మృతి చెందిన షేక్‌హసన్
కోటగిరి(బాన్సువాడ) : మండలంలోని ఎత్తోండ గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ లైన్‌మన్ షేక్‌హసన్ (39) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తోండకు చెందిన షేక్‌హసన్ ప్రైవేటు కరెంటు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామంలో కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11 కే.వి. విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ ఆనంద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై పర్వేజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment