‘సెల్ఫీ’ డ్రోన్‌కు 3 కోట్ల అవార్డు!
చేతికి గడియారంలా చుట్టుకుని.. అవసరమైనప్పుడు గాల్లోకి ఎగిరి మనను అనుసరిస్తూ మన స్వీయచిత్రాలు(సెల్ఫీలు) తీసే వినూత్న డ్రోన్ ‘నిక్సీ’కి ఇంటెల్ కంపెనీవారి బంపర్ బహుమతి తగిలింది. ఇంటెల్ నిర్వహించిన ‘మేక్ ఇట్ వియరబుల్’ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ డ్రోన్ ఏకంగా రూ.3 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది.
ప్రజల రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే వియరబుల్ టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణకు ఇంటెల్ కంపెనీ ఈ పోటీని నిర్వహించింది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ నిక్సీ క్వాడ్‌కాప్టర్‌తో పాటు రోబోటిక్ చేయి ‘ఓపెన్ బయోనిక్స్’కు ద్వితీయ బహుమతి కింద రూ. 1.22 కోట్లు, ఉత్పత్తిరంగంలో కార్మికులకు రోజువారీ పనిలో ఉపయోగపడే ‘ప్రోగ్లోవ్’కు తృతీయ బహుమతి కింద రూ.61 లక్షల నగదు దక్కింది.