తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రదీప్ చంద్రను నియమించగా, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీగా ధర్ నియమితులయ్యారు.
అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బీఆర్ మీనా, ఐక్యాడ్ సెక్రటరీగా వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవోగా పౌసమి బసు, కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా దేవసేనను నియమించారు.