
ఈ నీళ్లు తాగుతారా?
సర్దనలో బురద నీరు సరఫరా
ఆందోళనకు దిగిన గ్రామస్తులు
మెదక్ : తమ గ్రామంలో నల్లాపైపులు లీకేజీలు ఏర్పడి బురదనీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ మెదక్ మండలం సర్దన గ్రామస్తులు పలువురు శుక్రవారం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. బురద నీరు తాగమంటారా అని నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప గ్రామంలోని కొత్తకాలనీలో తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్లు పగిలిపోయి నెలరోజులుగా నల్లాలకు ద్వార బురదనీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పగిలిపోయిన నల్లాపైపులకు వెంటనే మరమ్మతులు చేపట్టి పరిశుభ్రమైన నీటిని సరఫరాచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మంజుల స్పందిస్తూ పంచాయతీ కార్యదర్శికి చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంలో గ్రామస్తులు ఆందోళన విరమించారు.