Jayalalitha Death
-
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్‌లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు. -
విదేశాలకు తీసుకెళ్తే అమ్మ బతికేవారు..
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మృతిపై తమిళనాడు న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను విదేశాలకు తరలించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేవారని వ్యాఖ్యానించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా ఆమె ఆరోగ్యంపై వైద్యారోగ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహనరావులు విచారణ కమిషన్‌ను అవాస్తవ సమాచారంతో తప్పుదారి పట్టించారని షణ్ముగం ఆరోపించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా వీరి పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చికిత్స నిమిత్తం జయలలితను విదేశాలకు తీసుకువెళ్లే ప్రతిపాదనను వైద్యారోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వ్యతిరేకించారని, అలా చేస్తే భారత వైద్యుల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన భావించారని చెప్పారు. ఆయన స్వయంగా డాక్టర్ అయి ఉండీ రోగి పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జయలలితకు యాంజయోగ్రామ్ నిర్వహించాలని ముగ్గురు వైద్యులు సూచించినా ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఆమెకు ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదని, తప్పుడు వైద్యం ఎవరు చేపట్టారని నిలదీశారు. ఆస్పత్రిపై ఎవరు అజమాయిషీ చేశారనే వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉందన్నారు. కాగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అపోలో ఆస్పత్రితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆర్ముగస్వామి కమిషన్ పిటిషన్లో ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జయ ఆస్పత్రిలో ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహన్‌రావు తప్పుడు ఆధారాలు సమర్పించారని ఈ పిటిషన్ ఆరోపించింది. జయలలిత మృతిపై ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
జయ మరణం వెనుక ఐఏఎస్‌ల కుట్ర?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక ఐఏఎస్ ఉన్నతాధికారుల కుట్ర ఉందని న్యాయవాది మహ్మద్ జాఫరుల్లా ఖాన్ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌లను ప్రతివాదులుగా చేర్చాలన్నారు. ‘చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు జరిగిన చికిత్సపై శశికళ, రామ్మోహన్రావులకు మాత్రమే పూర్తి వివరాలు తెలుసు. జయకు చికిత్సల సమయంలో సుమారు 20 కీలక ఫైళ్లపై వీరిద్దరే సంతకాలు చేశారు. అందుకే, జయకు చికిత్స మొదలుకొని మృతి వరకు వీరే కీలకం’ అని అందులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై భిన్నాభిప్రాయం
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా.. మరోజడ్జి జస్టిస్ ఎం.సుందర్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తుది తీర్పు కోసం ఈ కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈ కేసును ఎవరు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాతి సీనియర్ న్యాయమూర్తి నిర్ణయిస్తారని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తెలిపారు. మూడో జడ్జి తీర్పు వెలువరించేంత వరకు యథాతథస్థితి అంటే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కొనసాగుతుందన్నారు. జయలలిత మరణంతో అనిశ్చితి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సీఎం పదవి నుంచి పన్నీర్ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించారు. దీన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయి శశికళ, దినకరన్‌లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్‌తో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. దీంతో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గత సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత రద్దై ఉంటే ప్రభుత్వానికి ముప్పే ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అనర్హులైనందున ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రద్దై ఉండి ఉంటే పళని ప్రభుత్వానికి చాలా చిక్కులు వచ్చేవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు స్పీకర్ మినహా అధికార పార్టీ అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8 మంది, ఐయూఎంల్‌కు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే మరో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22 అయింది. వీరు డీఎంకే, కాంగ్రెస్ కూటమికున్న 98 ఎమ్మెల్యేలతో కలిస్తే వీరి బలం 120గా మారేది. అప్పుడు అధికార పార్టీ బలం స్పీకర్‌తో కలిపి 114గా ఉండేది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేది. హైకోర్టు తీర్పుపై దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కొనసాగింపునకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. -
‘2011 నుంచే జయ హత్యకు కుట్ర..’
సాక్షి, చెన్నై : అపోలో ఆస్పత్రిలో చికిత్సలందుకుంటుండగా జయలలిత స్పృహలోకి వచ్చారా? అంటూ దీపక్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. జయ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఆర్ముగసామి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ కమిషన్ ఎదుట బుధవారం జయ అన్న కుమార్తె దీప హాజరయ్యారు. ఆమె పోయెస్ గార్డెన్లో పనిచేసిన రాజమ్మాళ్, ఇద్దరు డ్రైవర్ల వద్ద విచారణ జరపాలని న్యాయమూర్తితో తెలిపారు. అంతేకాకుండా శశికళ కుటుంబీకులు 2011 నుంచి జయలలితను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు న్యాయమూర్తికి తెలిపారు. ఇలావుండగా జయలలిత అన్న కుమారుడు దీపక్ గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో రెండు గంటలకు పైగా న్యాయమూర్తి విచారణ జరిపారు. అతని వద్ద న్యాయమూర్తి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా ఆమెను చూశారా, ఆమె స్పృహలో ఉన్నారా? ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో జయ ఏ స్థితిలో ఉన్నారు? ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారు? ప్రశ్నలు వేశారు. ఇందుకు దీపక్ తగిన వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. -
'శశికళకు భయపడే అందరం అబద్దం చెప్పాం'
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో జయలలితను కలుసుకునే అవకాశం కలిగి ఉంటే తాను ఎలా చంపబడుతున్నానో ఆమె తమకు చెప్పి ఉండేవారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ కోలుకుంటోంది అంటూ శశికళకు భయపడి అందరం అబద్ధాలు చెప్పాం. దయచేసి క్షమించండి’ అని ప్రజలను వేడుకున్నారు. అన్నాదురై జయంతి సందర్భంగా మదురై పళంగానత్తంలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ... అనారోగ్యానికి గురైన జయలలితకు మందులు ఇవ్వకుండా ఆస్పత్రిలో పడవేశారని వెల్లడించారు. ‘‘ప్రజలారా నన్ను క్షమించండి.. చికిత్స సమయంలో జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా మేం చెప్పినదంతా అబద్ధం, పార్టీ రహస్యాలు బహిరంగ పరచకూడదనే ఉద్దేశంతో కలిసికట్టుగా అబద్ధాలు ఆడాం. కావాలంటే రాసిపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పేది నిజం’’ అని చెప్పారు. శశికళకు భయపడి జయలలితకు చికిత్స విషయంలో అన్నీ అబద్ధాలాడమని తెలిపారు. జయలలిత ఉన్న రూంలోకి శశికళ, ఆమె కుటుంబీకులు మాత్రమే వెళ్లేవారని తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ ఉపా«ధ్యక్షులు రాహూల్‌గాంధీ, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆస్పత్రికి వచ్చినపుడు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, శశికళ కుటుంబీకులను మాత్రమే కలుసుకున్నార, జయలలితను చూసేందుకు వారికి అవకాశం ఇవ్వకుండా ఇన్ఫెక్షన్ సాకు చూపి అడ్డుకున్నారని వెల్లడించారు. సాధారణ వార్డు బాయ్ కూడా జయలలితను చూశాడనీ, మంత్రులుగా తాము చూడలేకపోయామని ఆయన వాపోయారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని చెప్పారు. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిన చికిత్స వీడియోను విచారణ కమిషన్ ముందు విడుదల చేస్తామని టీటీవీ దినకరన్ శనివారం చెన్నైలో తెలిపారు. -
జయలలిత మృతిపై విచారణకు సిద్ధం
-
జయలలిత మృతిపై విచారణకు సిద్ధం: అపోలో చైర్మన్
చెన్నై: అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న కన్నుమూశారు. అయితే ఆమెకు అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ కొంతమంది ఈ విషయంపై మాట్లాడుతూనేఉన్నారు. అలాంటివాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రతాప్ సి రెడ్డి అన్నారు. శుక్రవారం చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని, ప్రసంగించిన ఆయన.. విచారణ జరిపితేగనుక, మాజీ సీఎం మరణానికి సంబంధించిన అన్నివివరాలను అందజేస్తామని చెప్పారు. ఈ విషయంలో దాగుడుమూతలకు తావులేదని తెలిపారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు. చికిత్సలో భాగంగా జయలలిత కాళ్లు తొలిగించారనే వార్తలు నిజం కావని ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. -
తమిళనాడులో అసాధారణ పరిస్థితి
తమిళసినిమా: జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఇటీవల ఆయన అభిమానులు పెద్దఎత్తున పోస్టర్లు ముద్రించి చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మరోవైపు రజనీకాంత్ కోసం పలు రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుత తమిళనాడు పరిస్థితి గురించి రజనీకాంత్ వ్యాఖ్యలు మేధావులను సైతం ఆలోచనలో పడేశాయి. కాగా ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఏమన్నారో చూద్దాం. పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందే. ఇవీ సూపర్‌స్టార్ వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యల్లో నిగూడార్ధం ఏమిటి గురువా? అంటూ విశ్లేషించే పనిలో పడ్డారు కొందరు రాజకీయవాదులు. -
నిజం చావకూడదు!
గౌతమి ఆవేదన ఏంటి? తను రాజకీయాల్లోకి రావాలనుకుంటోందా? కమల్‌హాసన్‌తో తెగతెంపుల తర్వాత ఈ సడన్ బరస్ట్ ఏంటి? గౌతమి మాట్లాడుతోందా? ఎవరైనా మాట్లాడిస్తున్నారా? జయలలితకీ, గౌతమికీ కనెక్షన్ ఏంటి? ‘పురట్చి తలైవి’ సమాధి అయిపోయింది కానీ, నిజం సమాధి కాకూడదు గౌతమితో వన్ టు వన్ ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ⇔ జయలలిత చికిత్స వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలని చాలామందికి ఉంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరూ రాలేదు. మొదటి గంట మీరు కట్టారు. ఏమిటా ధైర్యం? మన కళ్ల ముందు ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది. భరించలేని బాధ ఉంటుంది. ఆ బాధ మనల్ని మాట్లాడేలా చేస్తుంది. ఇక్కడ నా ధైర్యం గురించి మాట్లాడే ముందు నా బాధ గురించి మాట్లాడాలి. ఒక సామాన్య పౌరురాలిగా ‘అసలు జయలలితగారి ఇన్నాళ్ల చికిత్స వెనక ఏం జరిగింది?’ అని తెలుసుకునే హక్కు నాకు ఉందనిపించింది. అందుకే మాట్లాడాను. ⇔ జయలలిత గారికి దగ్గరుండి చికిత్స చేయించినవాళ్ల బ్యాక్‌గ్రౌండ్ మామూలుది కాదు... వాళ్లను ఎదుర్కోవడం కష్టాలు కోరి తెచ్చుకోవడమేనని కొందరి ఫీలింగ్!! ఏమోనండి. అవతలివాళ్లు ఏంటి అనేది నేను ఆలోచించలేదు. కళ్ల ముందు జరిగిన ఘటనకు çసరైన సమాధానం లేదు. జయలలితగారిని కోట్ల మంది అభిమానిస్తున్నారు. వాళ్లందరూ చివరి రోజుల్లో ఆమెకు ఎటువంటి చికిత్స అందించారోననే విషయం గురించి ఓ క్లారిటీ కావాలనుకుంటున్నారు. పర్సనల్‌గా నాకు ఆవిడంటే చాలా అభిమానం. గడచిన 20 ఏళ్లల్లో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమయాల్లో ఆవిణ్ణి తలుచుకునేదాన్ని. జయలలితగారిని ఆదర్శంగా తీసుకుని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇతరులు ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి జీవితానికి సంబంధించిన బోలెడన్ని ప్రశ్నలు మిగిలిపోయినప్పుడు సమాధానం ఆశించడం తప్పు కాదు. ఆవిడ ఏమైనా... సాదాసీదా వ్యక్తా? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇవాళ ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అలాగే జయలలితగారు ‘రేసీ’ పొలిటికల్ లీడర్. ఆవిడ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోకూడదు. ⇔ జయలలిత ఆప్తురాలు శశికళపై చాలామందికి అనుమానాలున్నాయి. రహస్య చికిత్సలో కుట్ర ఉందని నమ్ముతున్నారా? ఇక్కడ ఒకరి నమ్మకం.. మరొకరి అపనమ్మకంతో∙ఏదీ నిర్ణయించలేం. నమ్మకాలు నిజం కావొచ్చు. అపనమ్మకాలు అబద్ధం కావొచ్చు. ప్రధాన మంత్రిని నేను కోరిందేంటంటే.. ముందు ‘ఫ్యాక్ట్’ ఏంటో తెలుసుకోమని. అది తెలిశాక ప్రోసీడ్ అవ్వాలి. అలా చేయడమే మర్యాద. వాళ్లన్నారనీ, వీళ్లన్నారనీ కొందరిని అనుమానించి, ఆ దిశగా అడుగులు వేయకూడదు. నిజం తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయాలి. ⇔ మీరు స్పందించిన తర్వాత మరికొన్ని గొంతులు బయటికొచ్చాయ్. కానీ, జయలలితగారు ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరు స్పందించి ఉంటే ఉపయోగం ఉండి ఉండేదేమో? జయలలితగారు అడ్మిట్ అయిన తర్వాత ఆవిడ పరిస్థితి తెలుసుకోవాలని, చూడాలని ఆస్పత్రికి వెళ్లినవాళ్లను అనుమతించకపోవడం ఏంటి? అసలెందుకంత రహస్యం? ఆవిడ రికవర్ అవుతున్నారని, ఫిజియోథెరపీ చేస్తున్నామని అప్పుడప్పుడూ కొంత సమాచారం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. సరే... ఎవర్నీ ఆస్పత్రి లోపలికి అనుమతించకపోయినా... ఆవిడ బాగానే ఉన్నారనుకున్నాను. ఇంకో రోజులో డిశ్చార్జ్ అవుతారనే వార్త వచ్చాక ‘ఏం ఫర్వాలేదు’ అనుకున్నాను. నేనే కాదు, జయలలితగారు ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి ‘ఇదిగో వస్తారు.. అదిగో వస్తారు’ అని అందరం అనుకుంటూ వచ్చాం. సడన్‌గా గుండెపోటు వచ్చిందని ప్రకటించారు. ఆ తర్వాత ‘ఇక లేరు’ అని వార్త విని షాకయ్యాను. ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పలేదు. ఐసీయూలోనూ లేరు. మరి, సడన్‌గా చనిపోవడమేంటి అనేది చాలామందిలోని ప్రశ్న. ⇔ జయలలిత విషయంలో మీరు స్పందించడం వెనక రాజకీయ నేతల అండదండలు ఉండి ఉంటాయని ఊహాగానం! భలేవారే! నాకెవరి అండదండలూ లేవండి. అంత సపోర్ట్ ఉండి ఉంటే.. నేను ఈ మధ్య ఓ పెద్ద నిర్ణయం తీసుకుని బయటికొచ్చినప్పుడు.. ఎక్కడ ఉండాలో తెలియక ఓ నెల రోజులు నా ఆఫీసులో ఉన్నాను. ఆ తర్వాత ఇల్లు చూసుకున్నాను. ఓ ఎమోషనల్ మూమెంట్ నుంచి నన్ను నేను బయటకు లాక్కుని మామూలు మనిషి కాగలిగాను. ఒకసారి నా జీవితం గురించి ఎనలైజ్ చేసుకున్నాను. ‘మనం ఎలాంటి హ్యుమన్ బీయింగ్? ఇన్నేళ్లు లైఫ్‌ని ఎలా లీడ్ చేశాం? ఇక మీద ఎలా ఉండాలి?’ అని ఆలోచించుకుని, ధైర్యంగా నిలబడ్డాను. అండదండలు మెండుగా ఉండి ఉంటే ఇంతలా ఎందుకు ఆలోచిస్తాను? ⇔జయలలిత అంటే మీకెందుకంత అభిమానం? ఆవిడకూ, మీకూ కనెక్షన్ ఏంటి? మృతదేహాన్ని చూసి అంతలా ఎమోషన్ అయ్యారెందుకని? ఆమె నా పెళ్లికి వచ్చి, ఆశీర్వదించారు. ఆ తర్వాత ఓసారి కలిశాను. మూడు నాలుగు నిమిషాలు మాట్లాడి ఉంటానేమో. అప్పుడూ ఆవిడంటే ఇష్టమని చెప్పలేదు. ‘ఆడవాళ్లు ధైర్యంగా బతకాలి’ అని ఆవిడ తన లైఫ్ ద్వారా చూపించారు. ధైర్యాన్ని వెతుక్కునే ప్రతి స్త్రీకీ జయలలితగారు గొప్ప ఆదర్శం. ఆవిడ జీవితం అందరికీ తెలిసిందే. జయలలితగారు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరు నాకిష్టం. అందుకే ఆవిడంటే చాలా అభిమానం. ⇔ ఆ మధ్య మోదీగారిని కలిశారు కాబట్టి జయలలితగారి గురించి ఆయనే మీతో ట్విట్టర్లో లెటర్ పెట్టించి ఉంటారనీ... అస్సలు లేదండి. ఈ విషయంలో వేరే విధంగా ఆలోచించొద్దు. హుందాగా బతకాలనుకునే ఓ మహిళగా సాటి మహిళ.. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకున్నాను. జయలలితగారు చాలా హుందాగా బతికారు. ఆవిడ చివరి రోజుల గురించి తెలుసుకోవాలనే తపన ఓ పౌరురాలిగా, ఆవిణ్ణి అభిమానించే వ్యక్తిగా నాకుంది. నేను నడుపుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’ గురించి మోదీగారితో మాట్లాడి, ఆయన సలహాలు తీసుకోవడానికే కలిశా. అంతే! అంత మాత్రానికే ఆయన మనోభావాలను నా భావాలుగా ట్విట్టర్లో పెట్టించేస్తారా? ⇔ ట్విట్టర్లో మీరు లెటర్ పెట్టాక వచ్చిన స్పందన? ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. జయలలితగారి చుట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఎంతమందికి ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘మీరెందుకు స్పందించారు?’ అని ఒక్కరు కూడా అడగలేదు. ⇔ మీ ఉత్తరానికి మోదీగారి నుంచి సరైన స్పందన వస్తుందనే అనుకుంటున్నారా? 99 శాతం వస్తుంది. ఆ విషయంలో డౌటే లేదు. మోదీగారు ప్రతిభావంతులు. దేశం కోసం ఆలోచించే వ్యక్తి. అందరి ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుందనే నమ్మకం ఉంది. ⇔ ట్విట్టర్లో మీ లేఖ చూశాక ప్రభుత్వం వేగంగా కదిలిందనుకోవచ్చా? అందుకు ఓ ఉదాహరణ టీటీడీ బోర్డ్ మెంబర్, అన్నాడీఎంకేలో ఒక వర్గానికి సన్నిహితుడని భావిస్తున్న శేఖర్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు.. ఓ సామాన్య పౌరురాలి ఆవేదనకు ప్రభుత్వం ఇంత చురుకుగా కదిలిందంటే అది హ్యాపీయే. కానీ, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐటీ దాడులనేవి ఇప్పటికిప్పుడు జరపలేరు. కొన్ని రోజులుగా పథకం వేసి, ఆ తర్వాత చేస్తారు. ⇔ ∙రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇది తొలి అడుగా? అస్సల్లేదండి. ఇంతకు ముందు చెప్పినట్లు నా ప్రస్తుత లక్ష్యం మా అమ్మాయి. వేరే దేని గురించీ ఆలోచించట్లేదు. ⇔ ∙‘విశ్వరూపం’ టైమ్‌లో జయలలితకీ, కమలహాసన్కీ మధ్య మనస్పర్థలొచ్చాయి. కమల్ నుంచి విడిపోయాక ఆయనపై కోపంతోనే ఇప్పుడు మీరు జయలలితపై స్పందించారని... ప్రపంచంలో ఇంతకన్నా అమానుషం మరోటి ఉండదు. నా మనసులో ఫీలింగ్‌కి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ముడిపెట్టడం సరి కాదు. పనీపాటా లేనివాళ్లు ఒక గదిలో కూర్చుని ఇలాంటివి మాట్లాడతారనుకుంటా. ఏదో విషయానికి మరేదో విషయంతో పోలిక పెడితే ఈ ప్రపంచంలో బతకడం కష్టం. ఇలాంటి పోలికలు పెట్టి, ‘మేం తెలివిగలవాళ్లం’ అని ఫీలైపోతుంటారేమో. అసలు నా వ్యక్తిగత విషయానికీ, జయ విషయానికీ పోలికేంటి? ⇔ అంటే... కమల్ మీద మీకెలాంటి కోపం లేదంటారు? ఆ వ్యక్తి మీద కోపం, కక్ష ఉంటే అంత హుందాగా ఆ ఇంటి నుంచి బయటకు రాను. ఆయన కూడా డిగ్నిఫైడ్ పర్సన్. మేమిద్దరం మా డిగ్నిటీని కాపాడుకున్నాం. విడిపోవాలన్నది ఇద్దరి నిర్ణయం. అది నేను స్పష్టంగా ఆ రోజు నా లెటర్ ద్వారా అందరికీ చెప్పా ను. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకిలా చేస్తాను? నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా హుందాగా బతికాను. డబ్బు సంపాదన కూడా ముఖ్యం అనుకోలేదు. జీవితంలో హుందాగా బతకాలనుకున్నాను. ⇔ దాదాపు పదిహేనేళ్లు కమల్‌గారితో కలిసి ఉన్నారు. సడన్‌గా బయటికొచ్చేశారు. యాభై ఏళ్ల వయసుకు దగ్గరవుతున్నప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం...? నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది అని ఆ రోజే ట్విట్టర్లో చెప్పాను. నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం. కానీ, తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘పరిస్థితిలో మార్పు వస్తుంది’ అని కొన్ని చాన్సులు ఇచ్చి చూసుకున్నాను. ‘ఇక ఇలానే ఉంటుంది’ అని ఇద్దరికీ తెలిసిపోయింది. అందుకే ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం లేచినప్పుడు ‘ఈ రోజు బాగుంటుంది. భవిష్యత్తు బాగుంటుంది’ అనే ఆలోచనతో నిద్ర లేవాలి. ఈరోజు ఎలా ఉంటుందో? ఎంత భారంగా గడుస్తుందో అనుకోకూడదు. ⇔ మీ టీనేజమ్మాయి సుబ్బలక్ష్మి ఈ మార్పునెలా తీసుకుంది? ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్’. వెరీ మెచ్యూర్డ్. మొత్తం అర్థం చేసుకుంది. ⇔ ‘నా జీవితంలో తొలి ప్రాధాన్యం నా కూతురు’ అని గతంలో అన్నారు. ఆమె ఎలా స్థిరపడాలనుకుంటున్నారు ఇప్పుడు చదువుకుంటోంది. ఏం చేయాలి? ఎలా సెటిల్ కావాలనే నిర్ణయాలు తీసుకోవడం చాలా తొందరపాటు అవుతుంది. కానీ, ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతాను. ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యం నా కూతురే. పిల్లలు తమను ఈ ప్రపంచంలో తీసుకురమ్మని అడగరు. తల్లితండ్రులు కంటారు. భూమ్మీదకు తీసుకురావడంతో పనైపోయిందనుకోకూడదు. వాళ్ల కోసమే బతకాలి. మన మీద ఆధారపడ్డ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. అప్పుడే ఆ మాతృత్వానికి ఓ అర్థం ఉంటుంది. ⇔ ప్రస్తుతం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ మధ్య రెండు సినిమాల్లో నటించారు. కంటిన్యూ అవుతారా? సినిమాల్లో నటించాలనుకుంటున్నా. సీరియల్స్ కూడా చేయాలనుకుంటున్నా. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేస్తా. నిర్మాతగానూ చేయాలనుంది. చూద్దాం. – డి.జి. భవాని -
జయ మరణాన్ని వివరించిన శశికళ
-
అమ్మ మృతి పై అనుమానాలున్నాయి