‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు! | 3 million award to Selphy drone | Sakshi
Sakshi News home page

‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు!

Published Wed, Nov 5 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు!

‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు!

చేతికి గడియారంలా చుట్టుకుని.. అవసరమైనప్పుడు గాల్లోకి ఎగిరి మనను అనుసరిస్తూ మన స్వీయచిత్రాలు(సెల్ఫీలు) తీసే వినూత్న డ్రోన్ ‘నిక్సీ’కి ఇంటెల్ కంపెనీవారి బంపర్ బహుమతి తగిలింది. ఇంటెల్ నిర్వహించిన ‘మేక్ ఇట్ వియరబుల్’ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ డ్రోన్ ఏకంగా రూ.3 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది.

ప్రజల రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే వియరబుల్ టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణకు ఇంటెల్ కంపెనీ ఈ పోటీని నిర్వహించింది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ నిక్సీ క్వాడ్‌కాప్టర్‌తో పాటు రోబోటిక్ చేయి ‘ఓపెన్ బయోనిక్స్’కు ద్వితీయ బహుమతి కింద రూ. 1.22 కోట్లు, ఉత్పత్తిరంగంలో కార్మికులకు రోజువారీ పనిలో ఉపయోగపడే ‘ప్రోగ్లోవ్’కు తృతీయ బహుమతి కింద రూ.61 లక్షల నగదు దక్కింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement