- జోరుగా ఇసుక అక్రమ రవాణా
- జరిమానాతోనే సరిపెడుతున్న అధికారులు
- ఆందోళనలో రైతులు, స్థానికులు
పెద్దమందడి : మండలంలోని చిల్కటోనిపల్లి, బలీదుపల్లి, కన్మనూర్‌కు చెందిన వాగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తూ వదిలి వేయడం రివాజుగా మారింది. దీంతో పథకం ప్రకా రం వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి డంపులుగా సృష్టిస్తున్నారు. తాజాగా శుక్రవారం కన్నిమేటకు చెం దిన రవి, ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ అనుమతి లేకుండా తమ రెండు ట్రాక్టర్ల ద్వారా చిల్కటోనిపల్లి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వెనువెంటనే జరిమానా వసూలు చేసి వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై వనపర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తున్నా, పెద్దమందడిలో ట్రాక్టర్ యజమానులపై అధికారులు ఎందుకు కేసులు నమోదు చేయడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
పట్టుకున్నారు.. వదిలేశారు
Published Sat, Aug 16 2014 2:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement