
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేసిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆస్పత్రిలో రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం ఘటనలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. అయితే, ఎంజీఎం మాజీ పరిపాలనాధికారి ఇంజెక్షన్లను బయటకు తరలించారని, దీనిపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రిని సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించిన రెమ్‌డెసివిర్‌లను ప్రైవేట్ క్లినిక్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఆ క్లినిక్ కాంపౌండర్ కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది.
కమిటీ వేశాం: సూపరింటెండెంట్
ఈ ఘటనపై విచారణ కోసం సీనియర్ ప్రొఫెస ర్లతో కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు కమిటీ రెండు నెలలుగా ఆస్పత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియో గంపై ఆరా తీస్తుందన్నారు. ఇక ఎంజీఎం ఆస్ప త్రిలో ఫ్లోమీటర్లు కూడా చోరీకి గురయ్యాయని పరి పాలనాధికారులు నిర్ధారణకు వచ్చారు. చోరీ బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు.