నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.15 లక్షల విలువ చేసే బియ్యం బస్తాలను అధికారులు గుర్తించి ... సీజ్ చేశారు. అనంతరం మిల్లు యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. మిల్లులో బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించారు.