సాక్షి, చెన్నై : అపోలో ఆస్పత్రిలో చికిత్సలందుకుంటుండగా జయలలిత స్పృహలోకి వచ్చారా? అంటూ దీపక్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. జయ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఆర్ముగసామి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ కమిషన్ ఎదుట బుధవారం జయ అన్న కుమార్తె దీప హాజరయ్యారు. ఆమె పోయెస్ గార్డెన్‌లో పనిచేసిన రాజమ్మాళ్, ఇద్దరు డ్రైవర్ల వద్ద విచారణ జరపాలని న్యాయమూర్తితో తెలిపారు.
అంతేకాకుండా శశికళ కుటుంబీకులు 2011 నుంచి జయలలితను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు న్యాయమూర్తికి తెలిపారు. ఇలావుండగా జయలలిత అన్న కుమారుడు దీపక్ గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో రెండు గంటలకు పైగా న్యాయమూర్తి విచారణ జరిపారు. అతని వద్ద న్యాయమూర్తి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా ఆమెను చూశారా, ఆమె స్పృహలో ఉన్నారా? ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో జయ ఏ స్థితిలో ఉన్నారు? ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారు? ప్రశ్నలు వేశారు. ఇందుకు దీపక్ తగిన వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment