విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ | Lorry dashes current pole | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ

Published Mon, Sep 14 2015 3:33 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Lorry dashes current pole

చుండుపల్లె (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు లారీ ఢీకొని నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతోపాటు తీగలు తెగిపోయాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా కాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే ..చుండుపల్లె పట్టణం శివాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఇనుప తుక్కు లోడు లారీని రివర్స్ చేస్తుండగా వెనుకనున్న విద్యుత్ స్తంభాలను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు.

దీంతో వరుసగా నాలుగు స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగి రహదారిపై పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంటు సరఫరా లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లారీకి, డ్రైవర్‌కు కూడా ఎటువంటి అపాయం సంభవించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement