గన్నవరం : మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. రైలు పట్టాలతో పాటు ట్రాక్ మధ్యలో ఉండే స్లీపర్లను మార్చేందుకు అనువుగా ట్రాక్ రెయిలింగ్ మెషిన్‌ను రైల్వేశాఖ వినియోగంలోకి తీసుకొచ్చింది. పూర్తి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఆటోమేటిక్ మెషిన్ అతి తక్కువ వ్యవధిలో రెయిల్స్‌తో పాటు స్లీపర్లను మార్చుతుంది.
ఇప్పటి వరకు క్రేన్‌లు, కూలీలతోఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీని వల్ల సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువవుతోంది. దీనిని అధిగమించేందుకు రైల్వేశాఖ అమెరికాకు చెందిన హార్స్‌కో సంస్థకు చెందిన పీ-811ఎస్ ట్రాక్ రెయింగ్ మెషన్‌ను కొనుగోలు చేసింది. 1990 నుంచి ట్రాక్ రెయిలింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి ఆటోమేటిక్ సిస్టమ్‌తో పీ-811ఎస్ రూపొందింది. సౌత్ సెంట్రల్ రైల్వేకు కేటాయించిన ఈ మిషన్ ట్రయిల్స్‌ను గన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు.
పనితీరుపై ప్రత్యేక శిక్షణ
సుమారు రూ.45 కోట్ల విలువ కలిగిన ఈ మెషన్‌లో 20 వ్యాగన్లతో పాటు హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటాయి. మూడు ఇంజిన్లు ఉండే ఈ యంత్రంలో సహాయక ఇంజినీర్‌తో పాటు 21 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ సిబ్బందికి ఇప్పటికే మెషన్ తయారీ సంస్థ అమెరికాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు నిపుణులు వచ్చి యంత్రం పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు.
గంటకు 600 స్లీపర్లను మార్చుతుంది
ఈ యంత్రం గంటకు 600 స్లీపర్లను మార్చుతుంది. గంటకు 350 నుంచి 375 మీటర్ల వరకు పనిచేస్తుంది. కంప్యూటర్లలో ఫీడ్ చేసిన దూరాన్ని బట్టి పాత స్లీపర్లను తొలగించి, కొత్తవి ఏర్పాటుచేస్తుంది.
స్లీపర్లను తొలగించడం, వాటి స్థానంలో వ్యాగన్ల నుంచి కొత్త స్లీపర్లను తీసుకురావడం వంటి ప్రక్రియ హైడ్రాలిక్ సిస్టం ద్వారా జరుగుతుంది. ఈ యంత్రం పట్టాలను కూడా మారుస్తుంది. ప్రస్తుతం చేపట్టిన ట్రయిల్స్ పూర్తయిన తర్వాత ఈ యంత్రంతో సౌత్ సెంట్రల్‌లోని పలు రూట్లలో పాత స్లీపర్లు, ప్యానల్స్ తొల గించి, కొత్తవి ఏర్పాటు చేయనున్నారు.
చిటికెలో రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు
Published Sat, Jan 17 2015 6:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM
Advertisement
Advertisement