
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక ఐఏఎస్ ఉన్నతాధికారుల కుట్ర ఉందని న్యాయవాది మహ్మద్ జాఫరుల్లా ఖాన్ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌లను ప్రతివాదులుగా చేర్చాలన్నారు. ‘చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు జరిగిన చికిత్సపై శశికళ, రామ్మోహన్‌రావులకు మాత్రమే పూర్తి వివరాలు తెలుసు. జయకు చికిత్సల సమయంలో సుమారు 20 కీలక ఫైళ్లపై వీరిద్దరే సంతకాలు చేశారు. అందుకే, జయకు చికిత్స మొదలుకొని మృతి వరకు వీరే కీలకం’ అని అందులో పేర్కొన్నారు.