సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం నగరంలోని టి–హబ్‌ను 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. టి–హబ్‌లోని పలు ఇన్నోవేషన్ హబ్‌లైన వి–హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ (రిచ్), ఇమేజ్, తదితర కేంద్రాలను, వారు రూపొందించిన ఆవిష్కరణలను ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టి–హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను అందించిందని, స్టార్టప్‌లు, ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు టి–హబ్‌ను సందర్శించినవారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment