సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇచ్చామంటున్న రూ.15 వేల కోట్లు రుణంగానే ఇస్తున్నారు. రూ.15 వేల కోట్ల రుణంపై వడ్డీ కూడా ఏపీనే భరించాలి. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఏపీకి అన్యాయం జరిగినట్టే.. కేంద్రం నిధులు దోచుకోవడానికే పోలవరాన్ని చంద్రబాబు చేపట్టారు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
‘‘ఎన్డీఏ హయాంలో ఏపీ హింసకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఇది జరుగుతోంది. టార్గెట్‌గా హత్యలు, దాడులు జరుగుతున్నాయి. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుంది. ఏపీలో ఒక వర్గం మీడియా ఎల్లో జర్నలిజం నడిపిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయాలి. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి కోరారు.
పునర్విభజన చట్టానికి కట్టుబడ్డామన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను విస్మరించింది. పార్లమెంట్‌లో వాగ్దానం చేసిన కేంద్రం ప్రత్యేక హోదాను ఏపీకి ఇచ్చి తీరాల్సిందే’’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment