
ఇన్నోవా, స్కార్పియోలను పంపిణీ చేస్తున్న ఓఎస్‌డీ ఆర్.భాస్కరన్
ఖమ్మం బుర్హాన్‌పురం : పోలీస్‌శాఖ ప్రజలకు మరింత మైరుగైన సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణలో భాగంగా తొమ్మిది నూతన వాహనాలను జిల్లాలోని ఎనిమిది సబ్‌డివిజన్లకు చెందిన డీఎస్పీలకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓఎస్‌డీ ఆర్.భాస్కరన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లడుతూ జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం అదేశానుసారం శాంతి భద్రతల పరిరక్షణలో ఆధునిక ప్రమాణాలతో కూడిన పోలీస్ వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా పోలీస్ శాఖ అధికారులు నడుం బిగించారన్నారు. పోలీస్ అధికారుల అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహిండం, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాల కదలికలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల అంశాలపై పర్యవేక్షణకు వీలుండే విధంగా వాహనాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.సంజీవ్ ఆర్‌ఐలు విజయబాబు, కృష్ణ, ఎంటీఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.