
ఆదిలాబాద్: మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవీణ్ ఇంటి గొడవల కారణంగా సోమవారం స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
విద్యుత్ తీగలను పట్టుకుంటానని అనడంతో స్థానికులు సరఫరా నిలిపివేయించారు. ఎంత నచ్చజెప్పినా దిగిరాక తీగలు పట్టుకుని వేలాడారు. ఆ తర్వాత స్తంభం నుంచి జారి కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సదరు యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment