Current pole
-
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడి హల్చల్!
ఆదిలాబాద్: మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవీణ్ ఇంటి గొడవల కారణంగా సోమవారం స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విద్యుత్ తీగలను పట్టుకుంటానని అనడంతో స్థానికులు సరఫరా నిలిపివేయించారు. ఎంత నచ్చజెప్పినా దిగిరాక తీగలు పట్టుకుని వేలాడారు. ఆ తర్వాత స్తంభం నుంచి జారి కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సదరు యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీçÜులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
నిశ్చితార్థం రోజునే విద్యుత్ స్తంభంపై శవమై
జోగిపేట(అందోల్): నిశ్చితార్థం జరగాల్సిన రోజునే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆదివారం ఉదయం విధులకు వెళ్లిన ఆ యువకుడు డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లాల్సిన వ్యక్తి విద్యుత్ స్తంభంపై నిర్జీవంగా వేలాడుతూ కన్పించాడు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన బాలరాజు (25) పాల్వంచలోని సోలార్ కేంద్రంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం యథావిధిగా విధులకు హాజరైన బాలరాజు సోమవారం దానంపల్లి గ్రామ సమీపంలోని శివారులో విద్యుత్ స్తంభానికి వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు పెట్టడంతో బాలరాజు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో జోగిపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలరాజు మృతిపై తమకు అనుమానాలు న్నాయని, కంపెనీలో పనిచేసే వారే చంపి ఉంటారని మృతుడి సోదరుడు పొట్టి శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలరాజుకు కరెంట్ స్తంభాలు ఎక్కడం కూడా రాదని కుటుంబ సభ్యులు అంటు న్నారు. డ్రైవింగ్ పనులే చేస్తాడని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సామ్యా నాయక్ తెలిపారు. కాగా, బాల రాజుకు ఇటీవలే పాపన్నపేట మం డలానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. -
గంజాయికి బానిసైన కొడుక్కి తల్లి దేహశుద్ధి..
-
స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పెట్టి
సాక్షి, కోదాడ: చెడుమార్గంలో వెళ్తున్న కుమారుడిని దారిలో పెట్టేందుకు ఆ తల్లి కఠినంగా వ్యవహరిం చింది. గంజాయికి అలవాటుపడి పది రోజులుగా ఇంటికి రాకుండా తిరుగుతున్న కొడుకును పట్టు కుని కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లలో కారం పెట్టి నాలుగు దెబ్బలు వేసింది. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ ఘటన జరిగింది పట్టణానికి చెందిన వెంకయ్య– రమణమ్మ దంపతులది పేద కుటుంబం. వెంకయ్య రిక్షా తొక్కుతుండగా, రమణమ్మ కూలి పనులు చేస్తోంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. బిడ్డ పెళ్లి అయింది. 15 ఏళ్ల కుమారుడు కరోనా లాక్‌డౌన్‌కు ముందు (రెండేళ్ల క్రితం) వరకు బడికి వెళ్లేవాడు. 8వ తరగతితోనే బడి మానేసి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. బాలుడు గంజాయికి బానిసైన విషయాన్ని తల్లిదండ్రులు ఏడాది క్రితం గుర్తించి మందలించారు. అయినా మానుకోకుండా.. పలుమార్లు గంజాయి తాగి రోడ్ల మీద పడిపోవడం, తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకురావడం జరిగింది. అదే తరహాలో ఇటీవల ఇంట్లోంచి వెళ్లిన బాలుడు పది రోజుల తర్వాత సోమవారం ఉదయం తిరిగి వచ్చాడు. అది కూడా గంజాయి మత్తులో ఉండటం చూసిన తల్లి.. తీవ్రమైన బాధ, ఆగ్రహంతో కుమారుడిని ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసింది. తర్వా త కళ్లలో కారం పెట్టి దండించింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. పదిహేనేళ్ల బాలుడిని కట్టేసి, కొట్టినం దుకు పోలీసులు తల్లి మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా మారుతాడనే.. కరోనా మొదలైనప్పటి నుంచి నా కుమారుడు బడికి పోవడం మానేశాడు. ఏడాది నుంచి గంజా యికి అలవాటు పడ్డాడు. గంజాయి తాగి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడిపోతుంటే.. రాత్రివేళ నేను, నా భర్త వెతికి ఇంటికి తీసుకువస్తున్నాం. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మారుతాడనే ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాను. – బాలుడి తల్లి చదవండి: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. -
గతంలో పట్టు జారితే ప్రాణాలకే ముప్పు.. కానీ ఇప్పుడా భయం లేదు
సాక్షి, కోదాడ: ఒకప్పుడు విద్యుత్ హెల్పర్లు, లైన్మన్లు, కార్మికులు స్తంభం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. కానీ ఇప్పుడు క్లైంబింగ్ షూతో సులువుగా ఎలాంటి భయం లేకుండా విద్యుత్ స్తంభం ఎక్కేస్తున్నారు. పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై విద్యుత్ తీగలు గజిబిజిగా ఉంటాయి. గంటల తరబడి స్తంభాలపై కనెక్షన్లు వెతుక్కోవలసి వస్తుండటంతో శరీరం బరువు కాళ్లు, చేతులపై పడుతోంది. ఆ సమయంలో లైన్మన్లు, హెల్పర్లు, కార్మికులు పట్టు కోల్పోయి జారిపడే ప్రమాదం ఉంది. క్లైంబింగ్ షూతో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడింది. క్లైంబింగ్ షూతో స్తంభంపై ఎక్కడ అంటే అక్కడ తాపీగా నిలబడుతున్నారు. దీంతో రాత్రివేళ కూడా సులువుగా స్తంభాలు ఎక్కి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి క్లైంబింగ్ షూకి రూపకల్పన చేసి ఉపయోగించిన వీడియో యూట్యూబ్, వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనిని చూసి తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ శాఖల హెల్పర్లు, లైన్మన్లు విరివిగా దీని వాడకం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో కేవలం రూ.300 నుంచి రూ.450 ఖర్చుతో క్లైంబింగ్ షూ తయారు చేసుకోవచ్చు. -
పోల్ పైనే ప్రాణం పోయింది
మల్కాజిగిరి: కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్‌తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన సంతోష్, తేజేశ్వర్(22) అన్నదమ్ములు. మూసాపేట జనతానగర్‌లో ఉంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. రెండు రోజులుగా మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో విద్యుత్ పోల్స్ , వైర్లు బిగించే పనులు చేస్తున్నారు. గురువారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు బిగిస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తేజేశ్వర్ స్తంభంపైనే మృతి చెందాడు. సంతోష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ సుధాకర్, డీఈ సుభాష్, ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ నాగశేఖర్‌రెడ్డి, లైన్మెన్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం కారణంగానే తన తమ్ముడు మృతి చెందాడని ఆరోపిస్తూ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ధానిక కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రాల నెపంతో దంపతులపై దాడి
అల్లాదుర్గం(మెదక్): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు. సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్‌ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు. కట్టెలతో కొట్టారు. పోలీసులు వచ్చి రమేశ్ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. -
హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి రైతు హల్చల్
మహేశ్వరం: కబ్జా నుంచి తన వ్యవసాయ భూమిని విడిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. దెబ్బడగూడ గ్రామానికి చెందిన వరికుప్పల రాజు గ్రామంలోని సర్వే నంబర్ 30, 31, 33లో తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రాములునాయక్ కబ్జా చేసి కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడని, దీనిపై అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లినా న్యాయం చేయలేదని, కబ్జా నుంచి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పొలం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. తనకు ఆ భూమి తప్ప వేరే జీవనాధారం లేదని, న్యాయం చేయకపోతే దూకి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. సుమారు 2 గంటల పాటు స్తంభం పైనే ఉండి ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించాడు. వెంటనే సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత భూమి పత్రాలు పరిశీలించి న్యాయం చేస్తామని సర్దిచెప్పడంతో రాజు స్తంభం పైనుంచి దిగాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ( చదవండి: భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు! ) -
కరెంట్ పోల్ ఎక్కుతున్న బబ్బురి శిరీష
-
ఫుల్‌గా తాగేసి.. కరెంట్ పోల్ ఎక్కేశాడు!
-
క్వార్టర్ మందు ఇస్తేనే పోల్ దిగుతా!
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో సంగీత్ డీమార్ట్ సమీపంలోని ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్‌గా స్థానికులు గుర్తించారు. కిందకు దిగాలని స్థానికులు, పోలీసులు అతనికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోలేదు. తనకు క్వార్టర్ మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే పైనుంచి దూకుతానంటూ బేరానికి వచ్చాడు. చివరికి అతని ‘డిమాండ్’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్ లైట్స్ బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
కోటగిరి(బాన్సువాడ) : మండలంలోని ఎత్తోండ గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ లైన్‌మన్ షేక్‌హసన్ (39) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎత్తోండకు చెందిన షేక్‌హసన్ ప్రైవేటు కరెంటు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామంలో కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11 కే.వి. విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ ఆనంద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై పర్వేజ్ తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైకు
స్తంభం విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కీసర: వేగంగా వెళ్తున్న బైకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విరిగిపడింది. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని దమ్మాయిగూడ ద్వార కానగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉండే ఓ యువకుడు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన స్పోర్ట్స్ బైక్‌మీద ఈసీఐఎల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. వాహనం అతివేగంగా ఉండడంతో కాలనీలో అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపడింది. అదృష్టవశాత్తు బైకుపై ఉన్న యువకుడు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ద్వారకానగర్ కాలనీ, సాయితిరుమల కాలనీ, పాత గ్రామం, బ్యాంకు కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. -
విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ
చుండుపల్లె (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు లారీ ఢీకొని నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతోపాటు తీగలు తెగిపోయాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా కాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే ..చుండుపల్లె పట్టణం శివాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇనుప తుక్కు లోడు లారీని రివర్స్ చేస్తుండగా వెనుకనున్న విద్యుత్ స్తంభాలను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో వరుసగా నాలుగు స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగి రహదారిపై పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంటు సరఫరా లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లారీకి, డ్రైవర్‌కు కూడా ఎటువంటి అపాయం సంభవించలేదు.