ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సస్పెన్షన్‌ | Amid Glare On Delhi Liquor Policy Two Bureaucrats Suspended | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇద్దరు ఐఏఎస్‌  అధికారులపై వేటు

Published Tue, Aug 23 2022 7:05 AM | Last Updated on Tue, Aug 23 2022 7:05 AM

Amid Glare On Delhi Liquor Policy Two Bureaucrats Suspended - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. లిక్కర్‌ పాలసీపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్‌కుమార్‌ తివారీని సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా, ఆనంద్‌కుమార్‌ డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement