Illegal transportation of sand
-
ఏడు ఇసుక లారీల పట్టివేత
వేములవాడ రూరల్ (కరీంనగర్) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం అధికారుల తనిఖీల సందర్భంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ లారీలు పట్టుబడ్డాయి. దాంతో ఏడు లారీలను సీజ్ చేశారు. -
తవ్వేయ్.. తరలించేయ్
తాండూరు: యాలాల కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా ‘మూడు డంప్‌లు-ఆరు ట్రాక్టర్లు ’అన్న చందంగా యథేచ్ఛగా సాగుతోంది. రెవెన్యూ,పోలీసు అధికారుల పూర్తి స్థాయి నిఘా లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు ఈ దందాను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇసుక అక్రమరవాణాకు పాల్పడే వారిపట్ల చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పినా సంబంధిత అధికారుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. చోటామోటా నాయకులు ట్రాక్టర్ల ద్వారా కాగ్నా నుంచి ఇసుకను తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిపూట లారీల్లో తాండూరు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లాకు రవాణా చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే రెవెన్యూ,పోలీసు అధికారులు కేసులు,జరిమానాలు వేస్తున్నా పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. కాగ్నా నది నుంచి ఇసుకను తీసుకువచ్చి కోకట్, లక్ష్మీనారాయణపూర్, యాలాల తదితర గ్రామాల సమీపంలోని రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇటీవల స్థానికుల సమాచారం తో అధికారులు పెద్ద ఎత్తున ఇసుక డం ప్ను సీజ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. నిరంతరం తనిఖీలు చేస్తే ఇలాంటి డంప్‌లు మొత్తం బయటపడతాయని సా ్థనికులు అంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇసుక దందాలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇసుక డంప్‌లపై రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు,మూడు డంప్‌లను సీజ్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యాలాల చుట్టుపక్కల, తాండూరు పట్టణ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే ఇసుక డంప్‌లు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు అధికారులు నెలవారీ ముడుపుల మత్తులో మునిగిపోవడంతో డంప్‌ల జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు ఎక్కడ ఉన్నాయో...అసలు పని చేస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి. పట్టణంలోని పాతతాండూరు మీదుగా ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ తరలింపుతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనుక భాగంలో కాగ్నా నది ధ్వంసమైంది. నంబర్లు లేని ట్రాక్టర్లను అక్రమార్కులు ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ట్రాక్టర్లపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా ఇసుక అక్రమ రవాణాకు ఊతమిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 150-200ల ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుంటే తప్ప ఇసుక దందాకు బ్రేక్ పడే పరిస్థితి కనబడటం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ఇసుక మాఫియా బరితెగింపు
బెదిరించి లారీని తీసుకెళ్లిన నిర్వాహకులు పిన్నంచర్ల శివారులో మరో వాహనం పట్టివేత ఆత్మకూర్ : ఇసుక బకాసురులు బరితెగిస్తూనే ఉన్నారు.. ఎలాంటి అనుమతులు లేకుం డా లారీల్లో టన్నుల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే అధికారులు దాడిచేసి ఓ లారీని పట్టుకోగా, బెదిరించి మరో వాహనాన్ని ఇసుక మాఫియా తీసుకెళ్లిపోయింది.. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆత్మకూర్ మండ లం పిన్నంచర్ల శివారులో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌లోని నీటి ట్యాంకు సమీపంలో కొందరు వ్యక్తులు ఇసుక డంప్‌లు ఏర్పాటుచే శారు. అక్కడి నుంచి యథేచ్ఛగా లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ గోపాల్‌నాయక్ బృందం ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి పిన్నంచర్ల శివారులో ఓ లారీని పట్టుకున్నారు. అందులో 50 టన్నుల నుంచి 60 టన్నుల వరకు ఇసుక ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీజ్ చేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు అల్లీపూర్ సమీపంలో మరో లారీని రెవెన్యూ సిబ్బంది పట్టుకోగా ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు బెదిరిం చి వాహనాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఆర్ఐ రాజాగణేష్, వీఆర్ఓ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, ఆత్మకూర్ మండలం కర్వెనలోని ఊకచెట్టువాగులో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ శివారులో అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను డంప్‌చేసి రాత్రివేళ లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడు లు నిర్వహించి పట్టుకుంటున్నా నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వదిలేస్తున్నట్లు సమాచారం. ఈ తంతు ఇలాగే కొనసాగితే భూగర్భజలాలు ఇంకిపోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నామమాత్రపు జరిమానా దేవరకద్ర : మండలంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతోంది. బస్వాపూర్ సమీపంలోని వాగులో నుంచి ప్రతిరోజూ డజన్ల కొద్దీ ట్రాక్టర్లు ఇసుకను డంపు చేస్తుండగా రాత్రికి రాత్రి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెంకంపల్లి, కిష్టం పల్లి, పేరూర్ నుంచి టిప్పర్లలో భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. గ్రామ నాయకులు గ్రూపులుగా ఏర్పడి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తెచ్చి డంపు లు వేసి రాత్రివేళ టిప్పర్లను రప్పించి తరలిస్తున్నారు. ఆరురోజుల క్రితం పేరూర్ వద్ద రెండు ఇసుక టిప్పర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వాటిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మూడు రోజులైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటిపై కేసులు నమోదు చేస్తే కనీసం విడిపించుకోవడానికి నెల రోజులపైనే అవుతుంది. ఇక కోర్టు, ఇత ర ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ పరిస్థితుల్లో అధికారులతో బేరం పెట్టి చివరకు ఒక్కో ఇసుక టిప్పర్‌కు *15 వేలు జరిమానా చెల్లించి వాటిని నిర్వాహకులు విడిపించుకుపోయారు. -
సింగరేణి సంస్థ పేరుతో ఇసుక అక్రమ రవాణా
చెన్నూర్ : పేరు సింగరేణిది.. అక్రమార్జన వ్యాపారులది.. ఇదీ ప్రస్తుతం చెన్నూర్ పరిధిలోని గోదావరిలో సాగుతున్న తంతు. ఏడేళ్లుగా గోదావరి నుంచి యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. నిబంధనలు తుంగలో తొక్కి సింగరేణి పేరు చెప్పి.. ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా స్పందించే వారు లేకుండా పోయారు. చివరికి మంచిర్యాల ఆర్టీవో అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలనలో ఈ అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నూర్‌లోని గోదావరి నుంచి సింగరేణి సంస్థకు ఇసుక తరలించేందుకు సెప్టెంబర్ 21, 2007లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సర్వే నంబర్లు 225 నుంచి 468 వరకు ఉన్న 540 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టాలని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో వారు పట్టించుకోలేదు. గోదావరి మధ్యలో నుంచి తవ్వకాలు.. హద్దులు చూపించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. తమను ఎవరు అడ్డుకుంటారనే ధీమాతో సింగరేణి కాంట్రాక్టర్లు గోదావరి మధ్యలో నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తంతు ఏడేళ్లుగా కొనసాగుతున్నా నేటికీ అధికారులు గమనించకపోవడం వారి నిర్లక్ష్యంగా స్పష్టం చేస్తోంది. అయితే.. శుక్రవారం రాత్రి గోదావరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థకు అని చెప్పి ఇసుక తరలిస్తున్న మూడు లారీలను తహశీల్దార్ పట్టుకున్నారు. దీంతో శనివారం మంచిర్యాల ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్ గోదావరి నదిని సందర్శించారు. సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతి ప్రాంతాల్లో కాకుండా గోదావరి మధ్యలోంచి అక్రమంగా రవాణా సాగుతోందని ఆమె పరిశీలనలో వెల్లడైంది. అక్రమాలకు రాచ మార్గం... సింగరేణి సంస్థకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని కొందరు కాంట్రాక్టర్లు గోదావరి నది నుంచి సంస్థకే కాకుండా రాష్ట్ర రాజధానికి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గోదావరి ప్రాంతం నుంచి ఇసుక తీసుకెళ్లే లారీలను కాంట్రాక్టర్లు సింగరేణికి కాకుండా దారి మళ్లించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా ఏడేళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో 8 మీటర్ల లోతుగా ఇసుక ఉంటే 2 మీటర్ల వరకు తవ్వకాలు జరుపాల్సి ఉంది. కానీ.. సదరు కాంట్రాక్టర్లు 5 నుంచి 6 మీటర్ల లోతులో తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఇసుక తవ్వకాలు నిలిపివేశాం.. గోదావరి నుంచి ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. సింగరేణి సంస్థకు ఇచ్చిన సర్వే నెంబర్లలో కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇసుక రావాణా సాగుతోంది. దీంతో గోదావరి నదిలో ఉన్న రెండు పొక్లెయినర్లను సీజ్ చేసి ఇసుక తవ్వకాలను నిలిపి వేశాం. నివేదికన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం. -
ఇసుకాసురులపై నిఘా నేత్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా పెద్ద పెద్ద ఇసుక రీచ్‌లుగా గుర్తింపు పొందిన జిల్లాలోని పాయింట్లలో హై రిజొల్యుషన్ క్లోజ్డ్ సర్క్యూట్ (హెచ్ఆర్సీసీ)లను ఏర్పాటు చే సి ఎప్పటికప్పుడు ఇసుక తరలింపు ఎలా జరుగుతుందనే దాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ సీసీ కెమెరాలను సమీప పోలీస్‌స్టేషన్‌తో అనుసంధా నం చేస్తామని, ఇసుక పాయింట్లలో జరిగే తతంగాలను స్టేషన్ ద్వారా పరిశీలించి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటామని అధికారులు చెపుతున్నారు. ఈ మేరకు ఐదు పాయింట్లను గుర్తిం చిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు వాటిని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు. రీచ్‌లో ఏం జరిగేది క్షణాల్లో పోలీస్‌స్టేషన్‌కు.. జిల్లాలోని గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో, కిన్నెరసాని, ముర్రేడు, మున్నేరు లాంటి వాగుల్లో పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల ద్వారా ఏటా సుమారు కోట్ల రూపాయల విలువైన ఇసుక తరలిస్తారు. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు కూడా జిల్లా నుంచి ఇసుక తరలిపోతోంది. అయితే, ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా వెళుతున్న ఇసుకను అడ్డుకునే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. చెక్‌పోస్టుల్లో సైతం తగినంత సిబ్బంది లేకపోవడం, ఇసుకాసురులిచ్చే సొమ్ములకు కొందరు ప్రభుత్వ సిబ్బంది ఆశపడుతుండడం, రాత్రివేళల్లో సరైన గస్తీ లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా వర్ధిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నించినా ఇసుక దందాను నియంత్రించ లేకపోతున్నారు. నిర్దిష్టంగా ఎవరిపై చర్యలు తీసుకునే, కేసు నమోదు చేసే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. హైరిజొల్యుషన్ ఉన్న సీసీ కెమెరాలను ఇసుక పాయింట్లలో ఉంచడం ద్వారా ఏ వాహనం ఎన్ని సార్లు ఇసుకను తీసుకెళ్లింది గుర్తించవచ్చనే ఆలోచనతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మైనింగ్ శాఖ గుర్తించిన విధంగా నాయకన్‌గూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల ద్వారా వాహనం నంబర్‌తో పాటు డ్రైవర్‌ను కూడా గుర్తించవచ్చని, తద్వారా ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పులు కొట్టి అటు అక్రమ రవాణా చేయడంతో పాటు ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను నియంత్రించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ కెమెరాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది..? ఆచరణలో ఎలా సాధ్యమనేది పరిశీలించి త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు. -
ఇసుక లారీలపై ఉక్కుపాదం
- అర్ధరాత్రి విజిలెన్స్ అధికారుల దాడులు - వంద ఇసుక లారీల పట్టివేత - ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాల స్వాధీనం - క్వారీలలోనూ ఆకస్మిక తనిఖీలు - భారీగా జరిమానా విధింపు బాన్సువాడ/బిచ్కుంద: ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు కన్నెర్ర చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు విస్తృతంగా తనిఖీలు చేసి వంద లారీ లను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఏస్గీ క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్న పది టైర్ల భారీ వాహనాలను కూడా నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు గనుల శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి ఆధ్యర్యంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బిచ్కుంద మండలం ఖద్గాం, శెట్లూర్, వాజిద్నగర్, పిట్లం, నిజాం సాగర్, బాన్సువాడ, బిచ్కుందలో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న వంద లారీలను స్థానిక తహసీల్దార్ ధన్వాల్కు అప్పగించారు. ఒక్కో వాహనానికి రూ.20వేల చొప్పున జరిమానా విధించారు. అయితే దాదాపు 35 లారీలకు ఇంకా జరిమానా వేయలేదని సమాచారం. ఒక్కో లారీలో 50 టన్నులు వాస్తవంగా పది చక్రాల లారీలో సుమారు 22 టన్నుల మేర కే లోడ్ నింపాలి. కానీ, సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో లారీ డ్రైవర్లు రెట్టింపు బరువు అంటే, దా దాపు 50 టన్ను ల ఇసుకను నింపి వివిధ ప్రాంతాల కు తరలి స్తున్నా రు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, లారీ లలో సామర్థ్యానికి మించిన బరువుతో ఇసుకను రవాణా చే స్తుండడంతో రహదారులు చెడిపోతున్నాయని బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఇటీవల న్యాయవాదులు కోర్టులో కేసు కూడా వేశారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తక్షణమే ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని విన్నవించారు. రెవెన్యూ, గనులు, పోలీస్, రవాణా శాఖ అధికారుల వైఖరికి నిరసనగా ఒక రోజు బిచ్కుంద బంద్ చేయించి, ధర్నా చేశారు. ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలూ గాలిలో కలిసిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే నిజాంసాగర్ మండలం కోమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర ప్రాం తం నుంచి వస్తున్న భారీ వాహనాలను బోధన్-బాన్సువాడ-ఎల్లారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్తున్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తర లించి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుండ డంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎట్టకేలకు అధికారులు స్పందించి బుధవారం రాత్రి ఇసుక లారీలపై దాడులు చేశారు. హోం మంత్రి వస్తున్నారనేనా! హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం మ ద్నూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇసుక లారీల వ్య వహారం మంత్రి దృష్టికి రాకూడదనే పోలీసు అధికారులు భావించి ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. క్వారీని పరిశీలించిన అధికారులు ఖత్గాం, వాజిద్నగర్ గ్రామాలలో కొనసాగుతున్న ఇసుక క్వారీలను తహసీల్దార్ ధన్వాల్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధం గా ఇసుకను తవ్వుతున్నారా లేదా అని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి గనుల శాఖ అధికారుల కు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అక్కడి నుం చి అనుమతులు వచ్చే వరకు ఇసుక రవాణాను నిలి పివేయాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు
- జోరుగా ఇసుక అక్రమ రవాణా - జరిమానాతోనే సరిపెడుతున్న అధికారులు - ఆందోళనలో రైతులు, స్థానికులు పెద్దమందడి : మండలంలోని చిల్కటోనిపల్లి, బలీదుపల్లి, కన్మనూర్‌కు చెందిన వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తూ వదిలి వేయడం రివాజుగా మారింది. దీంతో పథకం ప్రకా రం వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి డంపులుగా సృష్టిస్తున్నారు. తాజాగా శుక్రవారం కన్నిమేటకు చెం దిన రవి, ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ అనుమతి లేకుండా తమ రెండు ట్రాక్టర్ల ద్వారా చిల్కటోనిపల్లి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వెనువెంటనే జరిమానా వసూలు చేసి వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై వనపర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తున్నా, పెద్దమందడిలో ట్రాక్టర్ యజమానులపై అధికారులు ఎందుకు కేసులు నమోదు చేయడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. -
అసలు దొంగలెవరు?
సాక్షి, అనంతపురం : ఇసుకను అక్రమంగా తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఘటనలో నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు గురువారం ఒకటో పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ వెల్లడించడం కలకలం రేపింది. అయితే ఇసుక మాఫియా విషయంలో అందరిపై ఇలానే వ్యవహరిస్తారా అనే ప్రశ్న తలెత్తింది. గురువారం నాటి ఘటనలో ఇసుక మాఫియా వెనక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన ఓ ముఖ్యనాయకుడు ప్రధాన పాత్రధారునిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నాయకుడికి పట్టణంలోని ఓ ఎస్ఐ సహకారం పూర్తిగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణాను మూడుపువ్వులు.. ఆరు కాయలుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ధనార్జనే లక్ష్యంగా టీడీపీ తీర్థం పుచుకున్న ఈ నాయకుడు కొందరు పోలీసులకు భారీగా మామూళ్లు ముట్టజెప్పి తన పనికి ఆటంకం లేకుండా చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండ, కాఖీ సహకారం ఉండడంతో ఆ నాయకుడు.. అనంతపురం నగర శివారు ప్రాంతాల్లోని వంకలు.. వాగుల్లోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జేసీబీలతో జోరుగా ఇసుకను తవ్వించి బెంగుళూరుకు తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసుల విచారణలో ఈ నాయకుని పేరు కూడా వినిపించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పాటు పై స్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆనాయకుని పేరు తప్పించి మిగిలిన వారి పేర్లు వెల్లడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరుకు యథేచ్ఛగా రవాణా.. అనంతపురం పరిసర ప్రాంతాల్లోని వంకలు.. వాగులతో పాటు బుక్కరాయసముద్రం చెరువులో జేసీబీలతో ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా నగరంలోని శివారు ప్రాంతాల్లో నిల్వ (డంప్)చేసి అనంతరం అనుకూల వాతావరణం ఉన్నపుడు బెంగుళూరుకు లారీల్లో తరలిస్తున్నారు. దాడులు జరుగుతున్నాయనే సమాచారం ముందుగా అందితే, జాతీయ రహదారిపై కాకుండా దొడ్డిదారిన (గ్రామీణ ప్రాంతాల మీదుగా) చేరవేస్తున్నారు. బెంగుళూరులో ఇటీవల బహుళ అంతస్థుల నిర్మాణాలు ఊపందుకోవడంతో అక్కడ ఇసుకకు డిమాండ్ పెరిగింది. టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.1200 దాకా విక్రయిస్తున్నారు. ఒక్కో లోడుపై రూ.25-రూ.35 వేల దాకా సంపాదిస్తున్నారు. ఎటువంటి రాయల్టీ లేకుండా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు శాఖలోని సిబ్బందే సీఐ గోరంట్ల మాధవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో నిఘా ఉంచిన సీఐ గురువారం ఇసుకను తరలిస్తుండగా దాడి చేసి పట్టుకోవడం కలకలం రేపింది. పోలీసు అధికారుల్లో కూడా తీవ్ర చర్చకు తెరలేపింది. చాలా ప్రాంతాల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడినప్పుడు ఆయా వాహనాలకు నామమాత్రపు జరిమానా వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. డ్రైవర్లు, కూలీలపై కేసులు పెడుతూ తెరవెనుక ఉన్న వ్యక్తులను వదిలేస్తున్నారు. బావురుమంటున్న పెన్నా, చిత్రావతి.. పోలీసులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుకాసురులు ఒక్క అనంతపురం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా పామిడి , తాడిపత్రి సమీపంలోని పెన్నా తీరాన్ని కొల్లగొడుతున్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చిత్రావతి కాలువలో సైతం ఇసుకును తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతాల్లో భూగర్బ జలాలు ప్రమాదకర స్థితికి పడిపోయాయి. వీటిపై స్థానికులు పలుమార్లు రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ అక్రమ వ్యాపారంలో వారి శాఖల సిబ్బంది కూడా తలమునకలై ఉండడంతో వారు నోరు మెదపకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇసుకను వేలం పాటల ద్వారా విక్రయించే బాధ్యత డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా అక్రమ తరలింపునకు పాల్పడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేయడం ఏవిధంగా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, తాము ఆర్థికంగా బలంగా ఉంటేనే సాధ్యమవుతుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చూసీ చూడనట్లు పోవాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. -
వాగు దాటుతున్న ఇసుక!
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల డివిజన్ పరిధిలోని షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్‌సాగర్, గండిపేటల్లోకి నీరు చేరుతుంది. వర్షాలు కురిసి వాగులు ప్రవహించినప్పుడు ఇసుక కూడా భారీగా వచ్చి చేరుతుంటుంది. ఇసుక అధికంగా ఉన్నచోట భూగర్భజలాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో మూసీ, ఈసీ వాగులు నాలుగైదు సార్లు నిండుగా ప్రవహిస్తే వేసవిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. సాగుతాగు నీటికి ఇబ్బంది ఉండదు. కాగా.. కొందరు అక్రమార్కులు ఈసీ, మూసీ వాగుల నుంచి తమ ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను వాగు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తరలింపుతో వాగుల్లో గుంతలు ఏర్పడి వర్షం కురిసినప్పుడు భూగర్భంలోకి నీరు ఇంకకుండా దిగువకు ప్రవహిస్తుంటుంది. అక్రమార్కుల ఇసుక వ్యాపారంతో జలసిరి పాతాళంలోకి పోతోంది. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు.. ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్న షాబాద్ మండలంలోని నాగరగూడ, రుద్రారం, తాళ్లపల్లి, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్, చిన్నమంగళారం, వెంకటాపూర్, అప్పోజీగూడ, మోత్కుపల్లి, శంకర్పల్లి మండలంలోని రావులపల్లి, పొద్దటూరు, ఫత్తేపూర్, మోకిల, టంగటూరు, గోపులారం, ఎల్వర్తి, జన్వాడ, తదితర గ్రామాల సమీపంలోంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1800-2200 వరకు దండుకుంటున్నారు. వాగుల్లో ప్రవాహం లేనప్పుడు అక్రమార్కులు ఇసుకను తరలించి డంప్ చేసుకుంటున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాల్టా చట్టానికి తూట్లు.. ఇసుకను అక్రమంగా తరలిస్తే అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని వాల్టా చట్టం చెబుతోంది. ప్రభుత్వ అవసరాలకు మాత్రం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని ఇసుక తరలించుకోవచ్చు. దీంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అధికారులు పర్మిట్లు జారీచేశారు. ఇదే అదనుగా అక్రమార్కులు అవసరానికి మించి ఇసుకను తరలించి డంప్ చేసుకున్నారు.