Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది!  | Hyderabad: Historic Clock at Makkah Masjid Now Working After Repaired | Sakshi
Sakshi News home page

Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! 

Published Wed, Feb 15 2023 8:23 AM | Last Updated on Wed, Feb 15 2023 10:08 AM

Hyderabad: Historic Clock at Makkah Masjid Now Working After Repaired - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత గోడ గడియారాల్లో అదొకటి. దీనికి ఒకటిన్నర శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. అప్పట్లో ఫేవ్రే– ల్యూబా కంపెనీ ఈ గడియారాన్ని తయారు చేసింది. అలాంటి ఈ గోడ గడియారం ఎనిమిదేళ్లుగా మూగబోయింది. నగరంలోని మక్కా మసీదు గడియారం ముల్లు ఎట్టకేలకు మళ్లీ కదిలింది. 1850లో అప్పటి 4వ నిజాం నవాబ్‌ నాసిర్‌–ఉద్‌–దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్‌ నుంచి తెప్పించారు.

అప్పటినుంచి నిరాటంకంగా పని చేసిన ఈ లోలకం ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయింది. ఈ గడియారాన్ని వాహెద్‌ వాచ్‌ కంపెనీ మరమ్మతు చేయడంతో మళ్లీ గంట కొట్టడం మొదలైంది. నిజాం సామ్రాజ్యం అంతరించిన అనంతరం ఈ గడియారం నిర్వహణ వాహెద్, భారత్‌ వాచ్‌ కంపెనీలు సంయుక్తంగా చూశాయి. 2015లో ఈ వాచ్‌ నిలిచిపోవడంతో అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టిన ఈ సంస్థలు.. ఎట్టకేలకు దాన్ని పునరుద్ధరించగలిగాయి.  
చదవండి: Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement