అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. నిన్న రాత్రి విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు బెదిరింపుల వ్యవహారంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ సీఈఓ గోపాల ద్వివేదీని బెదిరించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినేట్‌కి రాకపోతే అధికారుల సంగతి చూస్తానన్న బాబు బెదిరింపులపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై నిరసనగా అధికారులు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లో మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేబినేట్ మీటింగ్ పెడితే కార్యాచరణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment