గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?  | Asapscience YouTuber Explains Why First Tick Takes Longer When You Stare at Clock | Sakshi
Sakshi News home page

గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు? 

Published Mon, Jul 25 2022 4:57 AM | Last Updated on Mon, Jul 25 2022 4:57 AM

Asapscience YouTuber Explains Why First Tick Takes Longer When You Stare at Clock - Sakshi

ఎప్పుడైనా మీరు చేతి వాచీ వైపో, గోడ గడియారంవైపో తదేకంగా చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు మొదట మెల్లగా కదిలి, తర్వాత స్పీడెత్తుకోవడం గమనించారా? ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదంటారా? పోనీ ఇప్పుడు ట్రై చేస్తారా?.. డిజిటల్‌వి కాకుండా ముళ్లుండే గడియారంవైపు చూసినప్పుడు.. అందులో సెకన్ల ముల్లు తొలి సెకన్‌ పాటు మెల్లగా కదిలినట్టు అనిపిస్తుంది. తర్వాతి సెకన్‌ నుంచి మామూలుగానే ముందుకెళ్తుంది. కాస్త గ్యాప్‌తో ఎన్నిసార్లు మార్చి మార్చి చూసినా దాదాపు ఇలాగే అనిపిస్తుంటుంది. యూట్యూబ్‌లో అసాప్‌సైన్స్‌ అనే చానల్‌ నడిపే సైన్స్‌ నిపుణుడు దీనికి కారణాలను వివరించారు. 

మెదడు ప్రాసెస్‌ చేసే తీరు వల్లే..
గడియారాన్ని చూసినప్పుడు మొదటి సెకన్‌ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించడం వెనుక సైంటిఫిక్‌ కారణాలు ఉన్నాయి. సాధారణంగా మన కళ్లు రెండు రకాలుగా కదులుతుంటాయి.ఒకటి స్మూత్‌ పర్సూ్యట్, రెండోది సెక్కాడ్‌. 

స్మూత్‌ పర్సూ్యట్‌ విధానంలో కళ్లు చాలా మెల్లగా కదులుతూ గమనిస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాస్త దూరంలో కారో, బైకో కదులుతూ ఉంటే.. కళ్లు దానికి అనుగుణంగా కదులుతూ చూస్తుంటాయి. ఈ విధానంలో కంటి నుంచి అందిన సమాచారాన్ని మెదడు వెంటవెంటనే ప్రాసెస్‌ చేస్తుంటుంది. మనం గడియారంలోకి చూసినప్పుడు.. రెండో సెకన్‌ నుంచి సెకన్ల ముల్లు అలా కదులుతూ ఉండటాన్ని గమనించడం కూడా ‘పర్సూ్యట్‌’ కిందకే వస్తుంది. 

సెక్కాడ్‌ విధానం అంటే.. ఏదైనా ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా, వెంటనే దృష్టి మళ్లించడం. ఇలా చేసినప్పుడు తొలుత చూస్తున్న దృశ్యం, చివరిగా దృష్టిని ఆపిన దృశ్యం మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. మధ్యలో ఉన్నదంతా చూచాయగానే అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు దూరంగా ఉన్న ఏదైనా భవనాన్ని చూస్తున్నారు. పక్కన ఏదో చప్పుడైతే ఒక్కసారిగా అటువైపు చూశారనుకోండి. ఆ భవనానికి, ఈ చప్పుడు వచ్చిన చోటికి మధ్య దృశ్యాలేవీ పెద్దగా ఆనవు. కంటి నుంచి అందే సమాచారాన్ని మెదడు అంత వేగంగా, వెంటనే ప్రాసెస్‌ చేయలేకపోవడమే దీనికి కారణం. 

మనం గడియారం వైపు చూసినప్పుడు తొలి దృష్టి సెక్కాడ్‌ మోడ్‌లోనే ఉంటుంది. అప్పటికే కదులుతూ ఉన్న ముల్లు ఆగి, మళ్లీ కదులుతున్న సమయంలో.. మెదడు ఆ దృశ్యాన్ని ప్రాసెస్‌ చేయడానికి సమయం తీసుకుంటుంది. అంతకుముందు చూస్తూ ఉన్న దృశ్యం నుంచి గడియారం వైపు దృష్టిని మరల్చిన సమయాన్ని కూడా కలిపేస్తుంది. దీనితో తొలి సెకన్‌ గడిచేందుకు ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే మన దృష్టి స్మూత్‌ పర్సూ్యట్‌లోకి వచ్చేస్తుంది కాబట్టి.. మిగతా సెకన్లు మామూలుగానే గడిచిపోతుంటాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement