‌ల రాకతో కచ్చితత్వం పెరిగింది. కొన్ని నిజాలు: * సమయాన్ని తెలుసుకోవడాన్ని ఈజిప్షియన్లు ప్రారంభించారనడానికి ఆధారాలున్నాయి. పగటిపూట మాత్రమే పనిచేసే ‘సన్ డయల్’ సహాయంతో వీరు సమయాన్ని లెక్కగట్టేవారట! * ట్యూడర్ రాజుల కాలంలో జేబు గడియారాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి నాలుగో హెన్రీ చక్రవర్తి కాలంలో గడియారాలు చాలా పెద్దవిగా ఉండేవట. ఎంతలా అంటే ప్రజలు వాటిని మెడలో వేలాడదీసుకునేంత! * మొట్టమొదటి చేతిగడియారాన్ని 1868లో పాటిక్ ఫిలిప్పీ అనే వ్యక్తి తయారుచేశాడు. * మొదటి ప్రపంచయుద్ధం వరకూ చేతిగడియారాలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటివరకూ ఆడవారి ఆభరణాల్లో ఒకటిగా దీన్ని భావించారు. అయితే ఈ యుద్ధంలో గడియారాలను మెడకు ధరించడానికి బదులుగా చేతికి ధరించాల్సిరావడంతో వీటికి ఎనలేని పాపులారిటీ వచ్చేసింది. * డిజిటల్ వాచ్‌లను ప్రపంచానికి అందించిన ఘనత దిమిత్రోఫ్ పెట్రోఫ్కు దక్కుతుంది. ఈయన నాసాలో ఇంజినీర్‌గా పనిచేశారు. * మెకానికల్ వాచ్‌లు క్వార్జ్ వాచ్‌లతో పోల్చితే అంత మెరుగైన పనితీరు చూపించవట. క్వార్జ్ వాచ్‌లను తొలిసారిగా 1969లో ప్రవేశపెట్టారు. * షాపుల్లో అమ్మకానికి పెట్టే గడియారం ఎప్పుడూ 10 గం. 10 నిమిషాలనే సూచిస్తుంది. దీని ఉద్దేశం వినియోగదారుణ్ని ఆకర్షించడమే. ఈ సమయం దగ్గర గడియారం నవ్వు ముఖం పెట్టినట్టుగా కనిపిస్తుందట. దీంతో కష్టమర్లు దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తారనేది వ్యాపారుల భావన! * ఎలాంటి పరిస్థితుల్లోనైనా కచ్చితమైన సమయాన్ని చూపించే వాచ్‌గా ‘రోలెక్స్’కు పేరుంది. 1953లో తొలిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ ఈ వాచీనే ధరించాడట. 1960లో యూఎస్ నేవీ జలాంతర్గామి 35,798 అడుగుల లోతులో ప్రయాణించినప్పుడు కూడా దీన్ని పరీక్షించారట. అయితే ఒక్క సెకను కూడా తేడా లేకుండా ఇది సమయాన్ని చూపించిందని చెబుతారు. -
‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు!
చేతికి గడియారంలా చుట్టుకుని.. అవసరమైనప్పుడు గాల్లోకి ఎగిరి మనను అనుసరిస్తూ మన స్వీయచిత్రాలు(సెల్ఫీలు) తీసే వినూత్న డ్రోన్ ‘నిక్సీ’కి ఇంటెల్ కంపెనీవారి బంపర్ బహుమతి తగిలింది. ఇంటెల్ నిర్వహించిన ‘మేక్ ఇట్ వియరబుల్’ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ డ్రోన్ ఏకంగా రూ.3 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రజల రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే వియరబుల్ టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణకు ఇంటెల్ కంపెనీ ఈ పోటీని నిర్వహించింది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ నిక్సీ క్వాడ్‌కాప్టర్‌తో పాటు రోబోటిక్ చేయి ‘ఓపెన్ బయోనిక్స్’కు ద్వితీయ బహుమతి కింద రూ. 1.22 కోట్లు, ఉత్పత్తిరంగంలో కార్మికులకు రోజువారీ పనిలో ఉపయోగపడే ‘ప్రోగ్లోవ్’కు తృతీయ బహుమతి కింద రూ.61 లక్షల నగదు దక్కింది.