
ప్రతీకాత్మక చిత్రం
తిరుమల : జూలై నెలకు సంబంధించిన 58,419 అన్ లైన్ శ్రీవారి సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. ఆన్‌లైన్ లక్కీ డిప్ కేటగిరిలో 9,619 టిక్కెట్లను ఉంచారు. జనరల్ కేటగిరిలో మిగతా 48, 800 టిక్కెట్లు కేటాయించారు. తోమాల(110 టిక్కెట్లు), అర్చన(110 టిక్కెట్లు), అష్టదళ పాద పద్మారాధన(120 టిక్కెట్లు), సుప్రభాతం(6,979 టిక్కెట్లు), నిజపాద దర్శనం(2,300 టిక్కెట్లు) సేవలకు సంబంధించి సేవా ఎలక్ట్రానిక్ డిప్ నమోదు శుక్రవారం(ఈ నెల 6న) ఉదయం 10 నుంచి ప్రారంభమౌతుంది.
జనరల్ కేటగిరిలోని వైశేషపూజకు(1000 టిక్కెట్లు). కల్యాణానికి(12,350 టిక్కెట్లు), దోలోత్సవం(3,900 టిక్కెట్లు), ఆర్జిత బ్రహ్మోత్సవం(7,150 టిక్కెట్లు), వసంతోత్సవం(8,800 టిక్కెట్లు), సహస్ర దీపోత్సవానికి(15,600 టిక్కెట్లు) కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment