repaired
-
Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత గోడ గడియారాల్లో అదొకటి. దీనికి ఒకటిన్నర శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. అప్పట్లో ఫేవ్రే– ల్యూబా కంపెనీ ఈ గడియారాన్ని తయారు చేసింది. అలాంటి ఈ గోడ గడియారం ఎనిమిదేళ్లుగా మూగబోయింది. నగరంలోని మక్కా మసీదు గడియారం ముల్లు ఎట్టకేలకు మళ్లీ కదిలింది. 1850లో అప్పటి 4వ నిజాం నవాబ్ నాసిర్–ఉద్–దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అప్పటినుంచి నిరాటంకంగా పని చేసిన ఈ లోలకం ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయింది. ఈ గడియారాన్ని వాహెద్ వాచ్ కంపెనీ మరమ్మతు చేయడంతో మళ్లీ గంట కొట్టడం మొదలైంది. నిజాం సామ్రాజ్యం అంతరించిన అనంతరం ఈ గడియారం నిర్వహణ వాహెద్, భారత్ వాచ్ కంపెనీలు సంయుక్తంగా చూశాయి. 2015లో ఈ వాచ్ నిలిచిపోవడంతో అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టిన ఈ సంస్థలు.. ఎట్టకేలకు దాన్ని పునరుద్ధరించగలిగాయి. చదవండి: Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ -
గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే..
ముంబై: గేదెలు ఢీకొట్టిన ప్రమాదంలో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు బాగుచేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే రైలుకు మరమత్తులు నిర్వహించారు. దెబ్బతిన్న రైలు ముందు భాగంలోని మెటల్ ప్లేట్‌ను ముంబై సెంట్రల్‌లోని కోచ్ కేర్ సెంటర్లో మార్చారు. దీనిని ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్ఆర్పీ)తో తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. కాగా ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం అహ్మదాబాద్ సమీపంలో పట్టాలపై వెళ్తుండగా గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోయినా రైలు ముందు భాగం ధ్వంసమైంది. ఏకంగా ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 100 కి.మీ. వేగంతో ఉంది. అయితే రైలు ప్యానెల్ లేకుండానే గాంధీనగర్ స్టేషన్, తిరిగి ముంబై సెంట్రల్‌కు సకాలంలో ప్రయాణించింది. గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. అయితే రైలు ప్రమాదానికి గురికావడంతో విపక్షాలు మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రారంభించిన 6 రోజుల్లోనే బర్రెలు ఢీకొడితేనే రైలు పార్టులు ఊడిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు -
బస్సుకు బాదైంది! చికిత్సకు వేళైంది
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుకు పెద్ద కష్టం వచి్చంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఆర్టీసీ కారి్మకుల సమ్మెతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం మెకానిక్‌లను నియమించకపోవడంతో ఆర్టీసీ సిటీ బస్సుల బతుకు గ్యారేజీ అయింది. ప్రైవేట్ డ్రైవర్లు బస్సులను ఇష్టానుసారంగా నడపడం.. వాటి బాగోగులు పట్టించుకోకపోవడంతో సమ్మె విరమించాక చూస్తే సగానికి పైగా బస్సులు పాడైపోయి రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది. కొన్నింటికి టైర్లు దెబ్బతిన్నాయి. విడిభాగాలు ఊడిపోయాయి. కొన్నింటిలో గ్రీజ్, ఇంజిన్ ఆయిల్ లేకుండా పోయింది. కారి్మకులు విధులకు హాజరైనాదెబ్బతిన్న బస్సులు రోడ్డెక్కించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌లోని 29 డిపోల్లో సగం బస్సులకు మరమ్మతులు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు మాత్రం సుమారు 600 బస్సులకు మర్మతులు అవసరమున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అన్ని డిపోల్లో బస్సుల నిర్వహణ నాలుగు దశల్లో ఉంటుంది. మెకానిక్‌లు ప్రతి బస్సుకు రోజువారీ తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల్లో డ్రైవర్ల ఫిర్యాదుల ఆధారంగా చిన్న చిన్న మరమ్మతులు చేస్తారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సుల్లో ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులే ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 3,750 బస్సులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని స్పేర్‌లో ఉంచి ప్రతిరోజు 3500 బస్సులను నడుపుతారు. ఒక్కో డిపోలో కనిష్టంగా 85 నుంచి గరిష్టంగా 130 బస్సుల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని డిపోల్లో 10 బస్సులకు మరమ్మతులు చేపట్టవలసి ఉండగా కొన్ని డిపోల్లో 40 బస్సుల వరకు మరమ్మతులకు గురయ్యాయి. ‘అప్పటికప్పుడు రిపేర్ చేసి పంపించే వాటిని పంపిస్తున్నాం. 10 శాతం మాత్రం విడిభాగాలు లేక గ్యారేజీల్లో ఉన్నాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సమ్మె నేపథ్యంలో బస్సుల స్థితిగతులపైన ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వివిధ డిపోల్లో బస్సుల తీరుపై ప్రత్యేక కథనం. జీడిమెట్లలో 50 శాతం షెడ్డుకే.. జీడిమెట్ల: ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినప్పటికీ జీడిమెట్ల డిపోలో చాలా బస్సులు మొరాయించడంతో రోడ్డెక్కలేదు. డిపోలో మొత్తం 147 బస్సులుండగా శనివారం 70కి పైగా బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం బస్సులు నడపడం కారణమైంది. జీడిమెట్ల డిపోలో మరమ్మతుల విభాగంలో 50 మంది మెకానిక్‌లు విధులు నిర్వహిస్తున్నా స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేక బస్సులు రిపేర్లు సాగడం లేదు. కూకట్‌పల్లిలో 30 శాతానికి పైగా.. మూసాపేట: కూకట్పల్లి ఆర్టీసీ డిపోలో మొత్తం 131 బస్సులుండగా శుక్రవారం 86 బస్సులను మాత్రమే తిప్పారు. అంటే 30 శాతం పైగా బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. శనివారం కొన్ని బస్సులకు రిపేర్లు చేసి పరిశీలించిన అనంతరం 100 బస్సులను తిప్పారు. మిగిలిన 31 బస్సులు గ్యారేజీలోనే ఉన్నాయి. దీంతో బస్సులు లేని డ్రైవర్లు, కండక్టర్లు బస్టాప్‌ల వద్ద ప్రయాణికులను వరుస క్రమంలో ఎక్కించడం, బస్సులను బస్సు బేల్లో నిలిపే పనుల్లో నిమగ్నమయ్యారు. సమ్మెలో కాలంలో తాత్కాలిక డ్రైవర్ల చేసిన చిన్నచిన్న పొరపాట్లతో ఇంజన్ పాడయ్యే సమస్యలు తలెత్తాయి. ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోకపోవటం, వాటర్ లేకపోవటంతో, గ్రీజ్, టైర్లలో గాలి చెక్ చేయకపోవటంతో అవి మేజర్ సమస్యలుగా మారాయి. దీంతో కూకట్పల్లి డిపోలో డిపోలో 78 మంది మెకానిక్‌లు రేయంబవళ్లు బస్సుల మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అవసరమైన విడిభాగాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. చేసేది లేక బాగా పాడైన బస్సులో బాగున్న పార్టులను మరో బస్సుకు బిగించి తాత్కాలిక పనులు చేస్తున్నారు. పికెట్ డిపోలోనే మేజర్.. మారేడుపల్లి: డిపోలో ఉన్న మొత్తం 64 బస్సులను తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడుపుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 280 మంది ఉద్యోగులున్నారు. సమ్మె కాలంలో 40 బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో జిల్లాలకు నడిపారు. సమ్మె కాలంలో 21 బస్సులు ప్రమాదాలకు గురికాగా, ఒక్క బస్సు పూర్తిగా ధ్వంసమవడంతో స్క్రాప్‌కు తరలించారు. వజ్ర బస్సులను నడపకపోవడంతో ఏసీ, బ్యాటరీ తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ఇతర బస్సులతో పాటు వజ్ర బస్సులకు కూడా రిపేర్ చేస్తున్నారు. డిపోలో బస్సుల సంఖ్య: 64 మరమ్మతులకు గురైనవి: 30 తాత్కాలిక డ్రైవర్లు నడిపినవి: 40 వీటిలో పాడైపోయినవి: 20 స్క్రాబ్‌కు తరలించినవి: 1 కంటోన్మెంట్ డిపోలో.. మారేడుపల్లి: ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంతో వారు బస్సులను ఇష్టానుసారంగా నడపారు. దీంతో చాలా బస్సులు ఇప్పుడు షెడ్డుకే పరిమితమయ్యాయి. దీంతో విధుల్లోకి చేరిన ఆర్టీసీ రెగ్యులర్ మెకానిక్‌లు వాటి మరమ్మతు పనుల్లో బిజీ అయ్యారు. కంటోన్మెంట్ డిపోలో మొత్తం 137 బస్సులున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లతో పాటు మొత్తం 857 మంది సిబ్బంది ఉన్నారు. సమ్మె కాలంలో ఈ డిపో నుంచి ప్రతిరోజు 50 బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించారు. సమ్మె విరమణ తర్వాత వాటిని పరిశీలిస్తే.. మొత్తం 50 బస్సుల్లో 20 పూర్తిగా పాడైపోయి గ్యారేజీకే పరిమితమయ్యాయి. దీంతో 99 మంది మెకానిక్‌లు గ్యారేజీలో బస్సుల మరమ్మతు పనుల్లో బిజీ అయ్యారు. కంటోన్మెంట్లో బస్సులు: 137 మరమ్మతుకు గురైనవి: 45 తరచుగా రిపేర్‌కు వస్తున్నవి: 5 తాత్కాలిక డ్రైవర్లు నడిపినవి: 50 వీటిలో మరమ్మతులకు వచి్చనవి: 20 మిధానిలో 60/95 రిపేర్ సంతోష్‌నగర్: మిధాని డిపోలో మొత్తంలో 95 బస్సులుండగా.. వాటిలో 30 బస్సులకు క్లచ్, గేర్ బాక్స్, బ్రేక్, బ్యాటరీ తదితర సమస్యలతో గ్యారేజీలోనే ఉన్నాయి. పూర్తిగా పాడైపోయిన మరో 10 బస్సులను హకీంపేట్ డిపోకు పంపించామని డిపో మేనేజర్ కిషన్ రావు తెలిపారు. డిపోలో మొత్తం బస్సులు: 95 పాడైపోయినవి: 30 ఫిట్నెస్ లేనివి: 20 తరుచూ మరమ్మతులకు గురవుతున్నవి: 10 ఐటీ కారిడార్‌లోనూ అంతే.. రాయదుర్గం/మియాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆర్టీసీ డిపో, మియాపూర్‌లోని డిపో–1,2ల్లో కారి్మకులంతా శనివారం విధుల్లో చేరారు. బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌సీయూ డిపో మొత్తం బస్సులు: 81 నడిచినవి: 75 పాడైనవి: 6 మియాపూర్ డిపో–1 మొత్తం బస్సులు: 129 నడిచినవి: 119 పాడైనవి: 10 తరచూ రిపేర్‌కు వచ్చేవి: 2 మియాపూర్–2 మొత్తం బస్సులు: 139 సమ్మె కాలంలో నడిచినవి: 129 పాడైపోయినవి: 10 తరచూ రిపేర్: 2 సగం బస్సులు షెడ్డులో.. చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా డిపోలో సమ్మె కాలంలో ప్రైవేట్ డ్రైవర్లు నడపడంతో బస్సులు పెద్ద ఎత్తున మరమ్మతులకు గురయ్యాయి. మూడు రోజుల క్రితం మెకానిక్‌లు విధుల్లోకి చేరి అనంతరం బస్సుల మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. పాతకాలం బస్సులు కావడం.. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో బస్సులు చితికిపోయాయని మెకానిక్‌లు వాపోతున్నారు. ఫలక్‌నుమా డిపో మొత్తం బస్సులు: 105 మరమ్మతులకు గురైనవి: 40 ఫిట్నెస్ లేనివి: 30 ఫరూఖ్‌నగర్ డిపో బస్సుల సంఖ్య: 65 మరమ్మతుల్లో ఉన్నవి: 30 ఫిట్నెస్ లేనివి: 20 దిల్సుఖ్నగర్ సిటీ డిపోలో చెతన్యపురి/హయత్‌నగర్: దిల్సుఖ్నగర్ సిటీ డిపోలో 101 బస్సులు, 15 అద్దెవి ఉన్నాయి. కండక్టర్లు 281, డ్రైవర్లు 250 మంది, గ్యారేజ్ విభాగంలో 72 మంది ఉన్నారు. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్ల తీరుతో 30 బస్సులు రిపేర్‌కు వచ్చాయి. మరో రెండురోజుల్లో వీటికి మరమ్మతులు చేసిన రోడ్డెక్కించేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్–2లో ఇలా.. దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్–2 డిపోలో 80 ఆర్టీసీ, 30 అద్దె బస్సు ఉన్నాయి. సమ్మె కాలంలో రెండు బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. కారి్మకులు తిరిగి విధుల్లో చేరటంతో గతంలో తిరిగిన అన్ని రూట్లలో పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నారు. హయత్‌నగర్–1 డిపోలో మొత్తం 142 బస్సుల్లో 24 రిపేరుకు రాగా 12 బస్సులను శుక్రవారం బాగుచేసి పంపారు. హయత్‌నగర్–2 డిపోలో మొత్తం 95 బస్సుల్లో 20 బస్సులు పాడైపోయాయి. కుషాయిగూడ డిపో ఏఎస్‌రావునగర్: కుషాయిగూడ డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. ఇందులో 129 ఆర్టీసీ బస్సులు కాగా 21 అద్దె బస్సులు. 340 మంది డ్రైవర్లు, 304 కండక్టర్లు, 75 మంది మెకానిక్‌లు పనిచేస్తున్నారు. మొత్తం బస్సుల్లో తరచూ 16 బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి. నాలుగు బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. చెంగిచర్ల డిపో బోడుప్పల్: ఈ డిపోలో మొత్తం 127 బస్సులుండగా వాటిలో 121 ఆర్టీసీకి చెందినవి. సమ్మె కాలంలో తిరిగిన బస్సుల్లో 40 పాడైపోయాయి. వీటిలో 30 బస్సులకు శుక్రవారం రిపేర్ చేశారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
కోటగిరి(బాన్సువాడ) : మండలంలోని ఎత్తోండ గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ లైన్‌మన్ షేక్‌హసన్ (39) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తోండకు చెందిన షేక్‌హసన్ ప్రైవేటు కరెంటు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామంలో కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11 కే.వి. విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ ఆనంద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై పర్వేజ్ తెలిపారు. -
హైవేపై నిలిచిపోయిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు
-
బోరుమంటున్నాయ్..
♦ జిల్లాలో 11,664 చేతి పంపులు ♦ ఇందులో పాతిక శాతం కూడా పని చేయని వైనం ♦ మరమ్మతులకు నిధులున్నా పట్టించుకునే వారు కరువు కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో బావులు ఎండిపోయాయి. బోరు బావులు మరమ్మతులకు గురయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు కానీ ఆచరణలో అది వాస్తవం కాదని స్పష్టమవుతోంది. చిన్న చిన్న మరమ్మతులు చేపడితే చాలా చోట్ల ప్రజలకు తాగు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. జిల్లాలో 11,664 చేతి బోర్లు ఉండగా వాటిలో పాతిక శాతం కూడా పని చేయడం లేదు. పదేళ్లుగా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా పైప్లైన్లు వేసి ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఇళ్లలోకే కుళాయిల ద్వారా నేరుగా నీరు వస్తుండటంతో చేతి పంపులకు ఆదరణ కరువైంది. కుళాయిల కంటే చేతి పంపుల నీరే సురక్షితం అని తెలిసినా వీటి గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు. వేసవి తీవ్రత పెరగడంతో ప్రస్తుతం చాలా గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. ఈ స్థితిలో చేతి పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చేతి బోర్ల పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని వాటిని వాడకం లోనికి తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తే నీటి సమస్యను కొంత మేరకు అధిగమించే అవకాశం ఉంది. -
ఈ నీళ్లు తాగుతారా?
సర్దనలో బురద నీరు సరఫరా ఆందోళనకు దిగిన గ్రామస్తులు మెదక్ : తమ గ్రామంలో నల్లాపైపులు లీకేజీలు ఏర్పడి బురదనీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ మెదక్ మండలం సర్దన గ్రామస్తులు పలువురు శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. బురద నీరు తాగమంటారా అని నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప గ్రామంలోని కొత్తకాలనీలో తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్లు పగిలిపోయి నెలరోజులుగా నల్లాలకు ద్వార బురదనీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పగిలిపోయిన నల్లాపైపులకు వెంటనే మరమ్మతులు చేపట్టి పరిశుభ్రమైన నీటిని సరఫరాచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ డీఈ మంజుల స్పందిస్తూ పంచాయతీ కార్యదర్శికి చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంలో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
చిటికెలో రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు
గన్నవరం : మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. రైలు పట్టాలతో పాటు ట్రాక్ మధ్యలో ఉండే స్లీపర్లను మార్చేందుకు అనువుగా ట్రాక్ రెయిలింగ్ మెషిన్‌ను రైల్వేశాఖ వినియోగంలోకి తీసుకొచ్చింది. పూర్తి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఆటోమేటిక్ మెషిన్ అతి తక్కువ వ్యవధిలో రెయిల్స్‌తో పాటు స్లీపర్లను మార్చుతుంది. ఇప్పటి వరకు క్రేన్లు, కూలీలతోఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీని వల్ల సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువవుతోంది. దీనిని అధిగమించేందుకు రైల్వేశాఖ అమెరికాకు చెందిన హార్స్కో సంస్థకు చెందిన పీ-811ఎస్ ట్రాక్ రెయింగ్ మెషన్‌ను కొనుగోలు చేసింది. 1990 నుంచి ట్రాక్ రెయిలింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి ఆటోమేటిక్ సిస్టమ్‌తో పీ-811ఎస్ రూపొందింది. సౌత్ సెంట్రల్ రైల్వేకు కేటాయించిన ఈ మిషన్ ట్రయిల్స్‌ను గన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పనితీరుపై ప్రత్యేక శిక్షణ సుమారు రూ.45 కోట్ల విలువ కలిగిన ఈ మెషన్‌లో 20 వ్యాగన్లతో పాటు హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటాయి. మూడు ఇంజిన్లు ఉండే ఈ యంత్రంలో సహాయక ఇంజినీర్‌తో పాటు 21 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ సిబ్బందికి ఇప్పటికే మెషన్ తయారీ సంస్థ అమెరికాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు నిపుణులు వచ్చి యంత్రం పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. గంటకు 600 స్లీపర్లను మార్చుతుంది ఈ యంత్రం గంటకు 600 స్లీపర్లను మార్చుతుంది. గంటకు 350 నుంచి 375 మీటర్ల వరకు పనిచేస్తుంది. కంప్యూటర్లలో ఫీడ్ చేసిన దూరాన్ని బట్టి పాత స్లీపర్లను తొలగించి, కొత్తవి ఏర్పాటుచేస్తుంది. స్లీపర్లను తొలగించడం, వాటి స్థానంలో వ్యాగన్ల నుంచి కొత్త స్లీపర్లను తీసుకురావడం వంటి ప్రక్రియ హైడ్రాలిక్ సిస్టం ద్వారా జరుగుతుంది. ఈ యంత్రం పట్టాలను కూడా మారుస్తుంది. ప్రస్తుతం చేపట్టిన ట్రయిల్స్ పూర్తయిన తర్వాత ఈ యంత్రంతో సౌత్ సెంట్రల్‌లోని పలు రూట్లలో పాత స్లీపర్లు, ప్యానల్స్ తొల గించి, కొత్తవి ఏర్పాటు చేయనున్నారు.