ఏపీలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత | Professor Of Delhi University Says Ysrcp Give Preference To Bc In Mlc Seats | Sakshi
Sakshi News home page

ఏపీలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత

Published Tue, Jun 13 2023 8:44 AM | Last Updated on Tue, Jun 13 2023 8:46 AM

Professor Of Delhi University Says Ysrcp Give Preference To Bc In Mlc Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదని, అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బిహార్‌ మాజీ సీఎం బీపీ మండల్‌ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూరజ్‌ మండల్‌ చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

బీసీల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీలతో మహాధర్నా
బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్‌ కమిషన్‌ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూరజ్‌ మండల్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో బీసీలు సహా.. కులాల వారీగా జనాభా ఎంత ఉందో స్పష్టత వచ్చేలా జనగణన చేయాలన్నారు. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు.

ఆ దిశగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో ఫీజులు పెరిగి పోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలు చదువుకోవడంకష్టమేనన్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా  కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసిందని విమర్శించారు.

చదవండి: కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు: రేవంత్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement